T20 World Cup 2021: Hyderabad Cricketer Sandeep Goud Playing For Oman Cricket Team - Sakshi
Sakshi News home page

T20 World Cup 2021 : ఒమన్‌ జట్టులో హైదరాబాదీ క్రికెటర్‌..

Published Sun, Oct 17 2021 4:00 PM | Last Updated on Sun, Oct 17 2021 5:34 PM

T20 World Cup 2021:Hyderabad Born Cricketer Sandeep Goud Playing For Oman Cricket Team - Sakshi

Hyderabad Born Cricketer Sandeep Goud Playing For Oman Cricket Team: టీ20 ప్రపంచకప్‌-2021కు అర్హత సాధించిన 8 క్వాలిఫయర్స్‌ జట్లలో ఒకటైన ఒమన్‌ జట్టులో హైదరాబాద్‌ బార్న్‌ క్రికెటర్‌ చోటు దక్కించుకున్నాడు. నగరంలోని కవాడిగూడకు చెందిన 29 ఏళ్ల  శ్రీమంతుల సందీప్‌ గౌడ్‌.. 2016లో ఉద్యోగ రిత్యా ఒమన్‌కు వెళ్లి అక్కడే సెటిల్‌ అయ్యాడు.  ఈ క్రమంలో అక్కడి దేశవాళీ మ్యాచ్‌ల్లో సత్తా చాటి 2019 ఫిబ్రవరిలో ఒమన్‌ జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు.

బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌గా గుర్తింపు తెచ్చుకున్న సందీప్‌ గౌడ్‌.. ఇప్పటివరకు 19 వన్డేలు, 15 టీ20లు ఆడాడు. సందీప్‌ 2005-08 మధ్యలో హైదరాబాద్‌ అండర్‌-15, 19 జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. ఇదిలా ఉంటే, ఒమన్‌-పపువా న్యూ గినియా జట్ల మధ్య ఇవాళ ప్రారంభమైన టీ20 ప్రపంచకప్‌ ఆరంభ మ్యాచ్‌లో సందీప్‌ ఒమన్‌ తుది జట్టులో చోటు దక్కించుకున్నాడు. 
చదవండి: 17 ఏళ్ల తర్వాత పాక్‌లో పర్యటించనున్న టీమిండియా..!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement