కొత్త కనిష్టం వద్ద ముగింపు
వరుసగా రెండో రోజు దేశీ కరెన్సీ పతనమైంది. డాలరుతో మారకంలో తాజాగా 12 పైసలు నీరసించింది. 84.72 వద్ద ముగిసింది. వెరసి రెండో రోజూ సరికొత్త కనిష్టం వద్ద స్థిరపడింది. గత వారాంతాన సైతం 13 పైసలు నష్టపోయి 84.60 వద్ద నిలిచింది. జూలై–సెపె్టంబర్‌లో దేశ జీడీపీ వృద్ధి 5.4 శాతానికి మందగించడం, బ్రిక్ దేశాలపై యూఎస్ టారిఫ్‌ల విధింపు అంచనాలు, విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు ప్రభావం చూపినట్లు ఫారెక్స్ వర్గాలు పేర్కొన్నాయి.
ప్రపంచ ప్రధాన కరెన్సీలతో మారకంలో కొద్ది రోజులుగా డాలరు బలపడుతున్న నేపథ్యంలో రూపాయి విలువ కోల్పోతూ వస్తున్న సంగతి తెలిసిందే. కాగా.. ఇంటర్‌బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో రూపాయి 84.59 వద్ద ప్రారంభమైంది. తదుపరి 84.73వరకూ క్షీణించింది. అంతర్జాతీయంగా డాలరు ఇండెక్స్ 0.5 శాతం పుంజుకొని 106.27 వద్ద కదులుతోంది.
Comments
Please login to add a commentAdd a comment