ఆర్‌బీఐ నుంచి రూ.5వేల కోట్లు
లక్నో: పెద్ద నోట్ల రద్దు తర్వాత ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో నెలకొన్న నగదు కష్టాలను తొలగించేందుకు ఆర్ బీఐ చర్యలు తీసుకుంది. రూ.5000 కోట్ల రూపాయలను రాష్ట్రానికి పంపించింది. అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య కార్గో విమానంలో శనివారం ఈ నగదును రాష్ట్ర ప్రభుత్వం స్వీకరించింది.
నల్లధనాన్నినిరోధించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నవంబర్ 8న ప్రకటించిన డీమానిటైజేషన నేపథ్యంలో రాష్ట్రంలో కరెన్సీ కొరత భారీగా నెలకొనడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు రిజర్వ్ బ్యాంకు తెలిపింది. ఖాతాదారుల ఆందోళన, పలుచోట్ల శాంతి భద్రతల సమస్య తలెత్తడంతో బ్యాంకు ఈ ఉపశమన చర్యలు చేపట్టింది. చౌదరి చరణ్ సింగ్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలోని ప్రాంతీయ ఆర్బిఐ కార్యాలయానికి చేరితన తర్వాత వీటిని ఆయా బ్యాంకులు తద్వారా ఏటీఎంలలోకి పంపీణీ జరుగుతుందని అధికారులు తెలిపారు. రూ .500, రూ 2000ల కొత్త నోట్లుతో కూడిన ఈ నగదును కాన్పూర్, లక్నోలలో ఉన్న ఆర్ బీఐ కార్యాలయాల మధ్య సమానంగా పంచుతామని అధికారులు పేర్కొన్నారు.