నాట్కో ఫార్మా... ప్లాంట్లలో యూఎస్ఎఫ్డీఏ తనిఖీలు | Natco Pharma slips on USFDA observations | Sakshi
Sakshi News home page

నాట్కో ఫార్మా... ప్లాంట్లలో యూఎస్ఎఫ్డీఏ తనిఖీలు

Published Tue, Mar 29 2016 1:05 AM | Last Updated on Fri, Aug 24 2018 9:01 PM

నాట్కో ఫార్మా... ప్లాంట్లలో యూఎస్ఎఫ్డీఏ తనిఖీలు - Sakshi

నాట్కో ఫార్మా... ప్లాంట్లలో యూఎస్ఎఫ్డీఏ తనిఖీలు

హైదరాబాద్: నాట్కో ఫార్మాకు చెందిన రెండు ప్లాంట్లలో అమెరికా ఎఫ్‌డీఏ ఇటీవల తనిఖీలు జరిపింది. చెన్నై సమీపంలోని మనాలిలో ఉన్న యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇన్‌గ్రెడియంట్స్ తయారు చేసే ప్లాంట్‌లోనూ, హైదరాబాద్ సమీపంలోని కొత్తూరులోని ఫార్మాస్యూటికల్ ప్లాంట్‌ల్లో యూఎస్‌ఎఫ్‌డీఏ ఈ తనిఖీలు నిర్వహించిందని నాట్కో ఫార్మా ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ఏడాది ఫిబ్రవరి మార్చిల్లో ఈ తనిఖీలు జరిగాయని పేర్కొంది. ఈ రెండు ప్లాంట్లకు సంబంధించి యూఎస్‌ఎఫ్‌డీఏ 483 అభ్యంతరాలను వ్యక్తం చేసిందని, అయితే అవి స్వల్పమైనవేనని వివరించింది. వీటికి తగిన స్పందనను ఎఫ్‌డీఐకి నివేదించామని, ఈ రెండు ప్లాంట్ల ఉత్పత్తులపై భవిష్యత్తులో ఎలాంటి తీవ్రమైన ప్రభావం ఉండబోదని ఆశిస్తున్నట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో బీఎస్‌ఈలో ఈ షేరు 13 శాతం క్షీణించి రూ. 1,409 వద్ద ముగిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement