T20 World Cup 2021.. టి20 ప్రపంచకప్ క్వాలిఫయర్ పోటీల్లో భాగంగా పపువా న్యూ గినియా, స్కాట్లాండ్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో స్కాట్లాండ్ ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్లో హై డ్రామా నెలకొంది. ఆఖరి ఓవర్లో నలుగురు బ్యాటర్స్ వెనుదిరగడం విశేషం. అయితే బౌలర్‌కు మాత్రం హ్యాట్రిక్ దక్కలేదు. విషయంలోకి వెళితే.. కాబువా మోరియా వేసిన ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్ రెండో బంతికి తొలుత గ్రీవీస్ ఔటయ్యాడు. ఆ తర్వాత నాలుగో బంతికి లీస్క్ రనౌట్ కాగా.. తర్వాతి బంతికి డేవీ క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. ఇక ఆఖరి బంతికి మార్క్‌వాట్ క్లీన్‌బౌల్డ్ కాగా.. ఆఖరి ఓవర్లో నాలుగు వికెట్లు పడ్డప్పటికీ మధ్యలో ఒక రనౌట్ ఉండడంతో బౌలర్‌కు హ్యాట్రిక్ మిస్సయింది.
చదవండి: T20 WC IND Vs PAK: 'మౌకా.. మౌకా'.. కింగ్ కోహ్లి.. బాద్షా బాబర్
ఇక మ్యాచ్‌లో స్కాట్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. 26 పరుగులకే ఓపెనర్ల వికెట్లు కోల్పోయిన స్కాట్లాండ్ ఇన్నింగ్స్‌ను మాథ్యూ క్రాస్(45), రిచీ బెరింగ్‌టన(70) పరుగులతో నిలబెట్టారు. అయితే ఆ తర్వాత వచ్చిన బ్యాటర్స్ పెద్దగా రాణించలేకపోయారు.
చదవండి: T20 World Cup 2021: 2 ప్రపంచకప్‌లలో 2 వేర్వేరు దేశాలు.. చరిత్ర సృష్టించిన నమీబియా క్రికెటర్
Comments
Please login to add a commentAdd a comment