T20 World Cup 2021: Namibia Bowler Craziest 1st Over T20 World Cup History - Sakshi
Sakshi News home page

NAM VS SCO: టి20 ప్రపంచకప్‌ చరిత్రలో క్రేజీ ఓవర్‌ అంటున్న ఫ్యాన్స్‌!

Published Wed, Oct 27 2021 10:38 PM | Last Updated on Thu, Oct 28 2021 9:06 AM

T20 World Cup 2021: Namibia Bowler Craziest 1st Over T20 World Cup History - Sakshi

Ruben Trumpelmann Craziest 1st Over T20 World Cup History.. టి20 ప్రపంచకప్‌లో భాగంగా నమీబియాతో మ్యాచ్‌లో స్కాట్లాండ్‌ ఇన్నింగ్స్‌ తొలి ఓవర్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.  రూబెల్‌ ట్రంపెల్‌మన్‌ వేసిన ఇన్నింగ్స్‌ తొలి ఓవర్‌లో స్కాట్లాండ్‌ మూడు వికెట్లు  కోల్పోయిన సంగతి తెలిసిందే. ట్రంపెల్‌మన్‌ తొలి ఓవర్‌ తొలి బంతికే మున్సేను గోల్డెన్‌డక్‌గా వెనక్కిపంపాడు.

చదవండి: ENG Vs BAN: కన్‌ఫ్యూజ్‌ రనౌట్‌.. ఇంగ్లండ్‌ ఆటగాడి డ్యాన్స్‌

ఆ తర్వాత అదే ఓవర్‌ మూడో బంతికి మెక్‌ లియెడ్‌ను డకౌట్‌గా.. నాలుగో బంతికి బెర్రింగ్టన్‌ను గోల్డెన్‌డక్‌గా పెవిలియన్‌ చేర్చాడు. ఈ విధంగా ట్రంపెల్‌మన్‌ (1-0-2-3) తన తొలి ఓవర్‌ ద్వారానే అత్యుత్తమ గణాంకాలు నమోదు చేశాడు.  కాగా టి20 ప్రపంచకప్‌ చరిత్రలో ట్రంపెల్‌మన్‌ తొలి ఓవర్‌ను క్రేజీ ఓవర్‌గా ఫ్యాన్స్‌ అభివర్ణిస్తున్నారు. 

చదవండి: తొలి బంతి.. ఆఖరి బంతిని ఒకే విధంగా ముగించిన స్కాట్లాండ్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement