top list
-
మోస్ట్ పవర్ ఫుల్ పాస్పోర్ట్స్ లిస్ట్ : టాప్‌లో సింగపూర్, మరి ఇండియా?
ప్రపంచంలోనే శక్తిమంతమైన పాస్‌పోర్ట్ కలిగిన దేశాల జాబితాను ‘హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్’ విడుదల చేసింది. అంతర్జాతీయ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ (IATA) ర్యాంకింగ్ డేటా ఆధారంగా దీన్ని రూపొందించింది. ఈ తాజా ర్యాంకింగ్‌లో భారతదేశానికి చెందిన పాస్‌పోర్ట్ 82వ స్థానంలో ఉంది. అంటే గతంతో పోలిస్తే భారత్ మూడు స్థానాలు పైకి ఎగబాకింది .ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో మన దేశం 85వ స్థానంలో ఉంది. భారత పాస్‌పోర్ట్‌తో వీసా లేకుండానే ఇండోనేషియా, మలేషియా, థాయ్‌లాండ్ వంటి ప్రపంచంలోని 58 దేశాలకు ప్రయాణించవచ్చు. గతంలోఈ అనుమతి 59 దేశాలకు ఉండేది. సింగపూర్ టాప్ సింగపూర్ పాస్‌పోర్ట్ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్ట్‌గా నిలిచింది. ఈ జాబితా ప్రకారం 195 దేశాలకు వీసా రహిత యాక్సెస్‌ను అందిస్తోంది. జపాన్, ఫ్రాన్స్, ఇటలీ, జర్మనీ , స్పెయిన్ రెండో స్థానంలో ఉన్నాయి. పాస్‌పోర్ట్ హోల్డర్లకు 192 దేశాలకు యాక్సెస్‌ను అందిస్తుంది. ఆ తర్వాత, ర్యాంకింగ్‌లో మూడవ స్థానంలో ఉన్న ఆస్ట్రియా, ఫిన్లాండ్, ఐర్లాండ్, లక్సెంబర్గ్, నెదర్లాండ్స్, దక్షిణ కొరియా ,స్వీడన్లు 191 గమ్యస్థానాలకు వీసా-రహిత యాక్సెస్‌ను కలిగి ఉన్నాయి.హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ ప్రకారం న్యూజిలాండ్, నార్వే, బెల్జియం, డెన్మార్క్ , స్విట్జర్లాండ్లతో పాటు యునైటెడ్ కింగ్డమ్ నాల్గవ స్థానంలో ఉంది. ఆస్ట్రేలియా పోర్చుగల్ 5వ స్థానాన్ని పంచుకోగా, అమెరికా 186 దేశాలకు వీసా రహిత యాక్సెస్‌తో ఎనిమిదో స్థానానికి పడిపోయింది. సెనెగెల్, తజకిస్థాన్ దేశాలు 82వ స్థానంలోఉన్నాయి. పాకిస్థాన్ 100వ స్థానంలో ఉంది. ఆ దేశ పాస్‌పోర్ట్‌తో 33 దేశాలకు వీసా లేకుండా వెళ్లొచ్చు. ఇక ఈ జాబితాలో అట్టడుగున 103వ స్థానంలో అఫ్గానిస్థాన్ ఉంది. ఆ దేశ పాస్‌పోర్ట్ కలిగినవారు 26 దేశాలకు వీసా రహిత ప్రయాణాలు చేయొచ్చు. 2024 అత్యంత శక్తిమంతమైన పాస్‌పోర్ట్‌ల టాప్ -10 జాబితాసింగపూర్ (195 గమ్యస్థానాలు)ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, స్పెయిన్ (192)ఆస్ట్రియా, ఫిన్లాండ్, ఐర్లాండ్, లక్సెంబర్గ్, నెదర్లాండ్స్, దక్షిణ కొరియా, స్వీడన్ (191)బెల్జియం, డెన్మార్క్, న్యూజిలాండ్, నార్వే, స్విట్జర్లాండ్, యునైటెడ్ కింగ్డమ్ (190)ఆస్ట్రేలియా, పోర్చుగల్ (189)గ్రీస్, పోలాండ్ (188)కెనడా, చెకియా, హంగరీ, మాల్టా (187)అమెరికా (186)ఎస్టోనియా, లిథువేనియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (185)ఐస్లాండ్, లాట్వియా, స్లోవేకియా, స్లోవేనియా (184) -
Rajasthan Assembly elections 2023: అల్లర్లు, అవినీతిలో రాజస్తాన్ టాప్
జైపూర్: నేరాలు, అవినీతి, అల్లర్లలో రాజస్తాన్‌ను కాంగ్రెస్ ప్రభుత్వం దేశంలోనే అగ్రస్థానంలోకి తీసుకెళ్లిందని ప్రధాని మోదీ ఎద్దేవాచేశారు. శనివారం రాజస్తాన్‌లోని భరత్పూర్, నాగౌర్‌లో జరిగిన ఎన్నికల ప్రచార సభల్లో మోదీ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి గెహ్లాత్‌పై విమర్శలు ఎక్కుపెట్టారు. ‘ ఓవైపు విశ్వవిజేతగా భారత్ ప్రభవిస్తోంది. మరోవైపు రాజస్తాన్‌లో ఏం జరుగుతోందో మీకందరికీ తెల్సిందే. అల్లర్లు, నేరాల నమోదులో రాజస్తాన్ అగ్రపథంలో దూసుకుపోతోంది. బుజ్జగింపు రాజకీయాల కారణంగా సంఘ విద్రోహ శక్తులు స్వైరవిహారం చేస్తున్నాయి. అందుకే ఈసారి మీకు ఓట్లు వేయబోము అని మెజీషియన్‌కు ఓటర్లు చెప్పేశారు. ఈసారి ఎన్నికల తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ అదృశ్యమవుతుంది. డిసెంబర్ మూడున కాంగ్రెస్ మాయమవడం ఖాయం’’ అని గెహ్లోత్‌నుద్దేశిస్తూ మోదీ విమర్శించారు. చిన్నతనంలో తండ్రికి సాయపడుతూ గెహ్లోత్ మెజీషియన్‌గా దేశపర్యటన చేసిన సంగతి తెల్సిందే. ఈనెల 25వ తేదీన రాష్ట్రంలో పోలింగ్ జరగనుంది. డిసెంబర్ మూడో తేదీన ఫలితాలు ప్రకటిస్తారు. వారెక్కడుంటే నేరాలు అక్కడ ‘ ఎక్కడ కాంగ్రెస్ ప్రభుత్వాలు కొలువుతీరాయో అక్కడ నేరగాళ్లు, ఉగ్రవాదులు, అల్లర్లు పెరిగిపోతున్నాయి. కాంగ్రెస్ బుజ్జగింపు రాజకీయాలకు పెట్టిందిపేరు. ప్రజల జీవితాలను పణంగా పెట్టేందుకు ఎంతగా దిగజారేందుకైనా కాంగ్రెస్ సిద్ధం. అవినీతి పరాకాష్టకు చేరింది. ఈ ఐదేళ్ల కాంగ్రెస్ హయాంలో మహిళలు, దళితులపై నేరాలు ఎక్కువయ్యాయి. హోలీ, శ్రీ రామనవమి, హనుమాన్ జయంతి.. ఏ పర్వదినమైనా సరే రాష్ట్ర ప్రజలు ప్రశాంతంగా పండుగ జరుపుకున్నదే లేదు. ఎప్పుడూ అల్లరిమూకల దాడులు, ఘర్షణలు, వివాదాలు, కర్ఫ్యూ.. ఇవే రాజస్తాన్‌లో దర్శనిమిచ్చాయి. మహిళలు అబద్ధపు రేప్ కేసులు పెడుతున్నారని స్వయంగా సీఎం వ్యాఖ్యానించారు. ఇలాంటి వ్యక్తి మహిళలను రక్షిస్తారా?. ఈయనకు ఒక్క నిమిషమైనా సీఎం కుర్చీలో కూర్చొనే హక్కు ఉందా?’’ అని మోదీ మండిపడ్డారు. ‘మగాళ్లు ఉన్న రాష్ట్రం కాబట్టే రాజస్తాన్‌లో రేప్‌లు ఎక్కువ అంటూ మంత్రి శాంతికుమార్ ధరివాల్ మాట్లాడతారు. ఇలాంటి వ్యాఖ్యలు చేసే నేతలు ఉన్నందుకు కాంగ్రెస్ పార్టీ సిగ్గుపడాలి. అసెంబ్లీలో ఇంత దారుణంగా మాట్లాడినా ఈ మంత్రిపై ఎలాంటి శిక్షలు లేవు. ఎందుకంటే సీఎం రహస్యాలు ఈయనకు తెలుసు మరి. పైగా ఈయనకు రివార్డ్‌గా టికెట్ దక్కింది’’ అంటూ మోదీ వ్యాఖ్యానించారు. దళితుడు ఉన్నతాధికారి కావడం ఇష్టం లేదు ‘‘ దళితులపై కాంగ్రెస్ వివక్ష చూపుతోంది. డీగ్ జిల్లాకు చెందిన హీరాలాల్ సమరియా ప్రధాన సమాచార కమిషనర్(సీఐసీ)గా బాధ్యతలు చేపట్టారు. ఆ పదవి స్వీకరించిన తొలి దళితుడు ఆయన. ఈయన ఎంపిక సమావేశాన్ని కాంగ్రెస్ బాయ్‌కాట్ చేసింది. దళిత అధికారి అంతటి ఉన్నతస్థాయికి చేరుకోవడం కాంగ్రెస్‌కు ఇష్టంలేదు. రాష్ట్రంలో నిత్యావసర సరకులు, ఇంధన ధరల పెరుగుదలకు గెహ్లోత్ సర్కారే కారణం. పొరుగు ఉన్న రాష్ట్రాల్లో కంటే రాజస్తాన్‌లో లీటర్ పెట్రోల్ రూ.12 ఎక్కువ ధర. మేం అధికారంలోకి రాగానే ధరలను సమీక్షించి, సవరిస్తాం’’ అని మోదీ హామీ ఇచ్చారు. -
బిలియనీర్ గౌతం అదానీకి ఝలక్, 24 గంటల్లో..
న్యూఢిల్లీ: ప్రపంచ సంపన్నుల జాబితా నుంచి బిలియనీర్, అదానీ గ్రూప్ వ్యవస్థాపకుడు, గౌతం అదానీ నాలుగో స్థానానికి పడిపోయారు. తాజా బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్‌లో అదానీ ఈ జబితాలో మూడో స్థానం నుంచి ప్రస్తుతం నాల్గవ స్థానంలో ఉన్నారు. గత 24 గంటల్లో అదానీ నికర విలువ 872 మిలియన్ డాలర్లకు పడిపోయింది. గత ఏడాది (జనవరి 24, 2022) నుంచి అదానీ 683 మిలియన్ల డాలర్ల సంపదను కోల్పోయారు. తాజా ర్యాంకింగ్స్ ప్రకారం, ఫ్రెంచ్ విలాసవంతమైన బ్రాండ్ లూయిస్ విట్టన్ వ్యవస్థాపకుడు బెర్నార్డ్ ఆర్నాల్ట్ మొత్తం నికర విలువ 188 బిలియన్ డాలర్లు టాప్‌లో ఉన్నారు. టెస్లా వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ 45 బిలియన్ డాలర్లతో నికర విలువతో రెండో స్థానంలో ఉండగా, అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ 121 బిలియన్ డాలర్లతో మూడో స్థానంలోకి దూసుకొచ్చారు. రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ 84.7 బిలియన్ డాలర్లనికర విలువతో ప్రపంచంలోని పన్నెండవ సంపన్న వ్యక్తిగా నిలిచారు. అంతకుముందు ముఖేష్ అంబానీ తొమ్మిదో స్థానంలో ఉన్నారు. మరోవైపు చైనాలో మాంద్యం దెబ్బ చైనాకు చెందిన బిలియనీర్ హుయ్ కా యాన్‌ను గట్టిగా తాకింది. అతిపెద్ద రియల్ ఎస్టేట్ ఎవర్‌గ్రాండే గ్రూప్‌కు చైర్మన్ యాన్ సంపద ఏకంగా 93 శాతం కుప్పకూలింది. 42 బిలియన్ల డాలర్ల సంపద కాస్తా 3 బిలియన్ డాలర్లకు కరిగిపోవడం గమనార్హం. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రపంచంలోని అత్యంత ధనవంతుల రోజువారీ జాబితాలో టాప్ టెన్‌లో నిలిచిన బిగ్ షాట్స్ బిల్ గేట్స్ (నికర విలువ 111 బిలియన్ డాలర్లు), వారెన్ బఫెట్ (108 బిలియన్ డాలర్లు), లారీ ఎలిసన్ (99.5 బిలియన్ డాలర్లు), లారీ పేజ్ (92.3 బిలియన్ డాలర్లు), సెర్గీ బ్రిన్ (88.7 బిలియన్ డాలర్లు), స్టీవ్ బాల్మెర్ (86.9 బిలియన్ డాలర్లు). -
ఫోర్బ్స్ టాప్ 2000లో రిలయన్స్ జోరు..
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా 2000 టాప్ కంపెనీల జాబితాలో దేశీ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ 53వ ర్యాంకు దక్కించుకుంది. గతేడాదితో పోలిస్తే రెండు స్థానాలు ఎగబాకింది. 2022 సంవత్సరానికి గాను అగ్రశ్రేణి కంపెనీలతో రూపొందించిన ఈ జాబితాను ఫోర్బ్స్ మ్యాగజైన్ విడుదల చేసింది. అమ్మకాలు, లాభాలు, అసెట్లు, మార్కెట్ విలువ ఆధారంగా ఈ దిగ్గజాలకు ర్యాంకింగ్‌లు ఇచ్చినట్లు ఫోర్బ్స్ తెలిపింది. ఇందులో ప్రభుత్వ రంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 105వ ర్యాంకు, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 153వ స్థానం, ఐసీఐసీఐ బ్యాంక్ 204వ ర్యాంకు దక్కించుకున్నాయి. 2021–22 ఆర్థిక సంవత్సరంలో రిలయన్స్ 104.6 బిలియన్ డాలర్ల ఆదాయం నమోదు చేసింది. తద్వారా 100 బిలియన్ డాలర్ల వార్షికాదాయాన్ని నమోదు చేసిన తొలి భారతీయ కంపెనీగా నిల్చిందని ఫోర్బ్స్ తెలిపింది. ‘గ్లోబల్ 2000 జాబితాలో రిలయన్స్ రెండు స్థానాలు ఎగబాకి 53వ ర్యాంకుకు చేరుకుంది. భారతీయ కంపెనీల జాబితాలో అగ్రస్థానంలో నిల్చింది. ఈ ఏడాది తొలినాళ్లలో రిలయన్స్ అధినేత సంపద విలువ 90.7 బిలియన్ డాలర్లుగా లెక్కించాం. తద్వారా ఈ ఏడాది టాప్ బిలియనీర్ల జాబితాలో ఆయన 10వ స్థానంలో నిల్చారు‘ అని వివరించింది. గ్లోబల్ 2000 జాబితాలో ఇన్వెస్ట్మెంట్ గురు వారెన్ బఫెట్‌కు చెందిన బెర్క్‌షైర్ హాథ్‌వే అగ్రస్థానంలో నిల్చింది. 2003లో ఫోర్బ్స్ ఈ లిస్టును ప్రకటించడం ప్రారంభించినప్పట్నుంచి బఫెట్ కంపెనీ నంబర్ వన్ స్థానంలో నిలవడం ఇదే ప్రథమం. ఇక గత తొమ్మిదేళ్లుగా అగ్రస్థానంలో ఉంటున్న ఇండస్ట్రియల్ అండ్ కమర్షియల్ బ్యాంక్ ఆఫ్ చైనా తాజా లిస్టులో రెండో స్థానంలో నిల్చింది. సౌదీ ఆరామ్కో, జేపీమోర్గాన్ చేజ్, చైనా కన్స్ట్రక్షన్ బ్యాంకు ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. లిస్టులో చోటు దక్కించుకున్న ఇతర సంస్థలు.. ► ఓఎన్జీసీ (228 ర్యాంకు), హెచ్డీఎఫ్సీ (268), ఐఓసీ (357), టీసీఎస్ (384), టాటా స్టీల్ (407), యాక్సిస్ బ్యాంక్ (431) ఈ జాబితాలో ఉన్నాయి. ► అపర కుబేరుడు గౌతమ్ అదానీకి చెందిన సంస్థలు ఈసారి లిస్టులో కొత్తగా చోటు దక్కించుకున్నాయి. అదానీ ఎంటర్ప్రైజెస్ (1,453 ర్యాంకు), అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనమిక్ జోన్ (1,568), అదానీ గ్రీన్ ఎనర్జీ (1,570) అదానీ ట్రాన్స్మిషన్ (1,705), అదానీ టోటల్ (1,746) వీటిలో ఉన్నాయి. అదానీ ఇటీవలే ప్రపంచంలోనే అత్యంత సంపన్నుల జాబితాలో వారెన్ బఫెట్‌ను అధిగమించి అయిదో స్థానం దక్కించుకున్నారు. ► చమురు, గ్యాస్, మెటల్స్ దిగ్గజం వేదాంత ఏకంగా 703 స్థానాలు ఎగబాకి 593వ ర్యాంకు దక్కించుకుంది. ► ఫోర్బ్స్ గ్లోబల్ 2000 లిస్టులో చోటు దక్కించుకున్న భారతీయ సంస్థల్లో అత్యధికంగా ఇంధన, బ్యాంకింగ్ రంగ కంపెనీలే ఉన్నాయి. -
గ్లోబల్ టాప్ సీఈఓల్లో అంబానీ
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక సీఈఓ వరల్డ్ మ్యాగజైన్ తాజాగా ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రభావశీల చీఫ్ ఎగ్జిక్యూటివ్స్ (సీఈఓ) 2019 జాబితాను విడుదల చేసింది. 121 మందితో కూడిన ఈ జాబితాలో వాల్‌మార్ట్ సీఈఓ డగ్లస్ మెక్‌మిలన్ అగ్రస్థానంలో నిలిచారు. 10 మంది భారతీయులకూ ఈ జాబితాలో చోటు లభించింది. భారత్‌కు సంబంధించి ర్యాంకింగ్ విషయానికి వస్తే, ఆర్సిలార్ మిట్టల్ చీఫ్ లక్ష్మీ మిట్టల్ 3వ ర్యాంక్‌తో ముందు నిలిచారు. అయితే ఆయన కంపెనీ కేంద్రాన్ని లగ్జెంబర్గ్గా పేర్కొనడం జరిగింది. దీనితో 49వ ర్యాంక్‌తో ముకేశ్ అంబానీ దేశంలో తొలి స్థానాన్ని దక్కించుకున్నట్లయ్యింది. టాప్ 3గా లక్ష్మీ మిట్టల్: గ్లోబల్ జాబితాలో వాల్‌మార్ట్ సీఈఓ డగ్లస్ మెక్‌మిలన్ ముందు నిలవగా, రెండవ స్థానంలో రాయల్ డచ్ షెల్ గ్లోబల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ బెన్ వాన్ బెవుర్డెన్ నిలిచారు. మూడవ స్థానంలో ఆర్సిలర్ మిట్టల్ చైర్మన్ అండ్ సీఈఓ లక్ష్మీ మిట్టల్ ఉన్నారు. నాల్గవ ర్యాంక్‌ను సౌదీ ఆరామ్కో సీఈఓ అమిన్ హెచ్ నాసర్ సొంతం చేసుకున్నారు. బీపీ చీఫ్ బాబ్ డుబే ఐదవ స్థానాన్ని, ఎక్సాన్‌మొబిల్ సీఈఓ డారిన్ ఉడ్స్ ఆరవస్థానాన్ని, ఫోక్స్‌వ్యాగన్ సీఈఓ హెర్బర్ట్ డియాస్ ఏడవ స్థానాన్ని, టయాటా సీఈఓ అరియో టయోడా ఎనిమిదవ స్థానాన్ని పొందారు. 9,10 స్థానాలను వరుసగా యాపిల్ సీఈఓ టిమ్‌కుక్, బెర్క్‌షైర్ హాత్వే సీఓఈ వారెన్ బఫెట్ పొందారు. అమెజాన్ సీఈఓ జెఫ్ బెజోస్ 11వ స్థానాన్ని, యునైటెడ్హెల్త్గ్రూప్ సీఈఓ డేవిడ్ విచ్మన్ 12వ స్థానాన్ని, శాంసంగ్ సీఈఓ కిమ్ కి–నామ్ 13వ స్థానాన్ని దక్కించుకున్నారు. గర్వకారణం: ఓఎన్జీసీ, ఐఓసీ తమ సంస్థల సీఈఓలకు ఈ ప్రతిష్టాత్మక జాబితాలో గుర్తింపు లభించడం గర్వకారణమని ఓఎన్జీసీ, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ)లు వేర్వేరు ప్రకటనల్లో పేర్కొన్నాయి. ప్రాతిపదిక ఇది...: సీఈఓలకు సంబంధించి సీఈఓ వరల్డ్ మ్యాగజైన్ గ్లోబల్ ర్యాకింగ్స్ ప్రతిష్టాత్మకమైనవి. 96 దేశాల్లో 1,200కిపైగా సీఈఓలను ఈ ర్యాంకింగ్స్‌కు పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది. కంపెనీ వ్యాపార పనితీరు, సీఈఓ పూర్తి బాధ్యతల కాలంలో కంపెనీ సాధించిన ఫైనాన్షియల్ రిటర్న్స్ తుది ర్యాంకింగ్‌లో 60 శాతం వెయిటేజ్‌ని కలిగిఉంటాయి. పర్యావరణం, పాలనాతీరు, కంపెనీలో ఉద్యోగుల ఆర్థిక పరిస్థితులు, మార్కెట్ షేర్లు, మార్కెట్ క్యాపిటలైజేషన్లో మార్పులు వంటి అంశాలు మిగిలిన 40 శాతం వెయిటేజీలో ఉన్నాయి. -
ఫార్చూన్ 500లో షావోమి
బీజింగ్: చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్స్ తయారీ సంస్థ షావోమి తాజాగా ఫార్చూన్ గ్లోబల్ 500 కంపెనీల జాబితాలో చోటు దక్కించుకుంది. కార్యకలాపాలు ప్రారంభించిన తక్కువ కాలంలోనే ఈ ఘనత సాధించిన సంస్థగా నిల్చింది. తొమ్మిదేళ్ల క్రితం ప్రారంభమైన షావోమి ఈ ఏడాది ఫార్చూన్ 500 జాబితాలో 468వ ర్యాంకు దక్కించుకుంది. గత ఆర్థిక సంవత్సరం 26.44 బిలియన్ డాలర్ల ఆదాయం, 2 బిలియన్ డాలర్ల లాభాలు నమోదు చేసింది. యూజర్లు, అభిమానుల తోడ్పాటుతో కేవలం తొమ్మిదేళ్ల కాలంలోనే ఈ మైలురాయి అధిగమించగలిగామని షావోమి వ్యవస్థాపక చైర్మన్ లై జున్ తెలిపారు. 2010 ఏప్రిల్‌లో మొదలైన షావోమి ఇటీవల జూన్‌లో తొలిసారిగా ఫార్చూన్ చైనా 500 లిస్టులో 53వ స్థానంలో నిల్చింది. -
అత్యుత్తమ అధ్యక్షుడు ఒబామా
వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామానే ఉత్తమ అధ్యక్షుడు అని అధిక శాతం మంది అమెరికన్లు అభిప్రాయపడ్డారు. అమెరికా అధ్యక్షులపై ప్యూ రీసెర్చ్ సెంటర్ జరిపిన సర్వేలో ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నాలుగో స్థానంలో నిలిచారు. రెండు పర్యాయాలు అమెరికా అధ్యక్షుడిగా పనిచేసిన బరాక్ ఒబామాను 44 శాతం మంది అమెరికన్లు బెస్ట్ ప్రెసిడెంట్‌గా పేర్కొన్నారు. 33 శాతంతో రెండో స్థానంలో బిల్ క్లింటన్, 32 శాతంతో మూడో స్థానంలో రొనాల్డ్ రీగన్ నిలిచారు. కనీసం సగం పదవీ కాలాన్ని కూడా పూర్తి చేసుకోని ట్రంప్ మాత్రం కేవలం 19 శాతం ఓట్లతో నాలుగో స్థానంతో సరిపుచ్చుకున్నారు. 2011లో ఒబామా తొలిసారి అధ్యక్షుడిగా ఎన్నికైనప్పుడు నిర్వహించిన సర్వేలో 20 శాతం ఓట్లతో ఆయన మొదటి స్థానంలో నిలిచారు. 2018 జూన్ 5 నుంచి 12 మధ్య తమ జీవిత కాలంలో తాము చూసిన అధ్యక్షులపై 2,002 మంది వయోజనుల అభిప్రాయాలు సేకరించారు. ఫస్ట్ చాయిస్, సెకండ్ చాయిస్ ఆధారంగా విశ్లేషణ చేశారు. ఫస్ట్ చాయిస్లో 31 శాతం, సెకండ్ చాయిస్లో 13 శాతంతో మొత్తం 44 శాతం ఒబామా మొదటి స్థానంలో నిలిచారు. ట్రంప్ తమకు ఫస్ట్ చాయిస్ అని 10 శాతం మంది చెప్పగా, 9 శాతం మంది సెకండ్ చాయిస్ అని పేర్కొన్నారు. -
వైజాగ్‌కు 3వ ర్యాంకు, హైదరాబాద్‌కు 22..
న్యూఢిల్లీ: స్వచ్ఛభారత్ ర్యాంకులు విడుదలయ్యాయి. ఈ ర్యాంకుల్లో మధ్యప్రదేశ్‌కు చెందిన ఇండోర్ మొదటి స్థానంలో నిలిచింది. గత ఏడాది ఇదే స్థానంలో ఉన్న మైసూరు ఐదో స్థానానికి పడిపోయింది. తెలుగు రాష్ట్రాల్లోని ఆంధ్రప్రదేశ్‌కు చెందిన విశాఖపట్టణానికి మూడో ర్యాంకు రాగా, తెలంగాణలోని హైదరాబాద్ నగరం మాత్రం 22వ స్థానంలో నిలిచింది. 2014 అక్టోబర్ నెలలో స్వచ్ఛ భారత్ మిషన్ ప్రారంభమైన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఏడాది నుంచి దీనికింద అవార్డులు ఇస్తున్నారు. ఆయా నగరాల్లో ఉండే మౌలిక సదుపాయాలు, పారిశుద్ధ్య నిర్వహణ, బహిరంగ మలమూత్ర విసర్జన శాలల ఏర్పాటు, ఇళ్లల్లో మరుగుదొడ్ల నిర్మాణం, రవాణా వ్యవస్థ, చెత్త శుద్ధి నిర్వహణవంటి అంశాల ప్రాతిపదికన ఈ ర్యాంకులు ప్రకటిస్తారు. తాజాగా మొత్తం 434 నగరాలు, చిన్నచిన్న పట్టణాలకు కలిపి ర్యాంకులు ప్రకటించారు. వీటిల్లో తొలి 50 ర్యాంకులు పొందిన నగరాల్లో టాప్ 5లో ఇండోర్, భోపాల్, విశాఖపట్నం(వైజాగ్) సూరత్, మైసూరు ఉండగా.. 50 ర్యాంకుల్లో స్థానం పొందిన తెలుగు రాష్ట్రాల నగరాలను పరిశీలిస్తే వైజాగ్(3), తిరుపతి (9), విజయవాడ(19), గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(22), వరంగల్(28), సూర్యాపేట(30), తాడిపత్రి (31), నరసారావుపేట(40), కాకినాడ(43), తెనాలి(44), సిద్దిపేట(45), రాజమండ్రి (46) ర్యాంకులను సొంతం చేసుకున్నాయి.