
అలాంటి వారివల్ల ఫిక్సింగ్‌ను ఆపలేం
డబ్బు ఇస్తే ఏ పనైనా చేసేవారు క్రికెట్‌లోనూ ఉంటారని, అలాంటి వారి వల్ల ఫిక్సింగ్‌ను ఆపడం కష్టమవుతుందని దక్షిణాఫ్రికా స్టార్ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ అన్నాడు. అరుుతే ఇప్పటివరకూ ఎవరూ మ్యాచ్ ఫిక్సింగ్ కోసం తనను సంప్రదించలేదని, అలాంటి సంఘటన ఎదురైతే వెంటనే వారిని అధికారులకు అప్పగిస్తానని చెప్పాడు. ఓ క్రికెటర్‌తో ఆడిన తర్వాత అతను ఫిక్సర్ అని తేలితే అలాంటి వారిని తలచుకోవడానికే తనకు అసహ్యంగా ఉంటుందని డివిలియర్స్ అన్నాడు.