
టీ20 వరల్డ్‌కప్-2024లో భాగంగా బార్బడోస్ వేదికగా ఒమన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో నమీబియా బౌలర్లు చెలరేగారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ దిగిన ఒమన్.. నమీబియా బౌలర్ల దాటికి 19.4 ఓవర్లలో కేవలం 109 పరుగులకే కుప్పకూలింది.
నమీబియా పేసర్ రూబెన్ ట్రంపెల్మాన్ 4 వికెట్లతో ఒమన్ పతనాన్ని శాసించగా.. ఆల్‌రౌండర్ డేవిస్ వీస్ 3, కెప్టెన్ గెర్హార్డ్ ఎరాస్మస్ రెండు, స్కోల్జ్ ఒక్క వికెట్ సాధించారు. ఒమన్ బ్యాటర్లలో ఖలీద్ కైల్(34) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. కెప్టెన్ మక్సూద్(22) పరుగులతో రాణించాడు.
మిగితా బ్యాటర్లందరూ దారుణంగా విఫలమయ్యారు. మరి 110 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఒమన్ బౌలర్లు కాపాడుకుంటారో లేదో వేచి చూడాలి.