Courtesy: ICC Twitter
T20 WC 2021 Richie Berrington.. స్కాట్లాండ్ బ్యాటర్ రిచీ బెర్రింగ్టన్ అరుదైన ఘనత అందుకున్నాడు. టి20 ప్రపంచకప్‌లో స్కాట్లాండ్ తరపున అర్థ సెంచరీ మార్క్ అందుకున్న తొలి ఆటగాడిగా రికార్డులకెక్కాడు. పపువా న్యూ గినియాతో జరుగుతున్న గ్రూఫ్-బి క్వాలిఫయర్ మ్యాచ్‌లో రిచీ బెర్రింగ్టన్ ఈ ఘనతను అందుకున్నాడు. కాగా ఈ మ్యాచ్‌లో 49 బంతుల్లో 70 పరుగులు చేసిన రిచీ ఇన్నింగ్స్‌లో 6 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి.
చదవండి: T20 WC 2021: ఆఖరి ఓవర్లో నలుగురు ఔట్.. బౌలర్‌కు దక్కని హ్యాట్రిక్
ఇక పపువా న్యూ గినియాతో జరిగిన గ్రూఫ్ బి క్వాలిఫయర్ మ్యాచ్‌లో స్కాట్లాండ్ 17 పరుగులతో ఘన విజయాన్ని అందుకుంది. ఈ విజయంతో స్కాట్లాండ్ క్వాలిఫయర్ పోటీల్లో వరుసగా రెండో విజయాన్ని అందుకొని సూపర్ 12 దశ అర్హతకు మరింత దగ్గరైంది. 166 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పపువా న్యూ గినియా 20 ఓవర్లలో 148 పరుగులకు ఆలౌట్ అయింది. నార్మన్ వనూహ 47 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. స్కాట్లాండ్ బౌలర్లలో జోష్ డేవీ 4 వికెట్లతో సత్తా చాటాడు. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన స్కాట్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది.
Richie Berrington is the first Scotland batsman to score a fifty in the T20 World Cups.#T20WorldCup #Scotland #PapuaNewGuinea #SCOvPNG #RichieBerrington pic.twitter.com/Iq76fPEUQD
— CricTracker (@Cricketracker) October 19, 2021
Comments
Please login to add a commentAdd a comment