జట్టులో బెస్ట్‌ ఫీల్డర్‌గా గుర్తింపు.. స్టన్నింగ్‌ క్యాచ్‌కు షకీబ్‌ ఫిదా | T20 World Cup 2021: Charles Amini Super Catch Dismiss Shakib Al Hasan | Sakshi
Sakshi News home page

T20 WC 2021: జట్టులో బెస్ట్‌ ఫీల్డర్‌గా గుర్తింపు.. స్టన్నింగ్‌ క్యాచ్‌కు షకీబ్‌ ఫిదా

Published Thu, Oct 21 2021 6:43 PM | Last Updated on Thu, Oct 21 2021 7:48 PM

T20 World Cup 2021: Charles Amini Super Catch Dismiss Shakib Al Hasan - Sakshi

Charles Amini Stunning Catch In BAN Vs PNG.. టి20 ప్రపం‍చకప్‌ 2021లో అరంగేట్రం చేసిన పపువా న్యూ గినియా ఒక్క మ్యాచ్‌లోనూ గెలవకపోయినప్పటికి ఒమన్‌ అభిమానులను మాత్రం అలరిస్తుంది. తాజాగా బంగ్లాదేశ్‌, పపువా మధ్య జరుగుతున్న గ్రూఫ్‌-బి క్వాలిఫయర్‌ మ్యాచ్‌లో పపువా ఫీల్డర్‌ చార్లెస్‌ అమిని సూపర్‌ క్యాచ్‌తో అభిమానుల మనసు గెలుచుకున్నాడు. అందులోనూ షకీబ్‌ అల్‌ హసన్‌ లాంటి స్టార్‌ ఆల్‌రౌండర్‌ క్యాచ్‌ అందుకుంటే ఆ ఫీల్డర్‌ ఆనందం వేరే లెవెల్లో ఉంటుంది. ఇంకా చెప్పాలంటే పపువా జట్టులో చార్లెస్‌ అమిని బెస్ట్‌ ఫీల్డర్‌గా గుర్తింపు పొందాడు. ఈ మ్యాచ్‌లో 46 పరుగులు చేసిన షకీబ్‌ ఇన్నింగ్స్‌ 14వ ఓవర్‌ నాలుగో బంతిని లాంగాన్‌ దిశగా భారీ షాట్‌ ఆడాడు.

చదవండి: T20 WC 2021: మెంటార్‌గా పని ప్రారంభించిన ధోని.. వీడియో వైరల్‌

అయితే అక్కడే ఉన్న చార్లెస్‌ అమిని ముందుకు పరిగెత్తుకుంటూ వచ్చి డైవ్‌ చేస్తూ సూపర్‌ క్యాచ్‌ అందుకున్నాడు. అంతే అర్థసెంచరీ లేకుండానే షకీబ్‌ కథ ముగిసింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ భారీ విజయం దిశగా సాగుతుంది. 182 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పపువా న్యూ గినియా 13 ఓవర్లు ముగిసేసరికి ఏడు వికెట్లు కోల్పోయి 49 పరుగులు చేసింది. అంతకముందు తొలుత బ్యాటింగ్‌ చేసిన బంగ్లాదేశ్‌ మహ్మదుల్లా, షకీబ్‌ మెరుపులతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది.    

చదవండి: T20 WC 2021 IND Vs PAK: ఆ మూడు స్థానాలు పెద్ద తలనొప్పి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement