హైదరాబాద్: అమెరికాలో దారుణహత్యకు గురైన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ గుండం సంకీర్త్ మృతదేహం సోమవారం వేకువజామున హైదరాబాద్‌కు చేరింది. భౌతికకాయాన్ని తొలుత న్యూజెర్సీలోని భారత రాయభార కార్యాలయానికి తరలించి అక్కడి నుండి ఎయిరిండియా విమానంలో మృతదేహాన్ని శంషాబాద్ విమానాశ్రయానికి తీసుకువచ్చారు. అక్కడి నుంచి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న కుటుంబసభ్యులు సుల్తాన్‌బజార్ కుత్బీగూడలోని తమ స్వగృహానికి తీసుకెళ్లారు.
ఈరోజు ఉదయం 11 గంటలకు అంబర్‌పేటలోని శ్మశానవాటికలో అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబసభ్యులు తెలిపారు. కాగా ఈనెల 18వ తేదీన టెక్సాస్‌లోని ఆస్టియాలో సంకీర్త్ హత్యకు గురయ్యాడు. అతడిని హైదరాబాద్‌కు చెందిన రూంమేట్ సందీప్ గౌడ్ కత్తితో హతమార్చిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా గొడవ జరిగిన రోజు సంకీర్త్ గదిలోనే ఉన్న ప్రణీత్ పాత్రపై కూడా విచారణ చేపట్టాలని సంకీర్త్ సన్నిహితులు సందీప్, సంజయ్ అక్కడి పోలీస్‌లకు విజ్ఞప్తి చేశారు.