Forex markets
-
ఫారెక్స్‌లో ఆర్బీఐ జోక్యంతో ఒడిదుడుకులకు కళ్లెం
ముంబై: ఫారెక్స్ మార్కెట్లో రిజర్వ్ బ్యాంక్ జోక్యం చేసుకోవడమనేది .. విదేశీ పెట్టుబడుల రాకపోకల వల్ల కరెన్సీ మారకంపరంగా తలెత్తే ఒడిదుడుకులను కట్టడి చేసేందుకు గణనీయంగా తోడ్పడుతోంది. రిజర్వ్ బ్యాంక్ విడుదల చేసిన తాజా బులెటిన్లోని అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. భారత్‌లో మారకం రేటు తీవ్ర హెచ్చుతగ్గులకు లోను కావడానికి విదేశీ పెట్టుబడుల ప్రవాహంలో మార్పులు కూడా కారణమని ఇందులో పేర్కొన్నారు. 2008–09లో అంతర్జాతీయంగా ఆర్థిక సంక్షోభ సమయంలో, 2013లో ఉద్దీపన ప్యాకేజీల ఉపసంహరణ వార్తలు వచ్చినప్పుడు, 2018లో ఐఎల్ఎఫ్ఎస్ సంక్షోభం తలెత్తినప్పుడు, ఆ తర్వాత కోవిడ్–19 మహమ్మారి సమయంలో రూపాయి ఒడిదుడుకులకు గురైనట్లు అధ్యయన నివేదిక వెల్లడించింది. ఆర్బీఐ మాజీ డిప్యుటీ గవర్నర్ మైఖేల్ పాత్రా సారథ్యంలోని బృందం దీన్ని రూపొందించింది. జనవరి 10తో ముగిసిన వారంలో భారత ఫారెక్స్ నిల్వలు 8.714 బిలియన్ డాలర్లు తగ్గి 625.871 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. -
మార్కెట్ రికార్డుల హ్యాట్రిక్
ముంబై: స్టాక్ సూచీల రికార్డుల జోరు మూడో రోజూ కొనసాగింది. ఐటీ, ఎఫ్ఎంసీజీ, టెలికం షేర్లు రాణించడంతో పాటు విదేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్ల అంశాలు కలిసొచ్చాయి. సెన్సెక్స్ 52 పాయింట్లు పెరిగి 80,717 వద్ద ముగిసింది. నిఫ్టీ 26 పాయింట్ల లాభంతో 24,613 వద్ద స్థిరపడింది. ముగింపు స్థాయిలు సూచీలకు సరికొత్త రికార్డు. ఉదయ లాభాలతో మొదలైన సూచీలు.., అధిక వాల్యుయేషన్ల ఆందోళనల తో పరిమిత శ్రేణిలో కదలాడాయి. అయినప్పటికీ.., ఒక దశలో సెన్సెక్స్ 233 పాయింట్లు బలపడి 80,862 వద్ద, నిఫ్టీ 133 పాయింట్లు ఎగసి 24,635 వద్ద జీవితకాల గరిష్టాలు నమోదు చేశాయి. ఫైనాన్షియల్ సరీ్వసెస్, యుటిలిటీ, బ్యాంకులు, క్యాపిటల్ గూడ్స్ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. వడ్డీరేట్ల తగ్గింపు అంచనాలతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు లాభాల బాటపట్టాయి.⇒ మొహర్రం సందర్భంగా బీఎస్ఈ, ఎన్ఎస్ఈలకు నేడు సెలవు. ట్రేడింగ్ జరగదు. అయితే కమోడిటీ, ఫారెక్స్ మార్కెట్లలో మాత్రం సాయంత్రంసెషన్‌లో ట్రేడింగ్ జరుగుతుంది.వేదాంతా క్విప్ ధర రూ. 461 వేదాంతా అర్హతగల సంస్థాగత ఇన్వెస్టర్లకు షేర్ల జారీ (క్విప్)కి తెరతీసింది. షేరుకి రూ. 461.26 ఫ్లోర్ ధరలో రూ. 8,500 కోట్లు సమీకరించనుంది. నిధులను రుణ చెల్లింపులు, పెట్టుబడి వ్యయాలకు వినియోగించనుంది. సోమవారం ముగింపు ధర రూ. 459.4తో పోలిస్తే ఫ్లోర్ ధర స్వల్ప ప్రీమియం. వేదాంతా షేరు బీఎస్ఈలో 1% నీరసించి రూ. 456 వద్ద ముగిసింది. -
‘డాలర్’కు భారత్ అంటేనే ఇష్టం..!
నిరంతర వాణిజ్యం, కరెంట్ ఖాతా లోటు సమర్థంగా నిర్వహించడానికి ఐటీ రంగం కీలకంగా మారనుందని విశ్లేషకులు అంటున్నారు. ఒకవేళ ఐటీ ఎగుమతులు మందగిస్తే దేశ ఫారెక్స్ నిల్వలు తరిగి అది రూపాయి విలువపై ప్రభావం చూపనుంది. ఐటీ రంగం పెద్ద మొత్తంలో ఫారెక్స్ ఆదాయాన్ని తీసుకురావడమే కాదు.. ఇతర ఎగుమతి ఆధారిత రంగాలతో పోలిస్తే ఇందులో ఫారెక్స్ వ్యయాలు కూడా తక్కువ. ఐటీ కంపెనీల ఫారెక్స్ ఖర్చులు వాటి ఎగుమతి ఆదాయంలో సగం కంటే తక్కువ ఉంటుందని అంచనా. మరోవైపు కార్పొరేట్ రంగంలో అతిపెద్ద ఎగుమతిదారులుగా ఉన్న ఆయిల్ అండ్ గ్యాస్, మైనింగ్ కంపెనీల ఫారెక్స్ ఖర్చులు వాటి ఫారెక్స్ ఆదాయాలను మించిపోతాయి. ఇటీవల స్టాక్‌మార్కెట్లు బాగా పుంజుకోవడంతో విదేశీ సంస్థాగత పెట్టుబడులు భారీగా భారత్‌లోకి వచ్చినట్లు తెలుస్తోంది. తాజాగా మార్కెట్ సూచీలు జీవితకాల గరిష్ఠాలను చేరుతున్నాయి. ప్రధానంగా అమెరికాకు చెందిన ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ ఛైర్మన్ జెరొమ్‌పావెల్ కీలక వడ్డీరేట్లపై ఇటీవల చేసిన ప్రకటన మార్కెట్లకు దన్నుగా నిలుస్తోంది. దాంతో అంతర్జాతీయ మార్కెట్లో ఎప్పటినుంచో అనిశ్చితి కొనసాగుతున్న ఐటీ స్టాక్‌లు భారీగా ర్యాలీ అవుతున్నాయి. ఐటీ కంపెనీలు అధికంగా డాలర్లలోనే వ్యాపారం సాగిస్తాయి. దాంతో భారత్‌లోని టాప్ కంపెనీల్లో ఎఫ్ఐఐలు అధికంగా పెట్టుబడి పెట్టడంతో దేశంలోని ఫారెక్స్ నిలువలు పెరిగినట్లు కొందరు నిపుణులు చెబుతున్నారు. దేశంలోని విదేశీ మారక ద్రవ్యం (ఫారెక్స్) నిల్వలు పెరిగాయి. ఈ నెల 15వ తేదీ కంటే ముందు వారానికి 9.11 బిలియన్ డాలర్లు(రూ.75 వేలకోట్లు) పెరుగుదలతో 615.97 బిలియన్ డాలర్లకు(రూ.51.2 లక్షల కోట్లు) ఫారెక్స్ నిల్వలు పెరిగాయని ఆర్బీఐ శుక్రవారం వెల్లడించింది. ఈ నెల 8వ తేదీ కంటే ముందు వారానికి ఫారెక్స్ నిల్వలు 2.82 బిలియన్ డాలర్లు(రూ.23 వేలకోట్లు) పుంజుకుని 606.86 బిలియన్ డాలర్లకు(రూ.50.5 లక్షల కోట్లు) చేరుకున్నాయి. విదేశీ కరెన్సీ నిల్వలు 8.35 బిలియన్ డాలర్లు(రూ.68 వేలకోట్లు) పెరిగి 545.05 బిలియన్ డాలర్ల(రూ.45 లక్షల కోట్లు) వద్దకు చేరాయి. బంగారం నిల్వలు 446 మిలియన్ డాలర్ల(రూ.3700 కోట్లు) పెరుగుదలతో 47.58 బిలియన్ డాలర్లు(రూ.4 లక్షల కోట్లు), స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ 135 మిలియన్ డాలర్ల(రూ.1100 కోట్లు) నుంచి 18.32 బిలియన్ డాలర్లకు(రూ.1.5 లక్షల కోట్లు) పుంజుకున్నాయి. ఇదీ చదవండి: రాష్ట్రాలకు రూ.72,961 కోట్లు విడుదల.. ఎందుకంటే.. ఐఎంఎఫ్‌లో ఫారెక్స్ నిల్వలు 181 మిలియన్ డాలర్లు పెరిగి 5.02 బిలియన్ డాలర్లకు(రూ.41 వేల కోట్లు) చేరాయి. 2021 అక్టోబర్‌లో భారత ఫారెక్స్ నిల్వలు 645 బిలియన్ల డాలర్ల(రూ.53 లక్షల కోట్లు) ఆల్ టైం రికార్డు నెలకొల్పాయి. అంతర్జాతీయ పరిణామాల కారణంగా డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ పడిపోతున్నపుడు ఆర్బీఐ బహిరంగ మార్కెట్లో డాలర్లను విక్రయిస్తూ రూపాయి విలువ మరింత పడిపోకుండా ఆదుకుంటుంది. -
బలిప్రతిపాద: స్టాక్‌మార్కెట్లకు బుధవారం సెలవు
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లకు బుధవారం సెలవు. బలిప్రతిపాద సందర్భంగా బీఎస్ఈ, ఎన్సీఈ మార్కెట్లు పనిచేయవు. బులియన్ సహా హోల్‌సేల్ కమోడిటీ మార్కెట్లు కూడా పనిచేయవు. ఫారెక్స్, కమోడిటీ ఫ్యూచర్స్ మార్కెట్లలో కూడా ఎలాంటి ట్రేడింగ్ కార్యకలాపాలు ఉండవు. బలి ప్రతిపాదను బలిపాడ్యమి, పాడ్వ, విరప్రతిపాద లేదా ద్యుతప్రతిపాద అని కూడా పిలుస్తారు. దీపావళికి నాలుగు రోజుల తరువాత వచ్చే ఈ పండుగను దైత్య రాజు బలి చక్రవర్తి భూమిపైకి వచ్చే రోజుగా భావిస్తారు. కాగా అక్టోబర్ 25న, సెన్సెక్స్ 287.70 పాయింట్లు లేదా 0.48శాతం క్షీణించి 59,544 వద్ద నిఫ్టీ 74.50 పాయింట్లు లేదా 0.42శాతం క్షీణించి 17,656 వద్ద ముగిసిన సంగతి తెలిసిందే. -
‘డాలర్’ డ్రీమ్ ఇక చౌకే!!
అమ్మబోతే అడవి. కొనబోతే కొరివి!!. ఈ సామెత బ్యాంకుల్లో డాలర్ లావాదేవీలు జరిపే రిటైల్ కస్టమర్లకు అనుభవంలోకి వస్తుంటుంది. బ్యాంకులు విదేశీ కరెన్సీని కస్టమర్‌కు అమ్మేరేటుకు, వారి నుంచి కొనే రేటుకు మధ్య బోలెడు వ్యత్యాసం ఉంటుంది. ఇకపై బ్యాంకుల ఈ భారీ బాదుడుకు ఆర్బీఐ చెక్ చెబుతోంది. ఆన్లైన్ ప్లాట్‌ఫామ్ ద్వారా ఫారిన్ కరెన్సీ (ఫారెక్స్) లావాదేవీలు జరిపే వీలును రిటైల్ కస్టమర్లకు ఆర్బీఐ కల్పించనుంది. టూరిస్టు వీసా వచ్చిందని, చదువులకని, ఉద్యోగాలకని ఏటా ఇండియా, అమెరికా మధ్య లక్షల మంది ప్రయాణిస్తుంటారు. ఇలా అమెరికా యాత్ర పెట్టుకున్నవాళ్లంతా రూపాయలను డాలర్లలోకి మార్చుకోవడం, అక్కడ నుంచి వచ్చాక డాలర్లను రూపాయల్లోకి మార్చుకోవడం తప్పని సరి కార్యక్రమమనే చెప్పాలి. అమెరికాయే కాదు. విదేశాల్లో దాదాపు ఎక్కడికెళ్లినా అంతర్జాతీయ కరెన్సీగా డాలర్ చెల్లుతుంది కనుక... అక్కడ లోకల్ కరెన్సీని తీసుకోవాలన్నా డాలర్‌తో ఈజీ కనుక అంతా డాలర్లవైపే మొగ్గుతారు. ఈ డాలర్లకున్న క్రేజ్ దృష్టిలో ఉంచుకొని బ్యాంకులు ఇలాంటి కస్టమర్లకు డాలర్లు అమ్మేటప్పుడు భారీ ప్రీమియంలు వసూలు చేస్తుంటాయి. కస్టమర్లు డాలర్లు కొనుగోలు చేసే సమయంలో ఎక్చేంజ్ రేట్‌పై దాదాపు 2 శాతం ప్రీమియంతో విక్రయించడం, అదే కస్టమర్లు డాలర్లను విక్రయించడానికి వచ్చినప్పుడు ఎక్చేంజ్ రేటుపై దాదాపు 2 శాతం డిస్కౌంట్‌తో కొనుగోలు చేయడం బ్యాంకులకు పరిపాటిగా మారింది. ఒకవేళ కస్టమరు క్రెడిట్‌కార్డు ద్వారా డాలర్ కొనాలంటే మరో 3 శాతం ప్రీమియం చెల్లించుకోవాల్సి వస్తుంటుంది. ఇలాంటి కస్టమర్ కష్టాలకు త్వరలో విముక్తి లభించనుంది. ఫారెక్స్ మార్పిడి విషయంలో బ్యాంకులు విధించే భారీ మార్జిన్ల కారణంగా నష్టపోతున్న కస్టమర్లకు త్వరలో ఊరట కలగనుంది. వచ్చే ఆగస్టు నుంచి రిటైల్ కస్టమర్లకు దాదాపు ఎక్చేంజ్ రేటుకు సమానంగానే బ్యాంకులు డాలర్లను అమ్మడం, కొనడం చేయాల్సి ఉంటుంది. అంతేకాక బ్యాంకులన్నీ ఈ అమ్మకాలు, కొనుగోళ్లను ఒకే ఉమ్మడి ఆన్లైన్ ప్లాట్‌ఫామ్‌పై చేయాల్సి ఉంటుంది. రెండేళ్లకు కార్యరూపం రిటైల్ కస్టమర్లకు బ్యాంకులు వసూలు చేసే భారీ మార్జిన్ల నుంచి ఊరట కలిగించాలని 2017లోనే ఆర్బీఐ నిర్ణయించింది. 2017 అక్టోబర్‌లో దీనికి సంబంధించి చర్చాపత్రం విడుదల చేసింది కూడా. తరవాత క్లియరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో (సీసీఐఎల్) కలిసి రిటైల్ ఇన్వెస్టర్లకు ఒక ఆన్లైన్ ప్లాట్‌ఫామ్‌ను రూపొందించింది. తొలుత ఆరంభంలో వెయ్యి డాలర్లు, తర్వాత ప్రతిసారీ 500 డాలర్ల చొప్పున ఈ ప్లాట్‌ఫామ్‌పై అమ్మకాలు, కొనుగోళ్లకు అవకాశం కల్పించాలని ఆర్బీఐ భావించింది. కానీ ఎంత మొత్తాన్నయినా ఈ ప్లాట్‌ఫామ్‌పై అనుమతించాలని ఆర్బీఐ తాజాగా భావిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్లాట్‌ఫామ్‌పై గరిష్ఠ పరిమితి 5 లక్షల డాలర్లు. తొలుత డాలర్ల అమ్మకాలు, కొనుగోళ్లకు మాత్రమే ఈ ప్లాట్‌ఫామ్ ఉపయుక్తంగా ఉంటుంది. ఆ తర్వాతి దశల్లో ఇతర కరెన్సీలకు దీన్ని విస్తరిస్తారు. ఈ ప్లాట్‌ఫామ్‌పై వచ్చే రిటైల్ ఆర్డర్లన్నింటినీ కలిపి మార్కెటబుల్ లాట్స్గా మార్చి ఇంటర్‌బ్యాంక్ మార్కెట్లో ట్రేడ్ చేస్తారు. దీంతో కస్టమర్లకు బ్యాంకుల మధ్యన జరిగే ఎక్చేంజ్ రేటే వర్తిస్తుంది. జూలై 1న రిజిస్ట్రేషన్లు ఆరంభం ప్లాట్‌ఫామ్‌పై కస్టమర్ల రిజిస్ట్రేషన్లు జూలై 1 నుంచి ఆరంభమవుతాయని భారత ఫారిన్ ఎక్చేంజ్ డీలర్ల సమాఖ్య తెలిపింది. ఆగస్టు 5 నుంచి ప్లాట్‌ఫామ్‌పై ట్రేడింగ్ ప్రారంభమవుతుందని సంబంధిత వర్గాల సమాచారం. ఆన్లైన్ ప్లాట్‌ఫామ్‌పై ఎక్కువమంది కస్టమర్లు పాల్గొనేందుకు ఒక నెల ముందే రిజిస్ట్రేషన్లను ఆర్బీఐ ఆరంభించిందని, ఎంత మొత్తంలో లావాదేవీలు జరపవచ్చనే విషయం ఆర్బీఐ త్వరలో నిర్ణయిస్తుందని, ఒక్క రూపాయి లావాదేవీనైనా సరే సీసీఐఎల్ సెటిల్ చేస్తుందని ఫారెక్స్ నిపుణులు చెబుతున్నారు. త్వరలో ఈ ప్లాట్‌ఫామ్‌కు సంబంధించిన యాప్‌ను విడుదల చేస్తారు. రిజిస్ట్రేషన్ సమయంలో కస్టమర్లు బేసిక్ సమాచారం అం దించాల్సి ఉంటుంది. సదరు కస్టమర్‌కు తన బ్యాంకు ట్రేడింగ్ లిమిట్ నిర్ధారిస్తుంది. ఈ పరిమితికి అనుమతి వచ్చాక కస్టమర్‌కు సీసీఐఎల్ లాగిన్ వివరాలు పంపుతుంది. ఈ వివరాలతో లాగినై కస్టమర్ ఆర్డర్లను ఉంచడం, కాన్సిల్ చేయడం చేసుకోవచ్చు. ఎప్పటికప్పుడు ఇంటర్ బ్యాంక్ ఎక్చేంజ్రేట్లు ప్లాట్‌ఫామ్‌పై కనిపిస్తుంటాయి. కస్టమర్ నేరుగా ఆ రేట్లు పొందలేడు, కొందరు కస్టమర్ల ఆర్డర్లన్నింటినీ కలిపి ఒక లాట్‌గా మార్చి లావాదేవీ నిర్వహిస్తారు. అందువల్ల స్పాట్ రేటుతో పోలిస్తే కస్టమర్‌కు వచ్చే రేటులో స్వల్పతేడా ఉండొచ్చు. దీనికితోడు కస్టమర్‌కు చెందిన బ్యాంకు స్వల్ప రుసుమును సదరు లావాదేవీకి వసూలు చేస్తుంది. అనంతరం కస్టమ ర్ లావాదేవీకి వచ్చిన రసీదు తీసుకొని తన బ్యాం కుకు వెళ్లి డాలర్లను తీసుకోవడం, లేదా జమ చేయడం చేస్తారు. ప్లాట్‌ఫామ్‌ను స్పెక్యులేషన్‌కు వినియోగించకుండా జాగ్రత్తలు చేపడతారు. -
మార్కెట్లకు రేపు సెలవు
వినాయక చవితి సందర్భంగా బాంబే స్టాక్ ఎక్స్ఛేంజి (బీఎస్ఈ), నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజి (ఎన్ఎస్ఈ), విదేశీ మారక ద్రవ్య మార్కెట్లతో సహా అన్ని రకాల మార్కెట్లకు గురువారం సెలవు ప్రకటించారు. దేశవ్యాప్తంగా ఉన్న కమోడిటీ మార్కెట్లు కూడా సెలవు ఉంటుందని తెలిపారు. -
రూపాయి 58 పైసలు డౌన్
ముంబై: దేశీ స్టాక్ మార్కెట్ల పతనబాట, ఎగుమతిదారుల నుంచి డాలర్లకు డిమాండ్ ప్రభావంతో రూపాయి భారీగా క్షీణించింది. గురువారం డాలరుతో రూపాయి మారకం విలువ 58 పైసలు నష్టపోయి 61.83 వద్ద ముగిసింది. నెలరోజుల వ్యవధిలో ఇంత ఎక్కువగా పతనం కావడం ఇదే తొలిసారి. అంచనాలకంటే ముందుగానే అమెరికా ఫెడరల్ రిజర్వ్(ఫెడ్) సహాయ ప్యాకేజీల ఉపసంహరణ(ట్యాపరింగ్)ను మొదలుపెట్టొచ్చనే భయాలు మళ్లీ జోరందుకుంటున్నాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా పలు ప్రధాన కరెన్సీలతో డాలరు విలువ పుంజుకుంటోందని, ఇది దేశీ కరెన్సీపై ప్రతికూలతకు దారితీస్తున్నట్లు ఫారెక్స్ డీలర్లు చెబుతున్నారు. చమురు కంపెనీల నుంచి తాజాగా డాలర్లకు డిమాండ్ పెరగడం, స్టాక్ మార్కెట్ వరుసగా మూడోరోజూ నష్టాల్లోకి జారిపోవడం వంటివి రూపాయి సెంటిమెంట్‌ను బలహీనపరిచాయని ఇండియా ఫారెక్స్ అడ్వైజర్స్ సీఈవో అభిషేక్ గోయెంకా పేర్కొన్నారు. -
కాస్త కోలుకున్న రూపాయి..
ముంబై: దేశీ కరెన్సీ ఐదు రోజుల వరుస పతనానికి ఎట్టకేలకు అడ్డుకట్టపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ బుధవారం 41 పైసలు కోలుకొని 63.30 వద్ద స్థిరపడింది. ఎగుమతిదారులు, బ్యాంకులు తాజాగా డాలర్ల అమ్మకాలకు దిగడంతో రూపాయికి కాస్త వెన్నుదన్నుగా నిలిచిందని ఫారెక్స్ మార్కెట్ వర్గాలు చెప్పాయి. కాగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కరెంట్ అకౌంట్ లోటు గత అంచనాల కంటే చాలా తక్కువగా 56 బిలియన్ డాలర్లకు(జీడీపీలో 3 శాతం లోపే) పరిమితం కావచ్చని ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ చేసిన ప్రకటన కూడా దేశీ కరెన్సీపై సానుకూల ప్రభావం చూపింది. కాగా, గడచిన ఐదు రోజుల్లో 209 పైసలు(3.39%) పతనమై రెండు నెలల కనిష్టానికి పడిపోయిన సంగతి తెలిసిందే. -
రూపాయి 37 పైసలు డౌన్
ముంబై: డాలరుతో మారకంలో రూపాయి విలువ ఇంటర్‌బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో 37 పైసలు బల హీనపడి 62.60 వద్ద ముగిసింది. నెలాఖరుకావడంతో దిగుమతిదారుల నుంచి డాలర్లకు డిమాండ్ పెరగడంతో రూపాయిపై ప్రతికూల ప్రభావం పడిం ది. దీనికితోడు రిజర్వ్ బ్యాంక్ శుక్రవారం రెపో రేటు ను పెంచడంతో వరుసగా రెండోరోజు కూడా స్టాక్ మార్కెట్లు డీలాపడ్డాయి. ఈ అంశాల నేపథ్యంలో సోమవారం ట్రేడింగ్‌లో రూపాయి తొలుత 62.55 వద్ద బలహీనంగా మొదలైంది. క్రితం ముగింపు 62.23కాగా, 62.34-62.73 మధ్య ఊగిసలాడింది. -
రూపీ .. మళ్లీ టపీ
ముంబై: కేంద్ర ఆర్థిక మంత్రి పీ చిదంబరం, రిజర్వు బ్యాంకు ఎన్ని ధైర్యవచనాలు వల్లించినా... దేశీ కరెన్సీ మాత్రం చిక్కిశల్యమవుతూనే ఉంది. సోమవారం డాలరుతో రూపాయి మారకం విలువ మళ్లీ కుప్పకూలింది. 110 పైసలు పడిపోయి 64.30వద్ద స్థిరపడింది. గత శుక్రవారంనాటి లాభాలు పూర్తిగా ఆవిరయ్యాయి. మరోపక్క, బ్రిటిష్ పౌండ్తో కూడా రూపాయి విలువ జారిపోయింది. క్రితం ముగింపు 98.47తో పోలిస్తే... 165 పైసలు దిగజారి 100.12కు పడిపోయింది. ముఖ్యంగా నెలాఖరులో దిగుమతిదారుల నుంచి డాలర్లకు డిమాండ్ పోటెత్తడం, విదేశీ పెట్టుబడి నిధుల తిరోగమనం రూపాయి క్షీణతకు పురిగొల్పాయని ఫారెక్స్ డీలర్లు పేర్కొన్నారు. ట్రేడింగ్ చివర్లో దేశీ స్టాక్‌మార్కెట్ల బలహీనత, అంతర్జాతీయంగా డాలరు విలువ పుంజుకోవడం కూడా ప్రభావం చూపినట్లు చెప్పారు. మరోపక్క, భారత ఆర్థిక పరిస్థితులు చాలా బలహీనంగా ఉన్నాయని గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ ఫిచ్ పేర్కొంది. ఈ ఏడాది ద్రవ్యలోటు లక్ష్యాన్ని గనుక చేరకోలేకపోతే దేశ సార్వభౌమ(సావరిన్) రేటింగ్‌ను డౌన్‌గ్రేడ్‌చేసే అవకాశాలున్నాయని హెచ్చరించింది. ఇది కూడా దేశీ కరెన్సీపై ప్రతికూల ప్రభావాన్ని చూపినట్లు మార్కెట్ వర్గాలు వ్యాఖ్యానించాయి. ఇంటర్‌బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో రూపాయి ట్రేడింగ్ క్రితం ముగింపు 63.20తో పోలిస్తే సోమవారం 63.65 వద్ద బలహీనంగా ప్రారంభమైంది. ఆతర్వాత క్షీణత జోరందుకుని ఒకానొకదశలో 64.75కు కూడా పడిపోయింది. అయితే, చివర్లో ఆర్బీఐ కొంత జోక్యం చేసుకొని ప్రభుత్వరంగ బ్యాంకులతో డాలర్లను విక్రయింపజేయడంతో రికవరీ జరిగినట్లు డీలర్లు పేర్కొన్నారు. దీంతో 64.30 వద్ద ముగిసింది. రూపాయి స్థిరీకరణకు మరిన్ని చర్యలు తీసుకుంటామని, నిరాశావాదం అక్కర్లేదంటూ ఆర్థిక మంత్రి చిదంబరం చేసిన వ్యాఖ్యలతో గత శుక్రవారం రూపాయి విలువ ఏకంగా 135 పైసలు ఎగబాకిన సంగతి తెలిసిందే. అయితే, అంతకుముందురోజు దేశీ కరెన్సీ విలువ మునుపెన్నడూ లేనివిధంగా 65దిగువకు జారిపోయి ఇంట్రాడేలో 65.56 ఆల్‌టైమ్ కనిష్టాన్ని తాకింది. చివరకు 64.55 వద్ద స్థిరపడింది. ఇదే ఇప్పటిదాకా ఆల్‌టైమ్ కనిష్ట ముగింపు. విదేశీ ఇన్వెస్టర్లు వెనక్కి... చమురు దిగుమతిదారుల నుంచి డాలర్లకు డిమాండ్ వెల్లువెత్తడం రూపాయిపై ఒత్తిడి పెంచిందని డెవలప్మెంట్ క్రెడిట్ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్ నవీన్ రఘువంశీ పేర్కొన్నారు. మరోపక్క, స్టాక్, బాండ్ మార్కెట్ల నుంచి విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల(ఎఫ్ఐఐ) తిరోగమనం కొనసాగుతూనే ఉంది. ఈ ఏడాది ఇప్పటిదాకా 420 కోట్ల డాలర్ల బాండ్లను, గడిచిన ఆరు ట్రేడింగ్ సెషన్లలో 75 కోట్ల డాలర్ల విలువైన షేర్లను నికరంగా వారు విక్రయించడం దీనికి నిదర్శనం. దీనికి అడ్డుకట్టవేయాలంటే తక్షణం ప్రభుత్వం విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు మరిన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అల్పరి ఫైనాన్షియల్ సర్వీసెస్(ఇండియా) సీఈవో ప్రమిత్ బ్రహ్మభట్ వ్యాఖ్యానించారు. కాగా, గత శనివారం టాప్ బ్యాంకర్లు, ఎఫ్ఐఐలతో ఆర్థికశాఖ ఉన్నతాధికారులు, చిదంబరం భేటీ అయిన సంగతి తెలిసిందే. రూపాయి స్థిరీకరణ, మరిన్ని విదేశీ పెట్టుబడులను ఆకర్షించేవిధంగా చర్యలు ఉంటాయని ఆర్థిక సేవల కార్యదర్శి రాజీవ్ టక్రూ పేర్కొన్నారు కూడా.