హర్షా భోగ్లే
ఐపీఎల్ సగభాగం పూర్తవగా రైజింగ్ పుణే సూపర్ జెయింట్స్, ముంబై ఇండియన్స్ మధ్య నేటి (ఆదివారం) మ్యాచ్ హోరాహోరీగా సాగుతుందని కొందరు జోస్యం చెబుతున్నారు. ఇది నిజమూ కావచ్చు.. లేదా కాకుండా పోవచ్చు. అయితే ఇలాంటి చర్చ అంతటా జరుగుతూనే ఉంటుంది. ఇక మరో మ్యాచ్‌లో గుజరాత్‌తో... ఓడితే దాదాపు ఇంటికి బయలుదేరే పంజాబ్ కింగ్స్ ఎలెవన్ ఆడబోతోంది. నిజానికి పుణే జట్టు ఎంత భారీ స్కోరు చేసినా కూడా తమ విజయంపై నమ్మకం పెట్టుకోలేకపోతోంది. ఎందుకంటే ఆ స్కోరును కాపాడుకునేందుకు వారి దగ్గర అంత నాణ్యమైన బౌలింగ్ సామర్థ్యం కనిపించడం లేదు.
పుణే ప్రధాన బౌలర్ ఆర్.అశ్విన్ కూడా ఇబ్బంది పడుతున్నాడు. అంతేకాకుండా ప్రారంభంలో... చివర్లో ప్రత్యర్థి ఆటగాళ్లను బెంబేలెత్తించే ఫాస్ట్ బౌలర్ల కొరత కూడా ఉంది. ప్రస్తుతానికైతే ముంబై ఇండియన్స్ పటిష్ట బౌలింగ్ విభాగం కలిగిన జట్టుగా పేరు తెచ్చుకుంది. అందుకే ఆరు మ్యాచ్‌ల్లో వారు నాలుగు గెలవగలిగారు. ఇక బ్యాటింగ్ లో వారికి మాంచి కండ పుష్టి కలిగిన ఆటగాళ్లున్నారు.
పుణే స్టేడియంలో ఈ విషయం మరోసారి నిరూపితమవ్వచ్చు. ఇరు జట్లలో స్టార్ ఆటగాళ్లకు కొదవ లేకపోవడంతో అభిమానులకు కనువిందు ఖాయం. మరోవైపు రాజ్‌కోట్‌లో మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టు పరాజయాలతో కుదేలైన పంజాబ్ కింగ్స్.. పవర్‌ఫుల్ లయన్స్‌ను ఎదుర్కొంటోంది. ఈ మ్యాచ్ కనుక వారు ఓడితే క్వాలిఫయర్‌కు వెళ్లడం కష్టమే!
బౌలింగ్‌తోనే ముంబై విజయాలు
Published Sun, May 1 2016 1:49 AM | Last Updated on Sun, Sep 3 2017 11:07 PM
Advertisement
Advertisement