sandeep goud
-
T20 World Cup 2021 : ఒమన్ జట్టులో హైదరాబాదీ క్రికెటర్..
Hyderabad Born Cricketer Sandeep Goud Playing For Oman Cricket Team: టీ20 ప్రపంచకప్-2021కు అర్హత సాధించిన 8 క్వాలిఫయర్స్ జట్లలో ఒకటైన ఒమన్ జట్టులో హైదరాబాద్ బార్న్ క్రికెటర్ చోటు దక్కించుకున్నాడు. నగరంలోని కవాడిగూడకు చెందిన 29 ఏళ్ల శ్రీమంతుల సందీప్ గౌడ్.. 2016లో ఉద్యోగ రిత్యా ఒమన్‌కు వెళ్లి అక్కడే సెటిల్ అయ్యాడు. ఈ క్రమంలో అక్కడి దేశవాళీ మ్యాచ్‌ల్లో సత్తా చాటి 2019 ఫిబ్రవరిలో ఒమన్ జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు. బౌలింగ్ ఆల్‌రౌండర్‌గా గుర్తింపు తెచ్చుకున్న సందీప్ గౌడ్.. ఇప్పటివరకు 19 వన్డేలు, 15 టీ20లు ఆడాడు. సందీప్ 2005-08 మధ్యలో హైదరాబాద్ అండర్-15, 19 జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. ఇదిలా ఉంటే, ఒమన్-పపువా న్యూ గినియా జట్ల మధ్య ఇవాళ ప్రారంభమైన టీ20 ప్రపంచకప్ ఆరంభ మ్యాచ్‌లో సందీప్ ఒమన్ తుది జట్టులో చోటు దక్కించుకున్నాడు. చదవండి: 17 ఏళ్ల తర్వాత పాక్‌లో పర్యటించనున్న టీమిండియా..! -
అమెరికా, ఒమన్లకు వన్డే హోదా
దుబాయ్: అగ్రరాజ్యం అమెరికాతో పాటు మధ్య ఆసియా దేశం ఒమన్లకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) వన్డే జట్ల హోదా దక్కింది. బుధవారం జరిగిన ఐసీసీ వరల్డ్ క్రికెట్ లీగ్ డివిజన్–2లో ఒమన్ నాలుగు వికెట్లతో నమీబియాపై, అమెరికా 84 పరుగుల తేడాతో హాంకాంగ్‌పై విజయం సాధించడంతో వన్డే హోదాకు అర్హత సాధించాయి. డివిజన్–2లో ప్రస్తుతం స్కాట్లాండ్, నేపాల్ ఉన్నాయి. 2023లో జరిగే ప్రపంచ కప్‌కు అర్హత సాధించే క్రమంలో ఈ నాలుగు జట్ల మధ్య రాబోయే రెండున్నరేళ్లలో 36 వన్డే మ్యాచ్‌లు జరుగుతాయి. ఒమన్‌ను ఒడ్డెక్కించిన హైదరాబాదీ సందీప్ గౌడ్ ఒమన్ జట్టు ఐసీసీ వన్డే హోదా సాధించడంలో హైదరాబాదీ ఆల్‌రౌండర్ సందీప్ గౌడ్ (53 బంతుల్లో 57 నాటౌట్; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) అజేయ అర్ధసెంచరీతో కీలక పాత్ర పోషించాడు. బుధవారం నాటి మ్యాచ్‌లో ఆతిథ్య నమీబియా తొలుత 9 వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో ఒమన్ 157 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో సందీప్ ఒత్తిడిని తట్టుకుని నిలిచాడు. దీంతో ఒమన్ మరో ఐదు బంతులు ఉండగానే, 6 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసి గెలుపొందింది. అంతకుముందు పంజాబ్‌కు చెందిన వికెట్ కీపర్ సూరజ్ కుమార్ (51) ఒమన్ ఛేదనను ముందుకు నడిపించాడు. -
హైదరాబాద్ చేరిన సంకీర్త్ మృతదేహం
హైదరాబాద్: అమెరికాలో దారుణహత్యకు గురైన సాఫ్ట్వేర్ ఇంజినీర్ గుండం సంకీర్త్ మృతదేహం సోమవారం వేకువజామున హైదరాబాద్‌కు చేరింది. భౌతికకాయాన్ని తొలుత న్యూజెర్సీలోని భారత రాయభార కార్యాలయానికి తరలించి అక్కడి నుండి ఎయిరిండియా విమానంలో మృతదేహాన్ని శంషాబాద్ విమానాశ్రయానికి తీసుకువచ్చారు. అక్కడి నుంచి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న కుటుంబసభ్యులు సుల్తాన్‌బజార్ కుత్బీగూడలోని తమ స్వగృహానికి తీసుకెళ్లారు. ఈరోజు ఉదయం 11 గంటలకు అంబర్‌పేటలోని శ్మశానవాటికలో అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబసభ్యులు తెలిపారు. కాగా ఈనెల 18వ తేదీన టెక్సాస్‌లోని ఆస్టియాలో సంకీర్త్ హత్యకు గురయ్యాడు. అతడిని హైదరాబాద్‌కు చెందిన రూంమేట్ సందీప్ గౌడ్ కత్తితో హతమార్చిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా గొడవ జరిగిన రోజు సంకీర్త్ గదిలోనే ఉన్న ప్రణీత్ పాత్రపై కూడా విచారణ చేపట్టాలని సంకీర్త్ సన్నిహితులు సందీప్, సంజయ్ అక్కడి పోలీస్‌లకు విజ్ఞప్తి చేశారు.