Indian Rupee Value Falling Reasons: డాలర్ మారకంలో రూపాయి విలువ ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్‌లో పడిపోయింది. ఏకంగా 10 పైసలు బలహీనపడి 75.60కి పడిపోయింది. గడచిన 16 నెలల నెలల్లో (2020 జూలై 1 తర్వాత) రూపాయి ఈ స్థాయికి పతనం కావడం ఇదే తొలిసారి. ఈక్విటీ మార్కెట్ల నుంచి విదేశీ నిధుల బయటకు వెళుతుండడం, అంతర్జాతీయ మార్కెట్‌లో డాలర్ పటిష్టత వంటి అంశాలు దీనికి ప్రధాన కారణం.
కోవిడ్ 19 కొత్త వేరియంట్ ఒమిక్రాన్ భయాలు గ్లోబల్ ఎకానమీని వెంటాడుతుండడం, ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలహీనపడ్డం కూడా భారత్ కరెన్సీపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. ట్రేడింగ్‌లో రూపాయి 75.45 వద్ద ప్రారంభమైంది. మొదట్లో వచ్చిన లాభాలను నిలబెట్టుకోలేక పోయింది. అంతర్జాతీయంగా ఆర్థిక అనిశ్చితిపై భయాలు ఒకవైపు– వడ్డీరేట్లు పెరగవచ్చన్న అంచనాలు మరోవైపు నెలకొన్న నేనథ్యంలో డాలర్ ఇండెక్స్ కూడా పటిష్టంగా కొనసాగుతుండడం గమనార్హం.
గత రాత్రి 11 గంటల సమయంలో.. అంతర్జాతీయ ఫ్యూచర్స్ మార్కెట్‌లో డాలర్ మారకంలో రూపాయి విలువ నష్టాల్లో 75.65వద్ద ట్రేడవుతుండగా, ఆరు కరెన్సీ విలువల (యూరో, స్విస్ ఫ్రాంక్, జపనీస్ యన్, కెనడియన్ డాలర్, బ్రిటన్ పౌండ్, స్వీడిష్ క్రోనా) ప్రాతిపదకన లెక్కించే డాలర్ ఇండెక్స్ భారీ లాభాల్లో 96 ఎగువన ట్రేడవుతోంది. రూపాయికి ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్‌లో ఇప్పటి వరకూ ఇంట్రాడే కనిష్ట స్థాయి 76.92 (2020, ఏప్రిల్ 22వ తేదీ). ముగింపులో రికార్డు పతనం 76.87 (2020, ఏప్రిల్ 16వ తేదీ). కొత్త వేరియంట్ పరిణామాలు, దేశంలోకి విదేశీ నిధుల రాక వంటి అంశాలపై ఆధారపడి రూపాయి తదుపరి కదలికలు ఉంటాయని అంచనా వేస్తున్నారు ట్రేడ్ విశ్లేషకులు.
చదవండి: మూడో రోజూ ముందుకే!
Comments
Please login to add a commentAdd a comment