సాక్షి, ముంబై: నూతన సంవత్సరంలో బంగారు ధరలు ఊపందుకున్నాయి. దేశీయ మార్కెట్‌లో డిమాండ్ పెరగడంతో బంగారం ధర రూ.30 వేల స్థాయికి ఎగువన స్థిరంగా కొనసాగుతోంది. బులియన్ మార్కెట్లో 10 గ్రాముల ధర రూ.50 లు ఎగిసి రూ. 30,450 కొనసాగుతోంది. ఎంసీఎక్స్‌లో 10 గ్రాముల ఫిబ్రవరి ఫ్యూచర్స్ రూ. 42 ఎగసి రూ. 29,165 వద్ద ఉంది.సింగపూర్ మార్కెట్‌లో ఔన్స్ బంగారం 0.42 శాతం పెరిగి 1,308 డాలర్లకు చేరుకుంది. స్థానిక నగల విక్రయదారుల కొనుగోళ్లు, గ్లోబల్ మార్కెట్ల ధోరణితో బంగారం ధరలు పుంజుకున్నాయి.
అయితే నిన్న(సోమవారం) పాజిటివ్‌గా ఉన్న వెండి ధర నేడు క్షీణించింది. కిలో వెండి రూ. 390 పతనమై 39,710 వద్ద కొనసాగుతోంది. పారిశ్రామిక యూనిట్లు, నాణెం తయారీదారుల డిమాండ్ తగ్గడంతో వెండి ధరలు తిరోగమనం దిశగా మళ్లాయి. దేశ రాజధానిలో 99.9 శాతం స్వచ్ఛత కలిగిన బంగారం రూ. 50 రూ. 30,450 వద్ద, 99.5 శాతం స్వచ్ఛత కలిగిన బంగారం ధర రూ. 30,300గా నమోదైంది. సావరిన్ గోల్డ్ (ఎనిమిది గ్రాములు) ధర రూ. 24,700 గా ఉంది. మరోవైపు, వెండి రూ. 390 క్షీణించి రూ. కేజీకి 39,710. వారపు ఆధారిత డెలివరీ కిలో వెండి ధర రూ. 39,040 గా ఉంది.
ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు అంచనాలతో డాలర్ బలహీనపడడంతో బంగారం కొనుగోళ్లు పుంజకున్నాయి. ఉత్తర కొరియాతో తిరిగి పెరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో డాలరు బలహీనపడింది. దీంతో సంక్షోభ పరిస్థితుల్లో సురక్షితమైన స్వర్గధామ పెట్టుబడులుగా భావించే బంగారం బలపడిదని ఎనలిస్టులు పేర్కొంటున్నారు. అటు దేశీయ స్టాక్‌మార్కెట్లు కన్సాలిడేషన్ బాటపట్టగా దేశీయ కరెన్సీ రూపాయి భారీగా లాభపడుతూ రెండున్నరేళ్ల గరిష్టాన్ని నమోదు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment