ముంబై: డాలరుతో మారకంలో రూపాయి విలువ ఇంటర్‌బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో 37 పైసలు బల హీనపడి 62.60 వద్ద ముగిసింది. నెలాఖరుకావడంతో దిగుమతిదారుల నుంచి డాలర్లకు డిమాండ్ పెరగడంతో రూపాయిపై ప్రతికూల ప్రభావం పడిం ది. దీనికితోడు రిజర్వ్ బ్యాంక్ శుక్రవారం రెపో రేటు ను పెంచడంతో వరుసగా రెండోరోజు కూడా స్టాక్ మార్కెట్లు డీలాపడ్డాయి. ఈ అంశాల నేపథ్యంలో సోమవారం ట్రేడింగ్‌లో రూపాయి తొలుత 62.55 వద్ద బలహీనంగా మొదలైంది. క్రితం ముగింపు 62.23కాగా, 62.34-62.73 మధ్య ఊగిసలాడింది.