న్యూఢిల్లీ: ప్రపంచ సంపన్నుల జాబితా నుంచి బిలియనీర్, అదానీ గ్రూప్ వ్యవస్థాపకుడు, గౌతం అదానీ నాలుగో స్థానానికి పడిపోయారు. తాజా బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్‌లో అదానీ ఈ జబితాలో మూడో స్థానం నుంచి ప్రస్తుతం నాల్గవ స్థానంలో ఉన్నారు. గత 24 గంటల్లో అదానీ నికర విలువ 872 మిలియన్ డాలర్లకు పడిపోయింది. గత ఏడాది (జనవరి 24, 2022) నుంచి అదానీ 683 మిలియన్ల డాలర్ల సంపదను కోల్పోయారు.
తాజా ర్యాంకింగ్స్ ప్రకారం, ఫ్రెంచ్ విలాసవంతమైన బ్రాండ్ లూయిస్ విట్టన్ వ్యవస్థాపకుడు బెర్నార్డ్ ఆర్నాల్ట్ మొత్తం నికర విలువ 188 బిలియన్ డాలర్లు టాప్‌లో ఉన్నారు. టెస్లా వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ 45 బిలియన్ డాలర్లతో నికర విలువతో రెండో స్థానంలో ఉండగా, అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ 121 బిలియన్ డాలర్లతో మూడో స్థానంలోకి దూసుకొచ్చారు.
రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ 84.7 బిలియన్ డాలర్లనికర విలువతో ప్రపంచంలోని పన్నెండవ సంపన్న వ్యక్తిగా నిలిచారు. అంతకుముందు ముఖేష్ అంబానీ తొమ్మిదో స్థానంలో ఉన్నారు. మరోవైపు చైనాలో మాంద్యం దెబ్బ చైనాకు చెందిన బిలియనీర్ హుయ్ కా యాన్‌ను గట్టిగా తాకింది. అతిపెద్ద రియల్ ఎస్టేట్ ఎవర్‌గ్రాండే గ్రూప్‌కు చైర్మన్ యాన్ సంపద ఏకంగా 93 శాతం కుప్పకూలింది. 42 బిలియన్ల డాలర్ల సంపద కాస్తా 3 బిలియన్ డాలర్లకు కరిగిపోవడం గమనార్హం.
బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రపంచంలోని అత్యంత ధనవంతుల రోజువారీ జాబితాలో టాప్ టెన్‌లో నిలిచిన బిగ్ షాట్స్ బిల్ గేట్స్ (నికర విలువ 111 బిలియన్ డాలర్లు), వారెన్ బఫెట్ (108 బిలియన్ డాలర్లు), లారీ ఎలిసన్ (99.5 బిలియన్ డాలర్లు), లారీ పేజ్ (92.3 బిలియన్ డాలర్లు), సెర్గీ బ్రిన్ (88.7 బిలియన్ డాలర్లు), స్టీవ్ బాల్మెర్ (86.9 బిలియన్ డాలర్లు).
Comments
Please login to add a commentAdd a comment