cash crunch
-
1.76 లక్షల ఉద్యోగులకు మరోసారి షాక్!
సాక్షి, న్యూఢిల్లీ : ప్రభుత్వరంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బిఎస్ఎన్ఎల్) మరోసారి ఉద్యోగులకు షాక్ ఇచ్చింది. ఆర్థిక సంక్షోభం కారణంగా జీతాలు చెల్లించలేమంటూ మరోసారి చేతులెత్తేసింది. తద్వారా 1.76 లక్షల మంది ఉద్యోగులు ప్రభావితమయ్యారు. జూన్ నెలకు సంబంధించి రూ. 850 కోట్ల విలువైన జీతాలతో పాటు, కార్యకలాపాలను నిర్వహించడం చాలా కష్టంగా మారిందంటూ ప్రభుత్వం నుండి తక్షణ నిధుల ఇన్ఫ్యూషన్ కోరింది. ఈ మేరకు జూన్ 18వ తేదీన బిఎస్ఎన్ఎల్ కార్పొరేట్ బడ్జెట్ , బ్యాంకింగ్ విభాగం, సీనియర్ జనరల్ మేనేజర్ పురన్ చంద్ర , టెలికాం మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శికి రాసిన లేఖ రాసారని టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదించింది. పునరుద్ధరణ చర్యలు తీసుకోవాలని, నగదు కొరత కారణంగా సంస్థ కార్యకలాపాలు, సర్వీసుల నిర్వహణపై ప్రతికూల ప్రభావం పడుతోందని, దీనిని దృష్టిలో పెట్టుకొని సంస్థకుమద్దతివ్వాలని కోరింది. జూన్ నెల జీతాలు ఇవ్వలేని పరిస్థితులున్నాయని, ఉద్యోగుల భవిష్యత్తును దృష్టిపెట్టుకుని సహకరించాలని విజ్ఞప్తి చేసింది. కాగా వేల కోట్లు బకాయిలతో బాధపడుతున్న టెలికాం సంస్థ ఇటీవల సిబ్బందికి జీతాలు చెల్లించలేని పరిస్థితుల్లో చిక్కుకుంది. ఆర్థిక సంక్షోభం కారణంగా ప్రభుత్వ యాజమాన్యంలోని టెలికం సంస్థ తన చరిత్రలో తొలిసారిగా సుమారు 1.76 లక్షల మంది ఉద్యోగులకు ఫిబ్రవరి వేతనాలను చెల్లించలేకపోయింది. భారీ నష్టాలను నమోదు చేస్తున్న ప్రభుత్వరంగ సంస్థల్లో టాప్‌లో ఉన్న బీఎస్ఎన్ఎల్ రూ.13,000 కోట్ల రుణ సంక్షోభంలో పడి పోయింది. డిసెంబర్ 2018 నాటికి నిర్వహణ నష్టాలు రూ.90,000 కోట్లకు పైగా మాటేనని సమాచారం. -
జియో ఎఫెక్ట్ : బీఎస్ఎన్ఎల్ చరిత్రలో తొలిసారి
సాక్షి, ముంబై : ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బిఎస్ఎన్ఎల్) తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నట్టు కనిపిస్తోంది. సంస్థ చర్రితలో తొలిసారి ఉద్యోగులకు జీతాలు చెల్లించడంలో విఫలమైంది. రిలయన్స్ జియోలాంటి ప్రయివేటు టెలికాంల నుంచి ఎదురవుతున్న ప్రైస్ వార్ నేపథ్యంలో ఫిబ్రవరి మాస జీతాలను పది రోజులు ఆలస్యంగా చెల్లించినట్టు తెలుస్తోంది. తద్వారా 1.76 లక్షల మంది ఉద్యోగులు ప్రభావితమయ్యారు. కేరళ, ఒడిషా, జమ్ము కశ్మీర్ ఉద్యోగులకు వేతనాలను బట్వాడా ను ప్రారంభించామని సంస్థ అధికారి ఒకరు వెల్లడించారు. మార్చి నెల జీతాలు కూడా కొన్ని రోజులు ఆలస్యం అయ్యే అవకాశం ఉందన్నారు. టైమ్స్ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం మహారాష్ట్ర సర్కిల్ రూ. 60 కోట్ల విలువైన వేతనాలు చెల్లించాల్సింది ఉంది. దేశవ్యాప్తంగా మొత్తం 22 సర్కిళ్లలోని ఉద్యోగుల వేతనాల విలువ సుమారు రూ.12వందల కోట్లు. సంస్థ ఆదాయంలో సగభాగానికే పైగా వేతనాలకే పోతుంది. అలాగే సంవత్సరానికి వేతన బిల్లు భారం అదనంగా 8శాతం. అయితే ఈ మేరకు సంస్థ ఆదాయం పుంజుకోకపోవడంతో సంక్షోభంలో పడుతోంది. కాగా ఈ నేపథ్యంలో నిధులను విడుదల చేయాల్సిందిగా కోరుతూ బీఎస్ఎన్ఎల్ ఉద్యోగ సంఘాలు కేంద్ర టెలికాం మంత్రి మనోజ్ సిన్హాకు ఇటీవల ఒక లేఖ కూడా రాశాయి. ఆర్థిక సంక్షోభాన్ని ఇతర ఆపరేటర్లు కూడా ఎదుర్కొంటున్నప్పటికీ వారు భారీ మొత్తాలను నింపడం ద్వారా నెట్టుకొస్తున్నారని ఆ లేఖలో పేర్కొడం గమనార్హం. -
ఇక రూ.10 నాణేలే దిక్కు..!
భోపాల్ : బ్యాంకుల్లో నగదు లేక, ఏటీఎంలు నో క్యాష్ బోర్డులతో వెక్కిరిస్తుంటే, దేశవ్యాప్తంగా ప్రజలు తీవ్ర ఇక్కట్లు పాలవుతున్నారు. ఈ నగదు కొరతను సమస్యను తీర్చడానికి ప్రభుత్వం, ఆర్బీఐ రంగంలోకి దిగినప్పటికీ, పరిస్థితిలో అంత మార్పేమీ కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో చాలా బ్యాంకులకు రూ.10 నాణేలే దిక్కయ్యాయి. కస్టమర్లు నగదు విత్‌డ్రా చేసుకోవడానికి వస్తే, వారికి గ్రామీణ బ్యాంకులు రూ.10 నాణేలను చెల్లిస్తున్నట్టు తెలిసింది. సాగర్, డామో, ఛతర్పూర్, తికంగఢ్ వంటి చిన్న ప్రాంతాల్లో ప్రైవేట్, పబ్లిక్ రంగ బ్యాంకులు నగదు విత్‌డ్రా చేసుకోవడానికి వచ్చిన వారికి రూ.10 నాణేలను ఇస్తున్నట్టు రిపోర్టులు పేర్కొన్నాయి. ‘ఏటీఎంలో డబ్బులు లేక, డ్రైగా మారిపోయాయి. 10వేల రూపాయలను విత్‌డ్రా చేసుకోవడానికి నేను సాగర్‌లోని ఎస్బీఐ బ్రాంచుకు వెళ్లాను. వారు రూ.10 కాయిన్ల రూపంలో వెయ్యి రూపాయలు నా చేతిలో పెట్టారు’ అని సాగర్‌కు చెందిన వ్యవసాయదారుడు రామధీర్ పటేల్ తెలిపారు. చాలా బ్యాంకు శాఖలు కూడా 10వేల రూపాయల వరకు మాత్రమే విత్‌డ్రా చేసుకోవాలని పరిమితి విధించాయి. అయితే పెద్ద ఎత్తున నగదు కొరత ఏర్పడటంపై ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు రూ.2000 నోట్ల కొరత వెనుక ఏదో కుట్ర ఉందని మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ఆరోపిస్తున్నారు. చాలా కోపరేటివ్ బ్యాంకు శాఖల్లో, ఇతర బ్యాంకు శాఖల్లో నగదు దొరకక ప్రజలకు అల్లాడుతున్నారు. తమ వద్ద సరిపడినంత బ్యాంకు బ్యాలెన్స్ ఉందని, కానీ కూతురు పెళ్లికి వాటిని విత్‌డ్రా చేసుకోవడమే కుదరడం లేదని ఓ వ్యవసాయదారుడు అన్నారు. -
నగదు కొరత ఎందుకంటే..
సాక్షి, న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో తీవ్ర నగదు కొరతకు కారణాలపై కేంద్రం ఆరా తీస్తోంది. కొన్ని ప్రాంతాల్లో నగదు విత్‌డ్రాయల్స్ అనూహ్యంగా, అసాధారణంగా పెరగడమే నగదు కొరతకు కారణమని ప్రభుత్వం అంచనా వేస్తోంది. గత కొన్నివారాలుగా దేశంలోని నిర్ధిష్ట ప్రాంతాల్లో భారీ మొత్తంలో చెక్కు ద్వారా, ఇతరత్రా నగదు ఉపసంహరణలు చోటుచేసుకున్నట్టు ఆదాయపన్ను శాఖ డేటా మైనింగ్ ద్వారా విశ్లేషించింది. తొలుత రూ కోట్ల విలువైన భారీ నగదు విత్‌డ్రాయల్స్ తెలంగాణలో తర్వాత ఉత్తర కర్ణాటకలో ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో జరిగాయని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. ఫలితంగా ఈ మూడు రాష్ట్రాల్లో నగదు కోసం డిమాండ్ ఊపందుకున్నట్టు గుర్తించారు. సాధారణ పౌరుల నగదు విత్‌డ్రాయల్స్ పెరిగనందునే నగదు కొరత ఏర్పడిందన్న వాదనను అధికారులు తోసిపుచ్చారు. నిర్ధిష్ట ప్రాంతాల్లో చెక్కులు ఇతర బ్యాంకింగ్ సాధనాల ద్వారా భారీ చెల్లింపులు చేపట్టడంతోనే నగదు కొరత ప్రారంభమైందని చెబుతున్నారు. భారీ విత్‌డ్రాయల్స్ మూలాలను గుర్తించిన ఆదాయపన్ను శాఖ మూడు దక్షిణాది రాష్ట్రాల్లోని రైస్ మిల్లర్లు, కాంట్రాక్టర్లు, ఆగ్రో ట్రేడర్లు మార్చి ద్వితీయార్థంలో భారీ చెల్లింపులు చేపట్టారని గుర్తించింది. ఐటీ శాఖ నిర్వహించిన సర్వేలో ఓ వ్యాపారి కేవలం కొద్ది గంటల వ్యవధిలోనే 20 భారీ మొత్తాలతో కూడిన చెల్లింపులు చేసినట్టు వెల్లడైంది. నగదు కొరతకు కారణమైన కొన్ని సంస్థలు, వ్యక్తులను ఇప్పటికే ఐటీ అధికారులు ప్రశ్నిస్తున్నట్టు తెలిసింది. ఆదాయ పన్ను చట్టం సెక్షన్ 131 కింద ఐటీ శాఖ కాంట్రాక్టర్లు, రైస్ మిల్లర్లు, ఇతరులను ప్రశ్నిస్తోంది. వారి గత, ప్రస్తుత చెల్లింపులను పరిశీలిస్తే తాజా చెల్లింపులకు గత వ్యయాలతో పోలిస్తే ఎలాంటి సంబంధం లేవని గుర్తించింది. గతంలో ఎలాంటి వ్యాపార లావాదేవీలు జరగని సంస్థలకు సైతం పలు చెల్లింపులు జరిగినట్టు వెల్లడైంది. అయితే ఈ లావాదేవీలు ఎందుకు జరిగాయనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. మార్చి-ఏప్రిల్‌లోని 13 రోజుల్లో రూ 45,000 కోట్ల విలువైన నగదు విత్‌డ్రాయల్స్ జరిగాయని తేలింది. సాధారణంగా ఇవి అటూఇటూగా రూ 20,000 కోట్లు ఉంటాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ వర్గాలు పేర్కొన్నాయి. అసాధారణ చెల్లింపులకు కారణమేంటనే కోణంలో ఆర్థిక మంత్రిత్వ శాఖ, ఆదాయపన్ను శాఖ వర్గాలు ఆరా తీస్తున్నాయి. -
రేపటి వరకు క్యాష్ క్రంచ్ మటుమాయం
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలు నగదు కొరత(క్యాష్ క్రంచ్)తో తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఇక్కట్లు రేపటికి మటుమాయమైపోనున్నాయట. దేశవ్యాప్తంగా ఏర్పడిన నగదు కొరత రేపటి వరకు(శుక్రవారం వరకు) పరిష్కారమైపోతుందని ప్రభుత్వ రంగ దిగ్గజ బ్యాంకు ఎస్బీఐ చైర్మన్ రజనీష్ కుమార్ గురువారం తెలిపారు. నగదు కొరతతో ఇబ్బంది పడుతున్న రాష్ట్రాలకు ఇప్పటికే కరెన్సీ పంపిచినట్టు చెప్పారు. సిస్టమ్‌లో నగదు కొరత రూ.70వేల కోట్లకు పెరిగిందని ఎస్బీఐ అంతకముందు తెలిపిన సంగతి తెలిసిందే. ఇది ఏటీఎంల నుంచి నెల వారీ విత్‌డ్రా చేసుకునే మొత్తాల్లో మూడవ వంతుగా పేర్కొంది. ఆర్థిక సంవత్సరం 2018లో డెబిట్ కార్డుల ద్వారా ఏటీఎంల నుంచి దాదాపు రూ.15,291 బిలియన్లు విత్‌డ్రా అయినట్టు రీసెర్చ్ నోట్ కూడా అంచనావేసింది. ఇది గత ఆరు నెలలతో పోలిస్తే 12.2శాతం ఎక్కువగా పేర్కొంది. అయితే ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో 'ఆకస్మిక, అసాధారణ పెరుగుదల' కారణంగా ఈ నగదు కొరత ఏర్పడింది. పరిస్థితి త్వరలోనే చక్కబడుతుందనీ, వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అంతకముందే రజనీష్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. డిజిటల్ ఎకానమీ పుంజుకుంటున్న నేపథ్యంలో చేతిలో డబ్బులు ఉంచుకోవాల్సిన అవసరం లేదంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఇలా అసాధారణంగా కొరతను సృష్టించడంలో ఆదాయపు పన్ను అధికారులు వెంటనే రంగంలోకి దిగారు. కర్నాటకలో 30 నుంచి 35 రైడ్స్ నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా ఈ దాడులు జరుగుతున్నాయి. పెద్ద పెద్ద కాంట్రాక్ట్‌లను ఐటీ ఎక్కువగా ఫోకస్ చేసింది. మరోవైపు రూ.500 నోట్ల ప్రింటింగ్‌ను ప్రభుత్వం ఐదింతలు పెంచుతున్నట్టు ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి ఎస్సీ గార్గ్ తెలిపారు. -
‘నగదు కొరత అంతర్జాతీయ కుట్ర’
సాక్షి, లక్నో : భారత ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసేందుకు అంతర్జాతీయ కుట్ర జరుగుతోందని ఉత్తర్ ప్రదేశ్ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ ఆరోపించారు. దేశవ్యాప్తంగా ఏటీఎంల్లో నగదు కొరత తీవ్రంగా నెలకొన్న క్రమంలో అఖిలేష్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఏటీఎంల్లో నగదు లేకుంటే మరి ఎక్కడ ఉందని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రభుత్వం పెద్ద ఎత్తున కరెన్సీని ముద్రిస్తోంది..మరి ఏటీఎంల్లో నగదు లేకుంటే అది ఎక్కడ ఉంది..ప్రభుత్వ ఆదేశాలతో నగదును వెనక్కి మళ్లించారా..? అంటూ మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వాన్ని అఖిలేష్ తప్పుపట్టారు. నోట్ల ముద్రణకు ఉపయోగించే పేపర్, ఇంక్, యంత్రాలను విదేశాల నుంచి తెప్పిస్తున్నా నగదు కొరత నెలకొందని..భారత ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసేందుకు అంతర్జాతీయ కుట్ర సాగుతోందని ఆరోపించారు. మరోవైపు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఏటీఎంల్లో నగదు లేకపోవడంపై కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ సైతం మోదీ సర్కార్‌పై విమర్శలు గుప్పించారు. మోదీజీ బ్యాంకింగ్ వ్యవస్థను నాశనం చేశారని రాహుల్ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. -
చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు!
సాక్షి, న్యూఢిల్లీ : ఏడాదిన్నర క్రితం పెద్ద నోట్ల రద్దుతో పడరాని పాట్లు పడ్డాం. మళ్లీ అదే పరిస్థితి దాపురించింది. దేశంలో ఏ రాష్ట్రానికి వెళ్లినా, ఏ ప్రాంతానికి వెళ్లినా బ్యాంకుల ముందు, ఏటీఎంల ముందు నోక్యాష్ బోర్డులే దర్శనమిస్తున్నాయి. దేశవ్యాప్తంగా నగదుకు కొరత ఉందని ముందుగా దేశ ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి సుభాశ్ చంద్ర గార్గ్ అంగీకరించారు. ఈ సమస్య తాత్కాలికమేనని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చెప్పారు. రెండు, మూడు రోజుల్లో పరిస్థితి చక్కబడుతుందని ఆర్థికశాఖ సహాయ మంత్రి ఎస్పీ శుక్లా అన్నారు. ఐదు నుంచి ఏడు రోజుల్లో పరిస్థితిని చక్కదిద్దుతామని బ్యాంకింగ్ కార్యదర్శి రాజీవ్ కుమార్ తెలిపారు. ఈ సమస్యను సత్వరం పరిష్కరించేందుకు కేంద్రం రాష్ట్రాల వారీగా కమిటీలను వేయగా, భారతీయ రిజర్వ్ బ్యాంక్ అంతర్రాష్ట కమిటీని వేసింది. ఐదు వందల రూపాయల నోట్ల ముద్రణను ఐదింతలు పెంచాక కూడా నోట్ల కొరత ఎందుకుంటుందని ఆర్బీఐ ప్రశ్నించింది. ఈ మొత్తం వ్యవహారం చూస్తుంటే చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు ఉంది. నోట్ల కొరత ప్రమాదం ఉందంటూ ఫిబ్రవరి నెలలో వచ్చిన వార్తలను పట్టించుకోకపోవడం వల్లనే ప్రస్తుతం ఈ పరిస్థితి దాపురించిందని అర్థం అవుతుంది. తమకు నోట్ల కొరత ఎక్కువగా ఉందంటూ ఫిబ్రవరి నెలలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆర్బీఐకి ఫిర్యాదు చేసింది. కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా నగదు ప్రవాహాన్ని అడ్డుకుంటోందంటూ విపక్షాల నుంచి విమర్శలు వచ్చాయి. డిజిటల్ లావాదేవీలు పెంచడానికే నగదును అడ్డుకుంటున్నారన్నది వారి వాదన. కుట్రపూరితంగా చెలామణి నుంచి రెండు వేల రూపాయల నోట్లు మాయం అవుతున్నాయని మధ్యప్రదేశ్‌లోని బీజేపీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆరోపించారు. అయినా ప్రభుత్వం నుంచి, ఆర్బీఐ నుంచి నివారణ చర్యలు లుప్తం. ప్రధాని నరేంద్ర మోదీ ‘అచ్చేదిన్’ వస్తాయంటూ తన మానాన తాను చెప్పుకుంటూ పోతుంటే దేశంలో నిత్యం నీరవ్ మోదీ స్కామ్‌లు, కథువా, ఉన్నావో కేసులు వినిపిస్తున్నాయి. -
వర్తకులకు జీఎస్టీ వల్ల ఇబ్బందులు : ఈటెల
న్యూఢిల్లీ : వర్తకులు జీఎస్టీ వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఈ సమస్యలు చాలా కఠినతరంగా ఉన్నాయని రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. సుశిల్ మోదీ నేతృత్వంలో నియమించిన కమిటీ సమావేశం నేడు జరిగింది. ఈ సమావేశంలో జీఎస్టీ సమస్యలపై చర్చించారు. 3జీ అనే కొత్త సిస్టమ్‌ను ప్రవేశపెట్టి, జీఎస్టీని సరళీకరిస్తారని ఈటెల పేర్కొన్నారు. ట్రేడింగ్‌కు ఇబ్బంది లేకుండా జీఎస్టీని అమలు చేస్తారని, రాబోయే జీఎస్టీ కౌన్సిల్లో కొత్త ప్రతిపాదనలు వస్తాయని తెలిపారు. గ్రౌండ్లో వచ్చిన సమస్యలను ఎప్పడికప్పుడు పరిష్కరిస్తూ.. ప్రజలకు కష్టం లేకుండా పన్ను కట్టే వారికి ఇబ్బంది లేకుండా జీఎస్టీ ఉండాలన్నారు. తెలంగాణ మొదటి నుంచి ప్రగతిశీల రాష్ట్రంగా ఉందని, ఎఫ్ఆర్బీఎస్ రుణాలను తగ్గించడానికి వీల్లేదని ఈటెల అన్నారు. ఈ రుణాలను 25 శాతం నుంచి 20 శాతానికి తగ్గిస్తారని వార్తలు వస్తున్నాయని, ఈ ప్రతిపాదనకు తాము వ్యతిరేకమని పేర్కొన్నారు. 42 శాతం పన్నుని వెనక్కి ఇస్తున్న నిబంధనను సమీక్షిస్తున్నారని వార్తలు వస్తున్నాయని, తగ్గిస్తే ఊరుకోమని హెచ్చరించారు. రాష్ట్రాలు కూడా చాలా పథకాలను అమలు చేస్తున్నట్టు తెలిపారు. కేంద్రానికి ఒక నిబంధన, రాష్ట్రానికి ఒక నిబంధన అంటే సరికాదని పేర్కొన్నారు. పన్ను పంపిణీలో దక్షిణాదికి అన్యాయం చేయడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. 2011 జనాభా ప్రాతిపదికనే నిధులను ఇస్తామనడం సరికాదని, జనాభాను తగ్గించి అభివృద్ధి వైపు దూసుకెళ్తున్న రాష్ట్రాలను ప్రోత్సహించాలన్నారు. కంపెనీలు బ్యాంకులను మోసం చేస్తున్నాయని, అందువల్లే నగదు కొరత ఏర్పడుతుందన్నారు. దేశంలో 7.3 లక్షల కోట్ల ఎన్పీఏలు ఉన్నాయని తెలిపారు. నగదు కొరత లేకుండా చేయాలని అరుణ్‌జైట్లీని కోరినట్టు ఈటెల్ చెప్పారు. బ్యాంకులపై ప్రజలకు విశ్వాసం కల్పించాల్సిన బాధ్యత కేంద్రంపై, ఆర్బీఐపై ఉందన్నారు. -
రూ.500 నోట్ల ప్రింటింగ్ పెంపు
న్యూఢిల్లీ : ప్రస్తుతం దేశవ్యాప్తంగా నెలకొన్న నగదు కొరతను తగ్గించడానికి ప్రభుత్వం రంగంలోకి దిగింది. 500 రూపాయల కరెన్సీ నోట్ల ప్రింటింగ్‌ను ఐదు సార్లు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయాన్ని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి సుభాష్ చంద్ర గార్గ్ తెలిపారు. ‘డిమాండ్‌కు తగ్గట్టు కరెన్సీ సరఫరాను మరింత పెంచేందుకు మేము చర్యలు తీసుకుంటున్నాం. ఉదాహరణకు రోజుకు 500 కోట్ల రూ.500 నోట్ల ప్రింటింగ్‌ను చేపడుతుంటే, ఈ ఉత్పత్తిని ఐదింతలు పెంచేందుకు చర్యలు తీసుకున్నాం’ అని గార్గ్ చెప్పారు. దేశంలో పలు ప్రాంతాల్లో నగదు కొరతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారనే రిపోర్టులపై ఆయన ప్రెస్ మీట్ నిర్వహించారు. వచ్చే రెండు రోజుల్లో రోజుకు రూ.2500 కోట్ల విలువైన 500 రూపాయల నోట్లను సరఫరా చేయనున్నట్టు తెలిపారు. దీంతో నెలకు సరఫరా రూ.70వేల కోట్ల నుంచి రూ.75వేల కోట్ల వరకు ఉంటుందన్నారు. ఈ నోట్లు డిమాండ్‌ను మించిపోనున్నట్టు చెప్పారు. డిమాండ్‌కు మించి రూ.2.5 లక్షల నుంచి రూ.3 లక్షల కోట్ల వరకు కరెన్సీ స్టాక్ ఉందని, గత కొన్ని రోజులుగా ఈ నగదును సిస్టమ్‌లోకి పంపించామని, ఇంకా రూ.1.75 లక్షల కోట్ల రిజర్వులు తమ వద్ద ఉన్నట్టు పేర్కొన్నారు. కానీ గత రెండు నెలల నుంచి అసాధారణంగా ఎక్కువ డిమాండ్ ఏర్పడిందన్నారు. ఈ అసాధారణ డిమాండ్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్నాటక, మధ్యప్రదేశ్, బిహార్ వంటి రాష్ట్రాల్లో చోటు చేసుకుందని ఆర్థికమంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ కొరత తాత్కాలికమేననీ త్వరలోనే పరిస్థితి చక్కబడుతుందంటూ కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ట్వీట్ కూడా చేశారు. అటు పరిస్థితి త్వరలోనే చక్కబడుతుందనీ, వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఎస్బీఐ చైర్మన్ రజనీష్ కుమార్ మీడియా ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. -
‘మళ్లీ ఆ కష్టాలను గుర్తుకుతెచ్చారు’
సాక్షి, కోల్‌కతా : దేశవ్యాప్తంగా ఏటీఎంల్లో నగదు కొరతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్న క్రమంలో కేంద్ర ప్రభుత్వం తిరిగి నోట్ల రద్దు కష్టాలను గుర్తుకుతెస్తోందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు. దేశంలో ఆర్థిక అత్యవసర పరిస్థితి నెలకొన్నదా అని సందేహం వ్యక్తం చేశారు. పలు రాష్ట్రాల్లో ఏటీఎంల్లో నగదు లేకపోవడం, పెద్ద నోట్లు అదృశ్యం కావడం చూస్తుంటే ఇవి నోట్ల రద్దు రోజులను తలపిస్తున్నట్టుగా ఉందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో ఏమైనా ఆర్థిక ఎమర్జెన్సీ విధించారా అని ప్రశ్నిస్తూ మమతా బెనర్జీ ట్వీట్ చేశారు. ఏపీ, తెలంగాణా, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఢిల్లీ, గుజరాత్, బిహార్ సహా పలు రాష్ట్రాల్లో గత కొద్దిరోజులుగా నగదు కొరత నెలకొంది. కాగా, నగదు కొరత తాత్కాలికమేనని రెండు మూడు రోజుల్లో పరిస్థితిని అధిగమిస్తామని, మార్కెట్లో తగినంతగా నగదు చెలామణిలో ఉందని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వివరణ ఇచ్చారు. -
జైట్లీ ట్వీట్: కేటీఆర్ రియాక్షన్
సాక్షి, హైదరాబాద్: నగదు కొరత సమస్యపై కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ వివరణఫై తెలంగాణ పరిశ్రమలశాఖ మంత్రి కె.టి రామారావు స్పందించారు. ముఖ్యంగా తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో తీవ్రంగా నెలకొన్న కరెన్సీ కష్టాలపై జైట్లీ వివరణకు ఆయన కౌంటర్ ఇచ్చారు. బ్యాంకులు, ఏటీఎంలలో నగదు కొరత ఆకస్మికంగానో లేదా తాత్కాలికంగానో రాలేదంటూ ట్వీట్ చేశారు. గత మూడు నెలలుగా హైదరాబాద్‌లో పదే పదే ఫిర్యాదులు తన దృష్టికి వచ్చాయని ట్వీట్ చేశారు. అంతేకాదు బ్యాంకింగ్ వ్యవస్థపై ప్రజల నమ్మకాన్ని క్రమంగా వమ్ము చేస్తున్న సమస్యపై ఆర్బీఐ, ఆర్థికమంత్రిత్వ శాఖ లోతుగా పరిశీలించాలని కోరారు. కాగా ఏటీఎంలలో నగదు కొరతపై ప్రజల ఆగ్రహం నేపథ్యంలో స్పందించిన అరుణ్ జైట్లీ అన్ని బ్యాంకుల్లోనూ సరిపడా నగదు అందుబాటులో ఉందంటూ ట్విటర్లో పేర్కొన్నారు. సర్క్యులేషన్లో తగినంత కరెన్సీ ఉందంటూ వివరణ ఇచ్చారు. అలాగే కొన్ని ప్రాంతాల్లో ఆకస్మిక, అసాధారణ లావాదేవీల కారణంగా ఏర్పడిన తాత్కాలిక కొరతను త్వరగా పరిష్కరిస్తానని ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. Sir, with due respect the cash shortage in Banks & ATMs is neither sudden nor temporary. I’ve been hearing complaints for over 3 months repeatedly in Hyderabad Pls have RBI & Fin Min team dig deeper & not brush away an issue that is eroding people’s confidence in banking system https://t.co/llHzY6kiox — KTR (@KTRTRS) April 17, 2018 An example to what I had said previously @arunjaitley Ji https://t.co/MC2VOdJctd — KTR (@KTRTRS) April 17, 2018 -
ఆరు నెలల కనిష్టానికి రూపాయి
సాక్షి, ముంబై: డాలర్ మారకంలో దేశీయ కరెన్సీ రూపాయ ఆరు నెలల కనిష్టానికి పడిపోయింది. ప్రారంభ లాభాలనుంచి కిందికి పడి రూపాయి 6పైసలు నష్టపోయింది. ప్రస్తుతం 11పైసలు క్షీణించి 65.60 వద్ద ట్రేడ్ అవుతోంది. వాణిజ్యలోటు పెరిగిపోతున్న నేపథ్యంలో ముడి చమురు ధరలు పెరగడంతో రూపాయి విలువ తగ్గుముఖం పట్టిందని డీలర్లు చెప్పారు. మరోవైపు దేశీయంగా ఏటీఎంలలో నగదు కొరత నేపథ్యంలో సెంటిమెంట్ దెబ్బతిందని మార్కెట్ వర్గాలు అంచనావేశాయి. అటు ఇన్వెస్టర్ల కొనుగోళ్లతో డాలర్‌కు డిమాండ్ పెరిగింది. సోమవారం రూపాయి 65.44 వద్ద ముగిసింది. అటు దేశంలో నెలకొన్న నగదు కొరత సంక్షోభంపై ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ స్పందించారు. నగదుకొరత సమస్యను సమీక్షించామనీ, త్వరలోనే పరిస్థితిని అదుపులోకి తెచ్చామని ట్విటర్ ద్వారా వెల్లడించారు. -
వెక్కిరిస్తున్న ఏటీఎంలు: మరో మూడు రోజులు ఇంతే!
సాక్షి, న్యూఢిల్లీ: దేశ ప్రజలను మళ్లీ కరెన్సీ కష్టాలు పట్టి పీడిస్తున్నాయి. ఎక్కడ చూసినా నో క్యాష్ బోర్డులు వెక్కిరిస్తున్నాయి. ఏటీఎంలలో నగదు లేక ..పెద్ద నోట్ల రద్దు సమయంలో నెలకొన్న పరిస్థితులు మళ్లీ పునరావృతమవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. పలు రాష్ట్రాల్లో 30-40శాతం నగదు కొరత నెలకొనడంపై మండిపడుతున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ర్టాల్లో ఏటీఎంలలో నగదు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా గత వారం రోజులనుంచి సమస్య మరీ తీవ్రంగా ఉందని ప్రజలు వాపోతున్నారు. ఏ ఏటీఎం వద్ద చూసినా నో క్యాష్ బోర్డులు దర్శనమిస్తున్నాయని తెలిపారు. నగదుకోసం 10నుంచి 15 ఏటీఎంల చుట్టూ తిరిగినా ఫలితం శూన్యమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఈ కొరత తాత్కాలికమేననీ, మరో మూడు రోజుల్లో పరిస్థితి చక్కబడుతుందంటూ చావు కబురు చల్లగా చెప్పుకొచ్చింది ప్రభుత్వం. ఈ కొరత తాత్కాలికమేననీ త్వరలోనే పరిస్థితి చక్కబడుతుందంటూ కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ కొద్దిసేపటి క్రితం ట్విటర్లో వెల్లడించారు. దేశంలో కరెన్సీ పరిస్థితిని సమీక్షించామనీ సర్క్యులేషన్లో తగినంత కరెన్సీ ఉందనీ వెల్లడించారు. అలాగే అన్ని బ్యాంకులకు కూడా సరిపడానగదు అందుబాటులో ఉందని పేర్కొన్నారు . కొన్ని ప్రాంతాల్లో 'ఆకస్మిక, అసాధారణ పెరుగుదల' కారణంగా ఏర్పడిన తాత్కాలిక కొరతను త్వరలోనే పరిష్కరిస్తామని ట్వీట్ చేశారు. అటు పరిస్థితి త్వరలోనే చక్కబడుతుందనీ, వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఎస్బీఐ చైర్మన్ రజనీష్ కుమార్ మీడియా ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. డిజిటల్ ఎకానమీ పుంజుకుంటున్న నేపథ్యంలో చేతిలో డబ్బులు ఉంచుకోవాల్సిన అవసరం లేదంటూ ఆయన వ్యాఖ్యానించడం విశేషం. ఇది ఇలా ఉంటే కొన్ని రాష్ర్టాల్లో నగదు సమస్య వాస్తవమేనని ఆర్థిక శాఖ సహాయ మంత్రి ఎస్పీ శుక్లా పేర్కొన్నారు. ప్రస్తుతం లక్షా ఇరవై ఐదు వేల కోట్ల కరెన్సీ చలామణిలో ఉందన్నారు. అయితే పలు రాష్ర్టాల్లో నగదు తక్కువగా ఉందనీ అంగీకరించిన ఆయన ప్రభుత్వం నగదు కొరతను తీర్చేందుకు రాష్ర్టాల వారీగా కమిటీలు ఏర్పాటు చేసినట్టు చెప్పారు. నగదు ఎక్కువగా ఉన్న రాష్ర్టాల నుంచి నగదు లేని రాష్ర్టాలకు డబ్బు తరలించేందుకు ఆర్బీఐ ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసిందని వెల్లడించారు. నగదు కొరత సమస్య మూడు రోజుల్లో తీర్చుతామని శుక్లా స్పష్టం చేశారు. అటు నగదు సంక్షోభంపై సీపీఏం నేత ఏచూరి సీతారాం కూడా ట్విటర్లో ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. Have reviewed the currency situation in the country. Over all there is more than adequate currency in circulation and also available with the Banks. The temporary shortage caused by ‘sudden and unusual increase’ in some areas is being tackled quickly. — Arun Jaitley (@arunjaitley) April 17, 2018 ATMs were empty in November 2016. ATMs are empty now. And the only party flush with cash is the BJP: the people suffer. — Sitaram Yechury (@SitaramYechury) April 17, 2018 -
క్రికెటర్లకు తినడానికీ డబ్బుల్లేవు!
బీసీసీఐని సంస్కరించడానికి సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయాల పుణ్యమాని ప్రస్తుతం ఇంగ్లండ్ జట్టుతో తలపడుతున్న భారత అండర్-19 జట్టుకు కష్టాలు వచ్చిపడ్డాయి. ఆటగాళ్లతో పాటు చివరకు కోచ్ రాహుల్ ద్రవిడ్‌కు కూడా కనీసం తినడానికి కూడా డబ్బులు అందడం లేదు! కార్యదర్శి పదవి నుంచి అజయ్ షిర్కేను తొలగించడంతో.. చెక్కుల మీద సంతకాలు పెట్టే అధికారి ఎవరి వద్దా లేకుండా పోయింది. దాంతో ఆటగాళ్లకు, ద్రవిడ్‌కు డబ్బులు అందట్లేదు. జూనియర్ క్రికెటర్లకు రోజుకు రూ. 6800 చొప్పున రావాల్సి ఉంది. కానీ ఆ డబ్బులు రావడం లేదు. దాంతో వాళ్లంతా తమ భోజనం ఖర్చులు జేబులోంచి పెట్టుకోవాల్సి వస్తోంది. చాలామంది తమ తల్లిదండ్రులకు ఫోన్ చేసి డబ్బులు తెప్పించుకుంటున్నారు. కొత్తగా చెక్ పవర్ ఎవరికో ఒకరికి ఇవ్వాలంటే బీసీసీఐ సభ్యులు కొత్త తీర్మానాన్ని ఆమోదించాల్సి ఉంటుంది. సిరీస్ ముగిసిపోగానే మొత్తం డీఏ ఎంత అవుతుందో లెక్కచూసి ఆటగాళ్లు, ఇతర సిబ్బంది ఖాతాలకు పంపేస్తామని బీసీసీఐ అధికారి ఒకరు చెప్పారు. ప్రస్తుతం బీసీసీఐలో కూడా చాలా సమస్యలున్నాయని, చెక్ పవర్ ఎవరివద్దా లేకపోవడంతో చెల్లింపులు ఏవీ చేయలేకపోతున్నామని అన్నారు. మ్యాచ్‌లు జరిగే రోజుల్లో మధ్యాహ్న భోజనాన్ని ఆతిథ్య సంఘం ఏర్పాటుచేస్తోందని, బ్రేక్‌ఫాస్ట్ అయితే హోటల్ నుంచి కాంప్లిమెంటరీగా అందుతోందని అండర్-19 క్రికెట్ టీమ్ సభ్యుడొకరు చెప్పారు. ముంబైలో తమను ఓ స్టార్హోటల్లో ఉంచారని, అక్కడ శాండ్విచ్ తినాలన్నా రూ. 1500 పెట్టాల్సి వస్తోందని వాపోయారు. రోజంతా ఆడి అలిసిపోయిన ఆటగాళ్లు భోజనం కోసం మళ్లీ బయటకు వెళ్లాల్సి వస్తోందని చెప్పారు. అయితే, ప్రస్తుతం బంగ్లాదేశ్‌తో ఏకైక టెస్టు కోసం హైదరాబాద్ వచ్చిన సీనియర్ జట్టుకు మాత్రం ఇలాంటి సమస్యలు ఏమీ లేవు. ఆటగాళ్ల రోజువారీ అలవెన్సుల విషయాన్ని చూసుకోవాలని బీసీసీఐ సీఈఓ రాహుల్ జోహ్రికి కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్స్ (సీఓఏ) తెలిపింది. -
అసలు పనిచేసే ఏటీఎంలెన్నో తెలుసా?
-
అసలు పనిచేసే ఏటీఎంలెన్నో తెలుసా?
ముంబై: పెద్ద నోట్ల రద్దులో అత్యంత కీలకమైన ఘట్టం.. రద్దయిన నోట్లు బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకునే గడువు డిసెంబర్ 30 శుక్రవారంతో ముగిసింది. ఈ లోపల ప్రజలకు అందుబాటులోకి తెస్తామన్న సరిపడ నగదు విషయంలో ప్రభుత్వం వాగ్దానం నెరవేరినట్టు కనిపించడం లేదు. దేశీయంగా ఉన్న ఏటీఎంలో కేవలం 30 శాతం మాత్రమే నగదును అందిస్తున్నాయని, మిగతా రెండు వంతులకు పైగా ఏటీఎంలు నోక్యాష్ బోర్డులనే వెక్కిరిస్తున్నట్టు వెల్లడైంది. దీంతో ఈ ఏటీఎంలు ఉన్నా ఒకటే లేకపోయినే ఒకటే అన్నచందాగా మారాయి. బ్యాంకులు సైతం కస్టమర్లకు నగదును తమ బ్రాంచ్ కార్యాలయాల నుంచే అందిస్తున్నాయని ఏటీఎంలలో మాత్రం నగదు నింపడం లేదని తెలిసింది. కేవలం 30 శాతం అంటే 66,000 ఏటీఎంలు మాత్రమే యాక్టివ్‌గా పనిచేస్తున్నాయని ఏటీఎం ఇండస్ట్రి కాన్ఫడరేషన్ ప్రెసిడెంట్ సంజీవ్ పటేల్ తెలిపారు. రెండు నెలల డీమోనిటైజేషన్ కాలంలో కేవలం 20 శాతం ఏటీఎంలలోనే రెగ్యులర్‌గా నగదును నింపినట్టు ఆయన చెప్పారు. పెద్ద నోట్ల రద్దుకు ముందు రోజూ రూ.7-8 లక్షల వరకు ఏటీఎంలలో నగదును నింపేవారని, కానీ నోట్ల రద్దు అనంతరం రోజుకు కేవలం రూ.2-3 లక్షల నగదునే నింపినట్టు తెలిసింది. అత్యధిక మొత్తంలో నగదు కావాలనుకునే వారు బ్యాంకుల్లోనే నగదు తీసుకోవడానికి మొగ్గుచూపారని భారత్, దక్షిణాసియా ఎన్సీఆర్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ నవ్రోజ్ దస్తూర్ చెప్పారు. ఎస్బీఐ ఒక్క బ్యాంకే ఏటీఎంలలో నగదును మంచిగా ఫిల్ చేసిందని, ప్రైవేట్ బ్యాంకులు తమ కార్యాలయాల నుంచే నగదును అందించాయని తెలిపారు. -
ఆర్బీఐ నుంచి రూ.5వేల కోట్లు
లక్నో: పెద్ద నోట్ల రద్దు తర్వాత ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో నెలకొన్న నగదు కష్టాలను తొలగించేందుకు ఆర్ బీఐ చర్యలు తీసుకుంది. రూ.5000 కోట్ల రూపాయలను రాష్ట్రానికి పంపించింది. అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య కార్గో విమానంలో శనివారం ఈ నగదును రాష్ట్ర ప్రభుత్వం స్వీకరించింది. నల్లధనాన్నినిరోధించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నవంబర్ 8న ప్రకటించిన డీమానిటైజేషన నేపథ్యంలో రాష్ట్రంలో కరెన్సీ కొరత భారీగా నెలకొనడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు రిజర్వ్ బ్యాంకు తెలిపింది. ఖాతాదారుల ఆందోళన, పలుచోట్ల శాంతి భద్రతల సమస్య తలెత్తడంతో బ్యాంకు ఈ ఉపశమన చర్యలు చేపట్టింది. చౌదరి చరణ్ సింగ్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలోని ప్రాంతీయ ఆర్బిఐ కార్యాలయానికి చేరితన తర్వాత వీటిని ఆయా బ్యాంకులు తద్వారా ఏటీఎంలలోకి పంపీణీ జరుగుతుందని అధికారులు తెలిపారు. రూ .500, రూ 2000ల కొత్త నోట్లుతో కూడిన ఈ నగదును కాన్పూర్, లక్నోలలో ఉన్న ఆర్ బీఐ కార్యాలయాల మధ్య సమానంగా పంచుతామని అధికారులు పేర్కొన్నారు. -
ఆ గ్రామంలో నోట్ల రద్దు ఎఫెక్ట్ ఎందుకు లేదంటే
సబర్కంతా: పెద్ద నోట్ల రద్దుతో బ్యాంకుల ముందు, ఏటీఎంల ముందు ప్రజలంతా క్యూ కడుతుంటే గుజరాత్ లో ఓ గ్రామంలో మాత్రం అలాంటి ఇబ్బందులేవీ కనిపించడం లేదు. ఆ గ్రామమే అకోదర. ఈ గ్రామంలోని ప్రజలంతా ఎస్ఎంఎస్ ల ద్వారా మాత్రమే డబ్బు చెల్లిస్తారు. అది వెయ్యి అయినా లేక పది రూపాయలే అయినా కూడా. నగదు చెల్లించాల్సిన వ్యక్తి అకౌంట్ నంబర్ కు డబ్బును ఎస్ఎంఎస్ ద్వారా ట్రాన్స్ ఫర్ చేస్తారు. ఏడాది క్రితం అకోదరను ఓ ప్రైవేటు బ్యాంకు డిజిటల్ గ్రామంగా మార్చేందుకు నడుంబిగించడమే ఇందుకు కారణం. అప్పటి నుంచి ఈ గ్రామంలో కొనుగోళ్లు, తిరిగి చెల్లింపులు మొత్తం ఆన్ లైన్ ద్వారానే సాగుతున్నాయి. దేశంలోని తొలి డిజిటల్ గ్రామం కూడా అకోదరే. గ్రామం మొత్తం 24 గంటలూ వైఫై అందుబాటులో ఉంటుంది. ఈ గ్రామంలో ఓ ఏటీఎం కూడా ఉంది. కానీ గ్రామస్ధులు ఎవరూ దాన్ని వినియోగించరు. గ్రామంలోని 1500 మంది జనాభాకు బ్యాంకు ఖాతాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరూ ఏ వస్తువు కొనుగోలు చేయదలుచుకున్నా, అమ్మదలుచుకున్నా బ్యాంకు ఖాతాల ద్వారా మాత్రమే డబ్బు చెల్లింపులు చేస్తారు. గ్రామం మొత్తం వైఫై సౌకర్యం ఉన్నా అందరి దగ్గర స్మార్ట్ ఫోన్లు లేకపోవడంతో ఎస్ఎంఎస్ విధానాన్ని అనుసరిస్తున్నారని బ్యాంకు అధికారి ఒకరు తెలిపారు.