విజయం దోబూచులాడిన మ్యాచ్‌లో ఒమన్ ఓటమి
డేవిడ్ వీస్ ఆల్‌రౌండ్ ప్రదర్శన
సూపర్ ఓవర్‌కు ముందు...
నమీబియా గెలిచేందుకు 6 బంతుల్లో 5 పరుగులు కావాలి. క్రీజులో పాతుకుపోయిన ఫ్రయ్‌లింక్ (48 బంతుల్లో 45; 6 ఫోర్లు) ఉండటంతో నమీబియా గెలుపు లాంఛనం. కానీ మెహ్రాన్ ఖాన్ అద్భుతమైన బౌలింగ్ వల్ల ఆఖరి బంతి బౌల్ అయ్యేసరికి ఒమన్ గెలవాలి! ఫ్రయ్‌లింక్, గ్రీన్ వికెట్లు తీసిన మెహ్రాన్ 4 పరుగులే ఇచ్చాడు. చివరి బంతికి 2 పరుగులపుడు మెహ్రాన్ చక్కని బంతి వేయగా... వికెట్ కీపర్ మిస్ ఫీల్డింగ్, మిస్ త్రో వల్ల ఒక పరుగు వచ్చి స్కోరు ‘టై’ అయింది. తుది ఫలితం కోసం మ్యాచ్ సూపర్ ఓవర్‌కు దారి తీసింది.
సూపర్ ఓవర్లో...
ఒమన్ బౌలర్ బిలాల్ ఖాన్ వేసిన ఈ ఓవర్‌లో నమీబియా బ్యాటర్లు డేవిడ్ వీస్ తొలి నాలుగు బంతుల్లో 4, 6, 2, 1 కొట్టగా... చివరి రెండు బంతులు ఆడిన ఎరాస్మస్ 4, 4 బాదడంతో ఆ జట్టు వికెట్ కోల్పోకుండా 21 పరుగులు చేసింది. విజయం సాధించేందుకు 22 పరుగులు చేయాల్సిన ఒమన్ జట్టు నసీమ్ (2) వికెట్ కోల్పోయి 10 పరుగులే చేయడంతో నమీబియా ‘సూపర్’ విక్టరీ నమోదు చేసింది.
బ్రిడ్జ్‌టౌన్: లాంఛనమైన (ఆఖరి ఓవర్ 6 బంతుల్లో 5 పరుగులు) విజయానికి దూరమైన నమీబియా ‘సూపర్ ఓవర్’తో చేజారిన విజయాన్ని చేజిక్కించుకుంది. ఒమన్ పేసర్ మెహ్రాన్ (3–1–7–3) అసాధారణ బౌలింగ్‌ను... డేవిడ్ వీస్ ‘షో’ సూపర్ ఓవర్లో మాయం చేసింది. ‘సూపర్ ఓవర్’లో 13 పరుగులు చేసిన వీస్ వెంటనే బౌలింగ్‌కు దిగి వికెట్ కూడా తీసి 10 పరుగులిచ్చాడు.
20 జట్లు బరిలో ఉన్న ఈ టి20 ప్రపంచకప్‌లో ‘బోర్’ మ్యాచ్‌లే బోలెడనుకున్న క్రికెట్ ప్రేక్షకులు, విశ్లేషకుల అంచనాల్ని గ్రూప్ ‘బి’లోని ఈ మ్యాచ్ తారుమారు చేసింది. ఔరా అనిపించేలా ఈ కూనల తక్కువ స్కోర్ల మ్యాచ్ వరల్డ్‌కప్‌కే వన్నె తెచ్చింది. సూపర్ ఓవర్లో నమీబియా గెలిచినా... మ్యాచ్ చూసిన ప్రతి మదిని ఒమన్ పోరాటం తాకింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన ఒమన్ జట్టు 19.4 ఓవర్లలో 109 పరుగులకే ఆలౌటైంది.
ఖాలిద్ కైల్ (39 బంతుల్లో 34; 1 ఫోర్, 1 సిక్స్), జీషాన్ (20 బంతుల్లో 22; 4 ఫోర్లు) మెరుగ్గా ఆడారు. నమీబియా బౌలర్లలో రూబెన్ ట్రంపుల్‌మన్ (4/21), వీస్ (3/28), కెపె్టన్ గెరార్డ్ ఎరాస్మస్ (2/20) అదరగొట్టారు. తర్వాత నమీబియా కూడా నిరీ్ణత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 109 పరుగులే చేయడంతో సూపర్ ఓవర్ అనివార్యమైంది. జాన్ ఫ్రయ్‌లింక్‌తో పాటు నికోలస్ డేవిన్ (31 బంతుల్లో 24; 2 ఫోర్లు, 1 సిక్స్) చెప్పుకోదగ్గ స్కోరు చేశాడు.
3: టి20 ప్రపంచకప్ చరిత్రలో ‘సూపర్ ఓవర్’లో ఫలితం తేలిన మ్యాచ్‌లు. శ్రీలంక ఆతిథ్యమిచ్చిన 2012 ప్రపంచకప్‌లో సెప్టెంబర్ 27న న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక జట్టు.. అక్టోబర్ 1న న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో వెస్టిండీస్ జట్టు ‘సూపర్ ఓవర్’లో విజయం సాధించాయి.
Comments
Please login to add a commentAdd a comment