వెయిట్రెస్‌కు భారీ టిప్‌ ఇచ్చిన హీరో | Jim Carrey delights waitress with USD 225 tip | Sakshi
Sakshi News home page

వెయిట్రెస్‌కు భారీ టిప్‌ ఇచ్చిన హీరో

Published Sat, Apr 9 2016 9:10 AM | Last Updated on Fri, Aug 24 2018 4:15 PM

వెయిట్రెస్‌కు భారీ టిప్‌ ఇచ్చిన హీరో - Sakshi

వెయిట్రెస్‌కు భారీ టిప్‌ ఇచ్చిన హీరో

న్యూయార్క్‌: హోటల్‌లో రుచికరమైన వంటకాలు వడ్డించే వెయిటర్లకు టిప్‌ ఇవ్వడం సర్వసాధారణమే. కానీ హాలీవుడ్‌ హీరో జిమ్‌ క్యారీ ఓ మహిళా వెయిటర్‌ను ఆశ్చర్యంలో ముంచెత్తాడు. ఆమెకు ఏకంగా 224 డాలర్లు (రూ. 15వేలు) టిప్‌గా ఇచ్చాడు. 'లయర్ లయర్‌', 'ద మాస్క్‌' వంటి చిత్రాల్లో నటించిన ఈ 53 ఏళ్ల నటుడు న్యూయార్క్ సిటీలో స్నేహితులతో కలిసి జల్సా చేశాడు. మిట్‌ప్యాకింగ్‌ జిల్లాలోని ప్రముఖ చెస్టర్ రెస్టారెంట్‌లో మిత్రులకు పార్టీ ఇచ్చాడు. సంప్రదాయ అమెరికన్ ఆహారం అందించడంలో పేరొందిన ఈ రెస్టారెంట్‌లో పాయింట్‌ నాయిర్‌ వైన్‌, లెమన్ చికెన్.. తదితర రుచికరమైన వంటలతో ఆనందంగా గడిపారు.

ఈ సందర్భంగా మంచి మూడ్‌లో ఉన్న ఆయన మరోసారి తన పెద్ద మనస్సు చాటుకున్నారని, వెయిట్రెస్‌కు 224 డాలర్ల టిప్ ఇచ్చారని ఆయన సన్నిహితులు చెప్పారు. ఈ విందులో స్నేహితులతో ఆయన చాలా సంతోషంగా గడిపారని న్యూయార్క్ పోస్టు తెలిపింది. గేన్స్‌వూర్ట్‌ హోటల్‌ లో భాగమైన ఈ రెస్టారెంట్‌లో వెయిటర్లకు జీతం కన్నా టిప్పే అధికంగా లభిస్తుందని చెప్తున్నారు. గతంలోనూ చాలామంది సెలబ్రిటీలు ఇక్కడ వెయిటర్లకు భారీగా టిప్‌ ఇచ్చారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement