100 కోట్ల డాలర్లు ఖర్చు చేస్తాడంట | Trump plans to raise USD 1 billion for presidential campaign | Sakshi
Sakshi News home page

100 కోట్ల డాలర్లు ఖర్చు చేస్తాడంట

Published Wed, May 11 2016 1:49 PM | Last Updated on Thu, Apr 4 2019 5:04 PM

100 కోట్ల డాలర్లు ఖర్చు చేస్తాడంట - Sakshi

100 కోట్ల డాలర్లు ఖర్చు చేస్తాడంట

వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష బరిలో ఉన్న రిపబ్లికన్ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ భారీ మొత్తంలో ఎన్నికల కోసం ఖర్చు చేయనున్నారు. నవంబర్ లో జరిగే అసలైన పోరుకోసం తన సొంత ఖాతా నుంచి విరాళాల సేకరణ ద్వారా దాదాపు 100కోట్ల డాలర్లు వెచ్చించనున్నారు. ఇదే జరిగితే ఇప్పటి వరకు జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఇదే అత్యంత భారీ వ్యయంగా నిలవనుంది.

తన సొంతంగా భారీ మొత్తంలో ఖర్చుచేయడంతోపాటు నిధుల సేకరణ కూడా చేయనున్నానని, తాను ఊహించిన దానికంటే ఎక్కువగానే విరాళాలు రావొచ్చని అవి 100 కోట్ల డాలర్లు ఉండొచ్చని ఆయన చెప్పారు. వర్జీనియా, నెబ్రాస్కాలో జరిగిన ప్రైమరీ ఎన్నికల్లో గెలిచిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాలు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement