గట్టి నిఘా నడుమ ఐపీఎల్
► సుమారు వెయ్యిమంది పోలీసులతో పహారా
► స్టేడియం చుట్టూ 42 సీసీ కెమెరాలు ఏర్పాటు
అల్లిపురం : ఈ నెల 8, 10, 13, 15, 17, 21 తేదీలలో పీఎంపాలెం, డాక్టర్ వై.యస్.రాజశేఖరరెడ్డి ఏసీఏ-వీడీసీఏ క్రికెట్ స్టేడియంలో జరిగే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2016 క్రికెట్ మ్యాచ్‌లకు నగర పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు నగర పోలీస్ కమిషనరేట్‌లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నగర క్రైం డీసీపీ టీ.రవికుమార్‌మూర్తి, నగర ట్రాఫిక్ ఏడీసీపీ కే. మహేంద్రపాత్రుడు వివరాలు వెల్లడించారు. వివరాలు ఇలా ఉన్నాయి.
ఐపీఎల్ మ్యాచ్‌లు సక్రమంగా జరగడానికి నలుగురు ఏడీసీపీలు, 12 మంది ఏసీపీలు, 40 మంది సీఐలు, 62 మంది ఎస్‌ఐలు, 99 మంది ఏఎస్‌ఐలు, హెడ్ కానిస్టేబుల్స్, 378 మంది కానిస్టేబుల్స్, 44 మంది మహిళా కానిస్టేబుల్స్, 39 మంది హోంగార్డులతో పాటు 11 ప్లటూన్ల ఆర్మ్‌డ్ ఫోర్సును వినియోగిస్తున్నారు.
► స్టేడియం చుట్టూ 42 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. స్టేడియం వద్ద రెండు కమాండ్ కంట్రోల్ రూంలు ఏర్పాటు చేశారు.
► 27,500 మంది ప్రేక్షకులు మ్యాచ్‌ను చూసేలా స్టేడియం సామర్ధ్యం ఉంది.
► స్టేడియంలోకి ప్రవేశానికి 20 గేట్లు వినియోగిస్తున్నారు. ఒక్కో గేటు వద్ద ఒక సీఐ పర్వవేక్షిస్తుంటారు. ఐదు సెక్టార్లకు ఒక ఏసీపీ ఇన్‌ఛార్జ్‌గా వ్యవహరిస్తారు.
► బందోబస్తుకు సంబంధించి ‘ఏ’ నుంచి ‘ఓ’ స్టాండులను 15 విభాగాలుగా విభజించా రు. ప్రతి స్టాండుకు ఒక సీఐ, ఎస్‌ఐ బాధ్యత వహిస్తారు. వీటిని 3 సెక్టార్లుగా విభజించి ఒక్కో సెక్టారుకు ఒక ఏసీపీ పర్యవేక్షిస్తారు.
► స్టేడియంలో 30 కార్పొరేట్ బాక్సులు మ్యాచ్ అఫీసియల్ ప్లేయర్స్ లాంజెస్, 1250 సీటింగ్ ఏర్పాట్లను సౌత్‌బ్లాక్‌లో ఏర్పాటు చేశారు. ► వీరికి ఒక ఏసీపీ, ఆరుగురు సీఐలు, సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశారు.
► స్టేడియం లోపలకు ప్రవేశించే వారిని మెటల్ డిటెక్టర్లతో తనిఖీ చేస్తారు.
► 150 మంది ఏసీఏ సిబ్బంది స్టేడియంలో క్రికెట్ టికెట్ చెకింగ్స్ నిర్వహిస్తారు.
► ఐదు రద్దీ నియంత్రణ బృందాలు, భద్రతా బృందాలను కొమ్మాదిలో ఒకటి, ఎండాడలో ఒకటి ఏర్పాటు చేశారు.