World Cup 2023 Qualifier, Sri Lanka Vs Oman ODI : Sri Lanka Beat Oman By 10 Wickets - Sakshi
Sakshi News home page

WC 2023 Qualifier: పసికూనపై శ్రీలంక ప్రతాపం.. 10 వికెట్ల తేడాతో ఘన విజయం

Published Fri, Jun 23 2023 7:03 PM | Last Updated on Fri, Jun 23 2023 7:21 PM

Sri Lanka crushes Oman by 10 wickets in World Cup 2023 Qualifier - Sakshi

ఐసీసీ వన్డే వరల్డ్‌కప్‌ క్వాలిఫియర్స్‌-2023లో శ్రీలంక మరో విజయం నమోదు చేసింది. క్వీన్స్‌ స్పోర్ట్స్‌ క్లబ్‌ వేదికగా ఒమన్‌తో జరిగిన మ్యాచ్‌లో 10 వికెట్ల తేడాతో శ్రీలంక గెలుపొందింది. 96 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక.. కేవలం 15 ఓవర్లలలోనే ఛేదించింది. శ్రీలంక ఓపెనర్లు దిముత్‌ కరుణ రత్నే(61), నిస్సాంక(37) పరుగులతో ఆజేయంగా నిలిచి మ్యాచ్‌ను ఫినిష్‌ చేశారు.

అంతకుముందు బ్యాటింగ్‌ చేసిన ఒమెన్‌ శ్రీలంక బౌలర్ల ధాటికి కేవలం 98 పరుగులకే కుప్పకూలింది. లంక బౌలర్లలో హాసరంగా ఐదు వికెట్లతో ఒమన్‌ను దెబ్బ తీయగా.. లహిరు కుమార మూడు, రజితా ఒక్క వికెట్‌ సాధించారు. ఒమన్ బ్యాటర్లలో అయాన్‌ ఖాన్‌(41) పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు.

కాగా ఈ ఈవెంట్‌లో హాసరంగా ఐదు వికెట్ల ఘనత సాధించడం రెండో సారి. ఈ టోర్నీలో గ్రూపు-బిలో ఉన్న లంక వరుసగా రెండు విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్ధానంలో కొనసాగుతోంది. శ్రీలంక తమ తదుపరి మ్యాచ్‌లో ఆదివారం ఐర్లాండ్‌తో తలపడనుంది.
చదవండి: అసలు పోరులో తుస్సు! జట్టు నుంచి అవుట్‌.. నీ సహచర ఆటగాడిని చూడు!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement