బీజింగ్: చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్స్ తయారీ సంస్థ షావోమి తాజాగా ఫార్చూన్ గ్లోబల్ 500 కంపెనీల జాబితాలో చోటు దక్కించుకుంది. కార్యకలాపాలు ప్రారంభించిన తక్కువ కాలంలోనే ఈ ఘనత సాధించిన సంస్థగా నిల్చింది. తొమ్మిదేళ్ల క్రితం ప్రారంభమైన షావోమి ఈ ఏడాది ఫార్చూన్ 500 జాబితాలో 468వ ర్యాంకు దక్కించుకుంది. గత ఆర్థిక సంవత్సరం 26.44 బిలియన్ డాలర్ల ఆదాయం, 2 బిలియన్ డాలర్ల లాభాలు నమోదు చేసింది. యూజర్లు, అభిమానుల తోడ్పాటుతో కేవలం తొమ్మిదేళ్ల కాలంలోనే ఈ మైలురాయి అధిగమించగలిగామని షావోమి వ్యవస్థాపక చైర్మన్ లై జున్ తెలిపారు. 2010 ఏప్రిల్‌లో మొదలైన షావోమి ఇటీవల జూన్‌లో తొలిసారిగా ఫార్చూన్ చైనా 500 లిస్టులో 53వ స్థానంలో నిల్చింది.
Comments
Please login to add a commentAdd a comment