దాదాపు పదేళ్ల విరామం తర్వాత ఐపీఎల్ కామెంటేటర్‌గా పునరాగమనం చేయనున్నాడు టీమిండియా మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధు. మరోసారి తన వాక్చాతుర్యంతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాడు. ఈ నేపథ్యంలో తన రీఎంట్రీని ధ్రువీకరిస్తూ సిద్ధు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.
తన ఫస్ట్ లవ్ క్రికెట్ అన్న ఈ పంజాబీ బ్యాటర్.. చేపకు ఈత నేర్పడం ఎటువంటిదో తనకు కామెంట్రీ గురించి ఎవరైనా కొత్తగా చెప్పడం కూడా అలాంటిదేనన్నాడు. గ్యాప్ వచ్చినా తన మాటల పదును ఏమాత్రం తగ్గలేదని నిరూపించేందుకు సిద్ధంగా ఉన్నానన్నాడు సిద్ధు.
తన కెరీర్‌లో కఠిన సవాళ్ల అనంతరం సుమారు 20 సార్లు రీఎంట్రీ ఇచ్చానన్న నవజ్యోత్ సింగ్ సిద్ధు.. కామెంటేటర్‌గా మాత్రం ఇదే తొలి కమ్‌బ్యాక్ అని పేర్కొన్నాడు. వ్యాఖ్యాతగా ప్రయాణం ప్రారంభించాలనుకున్నపుడు తను ఏమాత్రం కాన్ఫిడెంట్‌గా లేనన్న సిద్ధు.. వరల్డ్‌కప్ లాంటి మెగా ఈవెంట్లో కూడా అదరగొట్టడం అభిమానులతో పాటు తననూ ఆశ్చర్యపరిచిందన్నాడు.
గతంలో ఇలాంటి మేజర్ టోర్నీ మొత్తం కామెంట్రీ చేసినందుకు రూ. 60- 70 లక్షలు పారితోషకంగా అందుకునే వాడినన్న నవజ్యోత్ సింగ్ సిద్ధు.. ఐపీఎల్‌లో మాత్రం రోజుకు రూ. 25 లక్షలు వస్తాయని చెప్పాడు. అయితే, ఐపీఎల్‌లో కేవలం డబ్బు వల్ల మాత్రమే సంతృప్తి దొరకదని.. పెద్ద సంఖ్యలో ఆటగాళ్లను దగ్గరగా గమనిస్తూ సమయం గడపటం సరదాగా ఉంటుందని పేర్కొన్నాడు.
ఇక టీ20 ప్రపంచకప్-2024 కంటే ముందు ఐపీఎల్ రూపంలో ప్రేక్షకులకు కావాల్సినంత వినోదం దొరకనుందన్న సిద్ధు.. ఇప్పుడు అందరి కళ్లు క్యాష్ రిచ్ లీగ్ మీదనే ఉన్నాయన్నాడు. కేవలం టీమిండియా ఆటగాళ్లకే కాకుండా ప్రధాన జట్టు ఆటగాళ్లంతా వరల్డ్‌కప్ బెర్తు ఖరారు చేసుకోవాలంటే ఐపీఎల్-2024 ప్రదర్శనే ప్రామాణికంగా ఉండబోతుందని సిద్ధు అభిప్రాయపడ్డాడు. పీటీతో మాట్లాడుతూ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు.
కాగా రాజకీయాల్లోనూ ప్రవేశించిన సిద్ధుకు పంజాబ్ మంత్రిగానూ పనిచేసిన అనుభవం ఉంది. ఇక మార్చి 22న ఐపీఎల్ పదిహేడో ఎడిషన్ ఆరంభం కానుంది. చెపాక్ స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్- రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్‌తో ఈ ఈవెంట్ షురూ కానుంది.
చదవండి: T20I: అఫ్గనిస్తాన్‌కు షాకిచ్చిన ఆస్ట్రేలియా.. అధికారిక ప్రకటన
Comments
Please login to add a commentAdd a comment