విరాట్ కోహ్లిపై రూ. 12 లక్షల జరిమానా | RCB captain Virat Kohli fined Rs 12 lakh for slow over rate against Pune | Sakshi
Sakshi News home page

విరాట్ కోహ్లిపై రూ. 12 లక్షల జరిమానా

Published Sun, Apr 24 2016 12:41 AM | Last Updated on Sun, Sep 3 2017 10:35 PM

విరాట్ కోహ్లిపై రూ. 12 లక్షల జరిమానా

విరాట్ కోహ్లిపై రూ. 12 లక్షల జరిమానా

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లిపై ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) నిర్వాహకులు రూ. 12 లక్షలు జరిమానా విధించారు. రైజింగ్ పుణే సూపర్ జెయింట్స్‌తో శుక్రవారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా బెంగళూరు బౌలర్లు నిర్ణీత సమయంలో పూర్తి కోటా ఓవర్లు పూర్తి చేయనందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు.

రెండోసారి ఇలా జరిగితే కోహ్లిపై రూ. 24 లక్షలు జరిమానా విధిస్తారు. మూడోసారి ఇదే తప్పిదాన్ని పునరావృతం చేస్తే అతనిపై ఒక మ్యాచ్ నిషేధం విధించే అవకాశముంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement