ఆల్టైం గరిష్టానికి ఫారెక్స్ నిల్వలు | South Korea's Forex Reserves Reached All-time High in Sept. | Sakshi
Sakshi News home page

ఆల్టైం గరిష్టానికి ఫారెక్స్ నిల్వలు

Published Sat, Oct 8 2016 1:51 AM | Last Updated on Thu, Oct 4 2018 5:26 PM

ఆల్టైం గరిష్టానికి ఫారెక్స్ నిల్వలు - Sakshi

ఆల్టైం గరిష్టానికి ఫారెక్స్ నిల్వలు

ముంబై: దేశంలోని విదేశీ మారక నిల్వలు సెప్టెంబర్ 30తో ముగిసిన వారంలో 1.22 బిలియన్ డాలర్ల మేర ఎగసి 371.99 బిలియన్ డాలర్లకు చేరాయి. ఇది ఆల్‌టైం గరిష్ట స్థాయి. విదేశీ కరెన్సీ అసెట్స్‌లో పెరుగుదల కారణంగానే ఫారెక్స్ నిల్వలు సరికొత్త శిఖరాగ్రానికి ఎగసినట్లు ఆర్‌బీఐ గణాంకాలు పేర్కొంటున్నాయి.

విదేశీ కరెన్సీ అసెట్స్ 1.46 బిలియన్ డాలర్ల పెరుగుదలతో 346.71 బిలియన్ డాలర్లుగా చేరాయి. బంగారం నిల్వలు 236.4 మిలియన్ డాలర్ల తగ్గుదలతో 21.40 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. కాగా కడపటి వారంలో ఫారెక్స్ నిల్వలు 370.76 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ఇక ఫారెక్స్ నిల్వల గరిష్ట స్థాయి ఇదివరకు (సెప్టెంబర్ 9తో ముగిసిన వారంలో) 371.27 బిలియన్ డాలర్లుగా ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement