నేడు విశాఖలో ట్రాఫిక్ ఆంక్షలు | traffic restrictions in visakha due to match at YS. Rajasekhara Reddy stadium | Sakshi
Sakshi News home page

నేడు విశాఖలో ట్రాఫిక్ ఆంక్షలు

Published Sun, May 8 2016 11:00 AM | Last Updated on Sat, Jul 7 2018 2:56 PM

traffic restrictions in visakha due to match at YS. Rajasekhara Reddy stadium

విశాఖ: నేడు ఇండియన్ ప్రీమియర్ లీగ్ మ్యాచ్ సందర్భంగా విశాఖలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈ నెల 8, 10, 13, 15, 17, 21 తేదీలలో పీఎంపాలెం, డాక్టర్ వై.యస్.రాజశేఖరరెడ్డి ఏసీఏ-వీడీసీఏ క్రికెట్ స్టేడియంలో జరిగే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2016 క్రికెట్ మ్యాచ్‌లకు నగర పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. స్థానిక వైఎస్ఆర్ స్టేడియం వద్ద భారీ పోలీస్ భద్రతను ఏర్పాటుచేశారు.

ఎండాడ జంక్షన్ వరకు వాహనాల రాకపోకలకు అనుమతి ఉంటుందని నగర క్రైం డీసీపీ టీ.రవికుమార్‌మూర్తి, నగర ట్రాఫిక్ ఏడీసీపీ కే. మహేంద్రపాత్రుడు వెల్లడించారు. వైఎస్ఆర్ స్డేడియం వేదికగా సాయంత్రం 4 గంటలకు ముంబై ఇండియన్స్ తో సన్ రైజర్స్ హైదరాబాద్ తలపడనుంది.  ఐదు రద్దీ నియంత్రణ బృందాలు, భద్రతా బృందాలను కొమ్మాదిలో ఒకటి, ఎండాడలో ఒకటి ఏర్పాటు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement