last over
-
ఎస్ ఆర్ హెచ్ టీంకి బాహుబలి అతను... జీరో టు హీరో అంటే ఇదే
-
చివరి ఓవర్లో వరుసగా 5 సిక్సర్లు కొట్టిన రింకూ సింగ్
-
ఓటమి కొనితెచ్చుకోవడమంటే ఇదే..
సులభంగా గెలవాల్సిన మ్యాచ్‌లను చేజేతులా ఓడిపోవడం అప్పుడప్పుడు చూస్తుంటాం. అది అంతర్జాతీయ మ్యాచ్ లేక ఇంకోటి ఏదైనా కావొచ్చు.. కచ్చితంగా గెలుస్తాం అన్న దశలో ఓటమి పాలయితే ఆ బాధ ఎలా ఉంటుందో ప్రత్యేక్యంగా చెప్పనవసరం లేదు. అచ్చం అలాంటి తరహాలోనే ఒక జట్టు ఈజీగా గెలవాల్సింది పోయి చేజేతులా ఓటమిని కొనితెచ్చుకుంది. విషయంలోకి వెళితే.. లోకల్ క్రికెట్ టోర్నమెంట్లో ఒక జట్టు గెలవాలంటే ఆఖరి బంతికి ఐదు పరుగులు కావాలి. ఫోర్ కొడితే టై.. సిక్స్ కొడితే విజయం అన్నట్లుగా ఆ జట్టు పరిస్థితి ఉంది. ఇంత ఒత్తిడిలో ఆ జట్టు బ్యాట్స్‌మన్ ఎలాగైనా సిక్స్ కొట్టాలని భారీ షాట్‌కు ప్రయత్నించాడు. కానీ షాట్ మిస్జడ్జ్ అయి పుల్ షాట్ ఆడాడు. బంతి ఫీల్డర్ వద్దకు చేరడంతో రెండు పరుగులు మాత్రమే వచ్చాయి. దీంతో సదరు జట్టు ఓటమి పాలయింది అని అంతా భావించారు. చదవండి: Rohit Sharma: 'ఆరంభానికి ముందు ఈ నిరీక్షణ తట్టుకోలేకపోతున్నా' కానీ మనం ఒకటి తలిస్తే.. దైవం ఇంకోటి తలిచిందన్న తరహాలో బంతి పట్టిన ఫీల్డర్.. బ్యాట్స్‌మన్‌ను రనౌట్ చేద్దామనే ఉద్దేశంతో పరిగెత్తుకొచ్చి బెయిల్స్‌ను పడగొట్టాడు. అయితే అప్పటికే బ్యాట్స్‌మన్ సురక్షితంగా క్రీజులోకి చేరుకున్నాడు. ఇక్కడితో ఊరుకున్న అయిపోయేది. కానీ మళ్లీ ఏం అనిపించిందో.. నాన్‌స్ట్రైక్ ఎండ్‌వైపు రనౌట్ అవకాశం ఉందని బంతిని అటువైపు విసిరాడు. ఈసారి త్రో మిస్ అయిన బంతి బౌండరీ దిశగా పరుగులు పెట్టింది. బౌండరీ వెళ్తున్న బంతిని ఒక ఫీల్డర్ ఆపి త్రో విసిరాడు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఆ గ్యాప్‌లోనే ప్రత్యర్థి బ్యాట్స్‌మన్ మిగతా మూడు పరుగులు కూడా కొట్టేసి జట్టును గెలిపించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన క్రికెట్ ఫ్యాన్స్ నవ్వాపుకోలేకపోయారు.'' ఓటమి కొని తెచ్చుకోవడం అంటే ఇదే.. దరిద్రం నెత్తిమీద ఉంటే విజయం ఎలా వస్తుంది.. ఈజీగా గెలవాల్సిన మ్యాచ్‌ను చేజేతులా పోగొట్టుకున్నారు'' అంటూ కామెంట్స్ చేశారు. చదవండి: సిక్స్ కొడితే ఫైనల్‌కు.. బౌలర్‌కు హ్యాట్రిక్; ఆఖరి బంతికి ట్విస్ట్ How to score 5 runs off the last ball to win without hitting a boundary… @ThatsSoVillage pic.twitter.com/0nIyl5xbxi — The ACC (@TheACCnz) February 1, 2022 -
T20 WC 2021: ఆఖరి ఓవర్లో నలుగురు ఔట్.. బౌలర్‌కు దక్కని హ్యాట్రిక్
T20 World Cup 2021.. టి20 ప్రపంచకప్ క్వాలిఫయర్ పోటీల్లో భాగంగా పపువా న్యూ గినియా, స్కాట్లాండ్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో స్కాట్లాండ్ ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్లో హై డ్రామా నెలకొంది. ఆఖరి ఓవర్లో నలుగురు బ్యాటర్స్ వెనుదిరగడం విశేషం. అయితే బౌలర్‌కు మాత్రం హ్యాట్రిక్ దక్కలేదు. విషయంలోకి వెళితే.. కాబువా మోరియా వేసిన ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్ రెండో బంతికి తొలుత గ్రీవీస్ ఔటయ్యాడు. ఆ తర్వాత నాలుగో బంతికి లీస్క్ రనౌట్ కాగా.. తర్వాతి బంతికి డేవీ క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. ఇక ఆఖరి బంతికి మార్క్‌వాట్ క్లీన్‌బౌల్డ్ కాగా.. ఆఖరి ఓవర్లో నాలుగు వికెట్లు పడ్డప్పటికీ మధ్యలో ఒక రనౌట్ ఉండడంతో బౌలర్‌కు హ్యాట్రిక్ మిస్సయింది. చదవండి: T20 WC IND Vs PAK: 'మౌకా.. మౌకా'.. కింగ్ కోహ్లి.. బాద్షా బాబర్ ఇక మ్యాచ్‌లో స్కాట్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. 26 పరుగులకే ఓపెనర్ల వికెట్లు కోల్పోయిన స్కాట్లాండ్ ఇన్నింగ్స్‌ను మాథ్యూ క్రాస్(45), రిచీ బెరింగ్టన(70) పరుగులతో నిలబెట్టారు. అయితే ఆ తర్వాత వచ్చిన బ్యాటర్స్ పెద్దగా రాణించలేకపోయారు. చదవండి: T20 World Cup 2021: 2 ప్రపంచకప్‌లలో 2 వేర్వేరు దేశాలు.. చరిత్ర సృష్టించిన నమీబియా క్రికెటర్ -
ఆ చివరి ఓవర్ వ్యూహం ఏంటి?
క్రికెట్ జట్టుకు కెప్టెన్సీ వహించడం అంటే ఎలా ఆడాలో సహచరులకు చెప్పడం మాత్రమే కాదు.. బంతి ఎక్కడికొస్తుందో, దాన్ని బ్యాట్స్‌మన్ ఎలా కొడతాడో.. ఆ బంతిని క్యాచ్ పట్టడానికి సరైన స్థానం ఏదో, అక్కడ ఉండాల్సిన సరైన ఫీల్డర్ ఎవరో.. ఇన్ని ఆలోచనలు నిమిషాల మీద రావాలి. ఫిజిక్స్ సూత్రాల ఆధారంగా వచ్చిన ఆలోచనలను సరిగ్గా కొలతల ప్రకారం అమలు చేయాలి, అలా అమలుచేసిన వ్యూహం ఫలించాలి. అప్పుడే ఫలితం వస్తుంది. బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్ చిట్టచివరి ఓవర్లో మిస్టర్ కూల్ కెప్టెన్ ధోనీ సరిగ్గా ఇలాగే లెక్కలు వేశాడు. అంతగా అనుభవం లేని పేస్‌బౌలర్ హార్దిక్ పాండ్యా చేతికి బాల్ ఇచ్చాడు. కానీ అంతకుముందు మొదటి స్పెల్‌లో పాండ్యా ఏకంగా 16 పరుగులు సమర్పించుకున్నాడు. చివరి ఓవర్లో విజయానికి కావల్సినవి కేవలం 11 పరుగులే. సీనియర్ పేసర్ ఆశిష్ నెహ్రా ఉన్నా.. అతడి కోటా అప్పటికే అయిపోయింది. దాంతో సీనియర్ సహచరులంతా పాండ్యాను దగ్గరకు తీసుకుని తమకు తోచిన అన్నిరకాల సలహాలు ఇచ్చారు. ముఖ్యంగా నెహ్రా అయితే బాల్ ఎలా వేయాలన్న విషయం మీద చివరి నిమిషం వరకు చెబుతూనే ఉన్నాడు. ధోనీ మాత్రం చాలా కూల్‌గా బాల్ వేయాల్సిన విధానంతో పాటు ధైర్యంగా ఉండమని చెప్పాడు. ఆ టైంలో యార్కర్లు వేయొద్దని స్పష్టం చేశాడు. కాస్త బ్యాక్ ఆఫ్ ద లెంగ్త్ డెలివరీ వేయాలని.. అయితే ఎంత లెంగ్త్ అన్నది మాత్రం మళ్లీ అప్పటికప్పుడు చూసుకోవాల్సిందేనని అన్నాడు. మళ్లీ వైడ్ బాల్ మాత్రం వేయొద్దని, అలా వేస్తే బంతి కీపర్ చేతిలోకి వచ్చేలోపు బ్యాట్స్‌మన్ ఓ పరుగు తీసేస్తాడని తెలిపాడు. అందరి ఆలోచనలను పాండ్యా చాలా చక్కగా అమలుచేశాడని చెప్పాడు. పాండ్యా ఆఫ్ స్టంప్‌కు కొద్ది అవతలగా బాల్స్ వేయడంతో వాటిని భారీ షాట్‌గా మార్చాలనుకున్న ఇద్దరు స్టార్ బ్యాట్స్‌మెన్ మహ్మదుల్లా, ముష్ఫిఖుర్ రహీమ్ ఇద్దరూ ఒకరు శిఖర్ ధావన్‌కి, మరొకరు రవీంద్ర జడేజాకు క్యాచ్‌లు ఇచ్చి పెవిలియన్ బాట పట్టారు. కేవలం రెండు పరుగులు తీస్తే సరిపోయేదానికి ఫ్యాన్సీషాట్ కొట్టి ముగించాలనుకోవడం వాళ్లు చేసిన తప్పు అని కామెంటేటర్ స్పష్టంగా చెప్పారు. ఇక చివరి బంతి కూడా కొంచెం వైడ్ బ్యాక్ ఆఫ్ లెంగ్త్ డెలివరీ వేయడంతో.. అది షువగత బ్యాట్‌కు తగిలీ తగలనట్లుగా అయ్యింది. కనీసం ఒక పరుగు తీస్తే సూపర్ ఓవర్ వస్తుందన్న ఆశతో పరుగు మొదలుపెట్టారు. కానీ, వికెట్ల వెనక ఉన్నది జార్ఖండ్ చిరుత. 15 అడుగుల దూరంలో ఉన్న వికెట్ల దగ్గరకు బంతి తీసుకుని ఒక్క ఉదుటున పరుగు తీశాడు. నేరుగా త్రో చేసే అవకాశం ఉన్నా, అది గురితప్పితే రిస్క్ ఎందుకని.. బంతి ఉన్న చేత్తోనే వికెట్లు పడగొట్టాడు. అంతే.. బంగ్లా ఆశలు కుప్పకూలిపోయాయి, టీమిండియా సగర్వంగా తలెత్తుకుంది.