చెలరేగిన డేవిడ్‌ వీస్‌, మార్కస్‌ స్టోయినిస్‌ | Abu Dhabi T10 League: Deccan Gladiators Best Team Abu Dhabi By 6 Runs | Sakshi
Sakshi News home page

చెలరేగిన డేవిడ్‌ వీస్‌, మార్కస్‌ స్టోయినిస్‌

Published Sun, Nov 24 2024 11:18 AM | Last Updated on Sun, Nov 24 2024 11:52 AM

Abu Dhabi T10 League: Deccan Gladiators Best Team Abu Dhabi By 6 Runs

అబుదాబీ టీ10 లీగ్‌లో భాగంగా టీమ్‌ అబుదాబీతో జరిగిన మ్యాచ్‌లో డెక్కన్‌ గ్లాడియేటర్స్‌ ఆటగాళ్లు డేవిడ్‌ వీస్‌, మార్కస్‌ స్టోయినిస్‌ చెలరేగిపోయారు. ఈ మ్యాచ్‌లో వీస్‌ 12 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో అజేయమైన 42 పరుగులు చేయగా.. స్టోయినిస్‌ 16 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 42 పరుగులు చేశాడు. ఫలితంగా తొలుత బ్యాటింగ్‌ చేసిన డెక్కన్‌ గ్లాడియేటర్స్‌ నిర్ణీత 10 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 134 పరుగులు చేసింది. 

గ్లాడియేటర్స్‌ ఇన్నింగ్స్‌లో కొహ్లెర్‌ కాడ్‌మోర్‌ 11, రిలీ రొస్సో 18, నికోలస్‌ పూరన్‌ 0, జోస్‌ బట్లర్‌ 3, ఆర్యన్‌ లక్రా 11 (నాటౌట్‌) పరుగులు చేశారు. టీమ్‌ అబుదాబీ బౌలర్లలో నూర్‌ అహ్మద్‌ రెండు వికెట్లు పడగొట్టగా.. ఆడమ్‌ మిల్నే, మార్క్‌ అదైర్‌, రుమ్మన్‌ రయీస్‌ తలో వికెట్‌ దక్కించుకున్నారు.

అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన టీమ్‌ అబుదాబీ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 128 పరుగులు చేయగలిగింది. తద్వారా 6 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఫిలిప్‌ సాల్ట్‌ (9 బంతుల్లో 24; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), జానీ బెయిర్‌స్టో (20 బంతుల్లో 47; 5 ఫోర్లు, 3 సిక్సర్లు), కడీమ్‌ అలెన్‌ (12 బంతుల్లో 24 నాటౌట్‌; 3 సిక్సర్లు) టీమ్‌ అబుదాబీని గెలిపించేందుకు విఫలయత్నం చేశారు. 

టీమ్‌ అబుదాబీ ఇన్నింగ్స్‌లో పాల్‌ స్టిర్లింగ్‌ 8, కైల్‌ మేయర్స్‌ 9, లారీ ఎవాన్స్‌ 9, మార్క్‌ అదైర్‌ 2 పరుగులు చేసి ఔటయ్యారు. గ్లాడియేటర్స్‌ బౌలర్లలో రిచర్డ్‌ గ్లీసన్‌ మూడు వికెట్లు పడగొట్టగా.. మహీశ్‌ తీక్షణ 2, ఇబ్రార్‌ అహ్మద్‌ ఓ వికెట్‌ దక్కించుకున్నారు.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement