Harsh bhogle
-
ఇది విరాట్ సీజన్
హర్షా భోగ్లే ఐపీఎల్ -9 సీజన్ ముగింపు దశకు చేరింది. అయితే ఇప్పటికే ఈ సీజన్‌పై విరాట్ కోహ్లి తనదైన ముద్ర వేశాడు. మున్ముందు తొమ్మిదో సీజన్ అంటే అది కోహ్లీదేనని అంతా గుర్తుంచుకుంటారు. గతంలో క్రిస్ గేల్, మైక్ హస్సీ అత్యధికంగా ఓ సీజన్లో 733 పరుగులతో అగ్రస్థానంలో నిలిచారు. దీన్ని ఎవరైనా అధిగమిస్తారా? అని భావించినా కోహ్లి ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు. ఏకంగా తను వెయ్యి పరుగులకు దరిదాపులో ఉన్నాడు. దీన్ని బట్టి ఈ సీజన్లో అతడి ప్రభావం ఏమిటో అర్థం చేసుకోవచ్చు. పరుగులు మాత్రమే కాకుండా నిష్ర్కమణ స్థితి నుంచి జట్టును ఫైనల్‌దాకా తీసుకొచ్చిన ఘనత కూడా తనదే. అలాగే ఆ జట్టును మనమంతా అభిమానించేలా చేశాడు. మరోవైపు ఇదే తరహాలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను తుది పోరుకు చేర్చించింది ఆ జట్టు కెప్టెన్ డేవిడ్ వార్నర్. స్టార్లతో ఉన్న జట్టు ఓ వైపు.. మ్యాచ్ విన్నర్‌తో ఉన్న జట్టు మరోవైపు నేటి ఫైనల్లో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నాయి. నపోలి తరఫున మారడోనా అద్వితీయ ప్రదర్శనతో జట్టుకు లా లిగా టైటిల్‌ను అందించినట్టు చిన్నతనంలో విన్నాం. ఇప్పుడు సన్ కప్ గెలిస్తే వార్నర్ గురించి కూడా అలాగే చెప్పుకోవాలి. బెంగళూరు బౌలర్లలో వాట్సన్, చాహల్ వికెట్ల వేటలో దూసుకెళుతున్నారు. క్రిస్ జోర్డాన్, శ్రీనాథ్ అరవింద్ కూడా కీలకంగా ఉన్నారు. అయితే నెహ్రా, ముస్తఫిజుర్ గాయాల కారణంగా హైదరాబాద్ ఆందోళనగా ఉంది. అయితే వారి స్థానాలను భర్తీ చేసిన బెన్ కట్టింగ్, బౌల్ట్ ఫర్వాలేదనిపిస్తున్నారు. ఆర్సీబీకి కెప్టెన్ కోహ్లి ఒక్కడే కాకుండా గేల్, డి విలియర్స్, వాట్సన్, రాహుల్ రూపంలో మంచి బ్యాటింగ్ లైనప్ ఉంది. అందుకే ఈ జట్టును ఫేవరెట్‌గా పరిగణిస్తున్నారు. ధావన్, యువరాజ్, హెన్రిక్స్‌లతో పోల్చుకుంటే వారే మెరుగ్గా ఉన్నారు. వీరందరి విన్యాసాలను వీక్షించాలంటే ఐపీఎల్-9 ఫైనల్ పోరును అంతా ఆసక్తికరంగా చూడాల్సిందే. అద్భుత టోర్నమెంట్‌కు చక్కటి ముగింపు లభించాలని ఆశిద్దాం. -
కేకేఆర్ సమతూకంతో ఉంది
హర్షా భోగ్లే ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఆడబోతున్న రెండు జట్లు ఇప్పుడు పూర్తి విభిన్న ఆలోచనాధోరణిని కనబరచాల్సి ఉంది. ఆరంభం నుంచే సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇతర జట్లకు ప్రమాదకరంగా మారింది. అయితే ఇటీవలి మ్యాచ్‌ల్లో ఈ జట్టుకు అపజయాలే ఎదురయ్యాయి. సన్రైజర్స్కున్న అతి పెద్ద బలం వారి బౌలింగే. నలుగురు సీమర్లు ఎవరికి వారు జట్టు ప్రయోజనాలకు తగ్గట్టుగా ప్రదర్శన చేస్తూ ప్రత్యర్థిని కట్టడి చేస్తున్నారు. కానీ పేసర్ ఆశిష్ నెహ్రా గైర్హాజరు జట్టును ఆందోళనలో పడేసింది. ఇక బ్యాట్స్‌మెన్ నుంచి మరిన్ని పరుగులు రావాల్సి ఉంది. శిఖర్ ధావన్ ఫామ్‌లో ఉండటం జట్టుకు లాభమే. ఎందుకంటే ఈ జట్టు ఇప్పటికీ డేవిడ్ వార్నర్‌పైనే అధికంగా ఆధారపడి ఉంది. కేన్ విలియమ్సన్ లేక ఇయాన్ మోర్గాన్ నుంచి భారీ ఇన్నింగ్స్ ఆశించినా ప్రయోజనం లేకపోయింది. యువరాజ్లో నిలకడ కరువైనా అప్పుడప్పుడు మెరుపులు మెరిపిస్తున్నాడు. అయితే తనదైన రోజు ప్రత్యర్థిని వణికించే సత్తా ఉంది. దాదాపు లీగ్ దశ ముగిసే వరకు సన్‌రైజర్స్ టేబుల్ టాపర్‌గా ఉన్న విషయం గుర్తుంచుకోవాలి. వార్నర్, ముస్తఫిజుర్ లాంటి మ్యాచ్ విన్నర్లు ఇందులో ఉన్నారు. ఇక అన్ని జట్లకన్నా సమతూకంతో ఉన్న జట్టు కోల్‌కతా నైట్ రైడర్స్. ఆల్‌రౌండర్ ఆండ్రీ రస్సెల్ గాయం కారణంగా దూరమవడం.. షకీబ్ అల్ హసన్ అంతగా ఫామ్ కనబరచకపోవడం ఈ జట్టును ఇబ్బందిపెట్టే అంశం. అయితే యూసుఫ్ పఠాన్ అనూహ్యంగా జట్టుకు ఆపద్భాందవుడి పాత్ర పోషిస్తున్నాడు. మనీష్ పాండేతో పాటు రాబిన్ ఉతప్ప ఈ ఎలిమినేటర్ మ్యాచ్‌లో కీలకంగా నిలిస్తే చూడాలని ఉంది. మరోవైపు స్పిన్నర్లలో పీయూష్ చావ్లా, కుల్దీప్ యాదవ్‌లలో ఎవరిని తీసుకోవాలో తేల్చుకోవాల్సి ఉంది. ప్రస్తుత ఫామ్‌ను పరిగణనలోకి తీసుకుంటే కేకేఆర్‌కు కాస్త ఎక్కువ అవకాశాలు ఉన్నట్టు అనిపిస్తోంది. -
ముంబైకి చావోరేవో...
హర్షా భోగ్లే బెంగళూరు చేతిలో ఎదురైన దారుణ పరాజయం నుంచి గుజరాత్ లయన్స్ త్వరగానే కోలుకుంది. నిజానికి 20 ఓవర్ల మ్యాచ్‌లో వారు 144 పరుగుల తేడాతో ఓ టెస్టు మ్యాచ్‌లాంటి ఓటమిని పొందారు. ఈ పరాభవం వారిని చాలా రోజులు వెంటాడేదే. అయినా సరైన సమయంలో తిరిగి పట్టాలెక్కారు. పాయింట్ల పట్టికలో ఇంకా అనిశ్చితి కొనసాగుతూనే ఉంది. లయన్స్‌కు 16 పాయింట్లున్నా ప్లే ఆఫ్‌కు అధికారికంగా వెళ్లని పరిస్థితి. అయితే మరోసారి అద్భుత ప్రదర్శనతో ముంబై ఇండియన్స్‌పై గెలిచి నిశ్చింతగా ఉండాలనుకుంటోంది. అనుకోకుండా డ్వేన్ స్మిత్ బౌలింగ్ జట్టుకు వరంగా మారింది. నేటి మ్యాచ్‌లోనూ తను అదే ప్రదర్శన కనబరచాలని జట్టు ఆశిస్తే తప్పు లేదు. కానీ బ్యాటింగ్‌లోనూ అతడు కొన్ని ఓవర్లు క్రీజులో నిలిస్తే జట్టుపై ఒత్తిడి తగ్గుతుంది. అటు ఫించ్ కూడా ప్రమాదకరంగానే కనిపిస్తున్నాడు. అంతకన్నా ముఖ్యం కెప్టెన్ సురేశ్ రైనా కీలక మ్యాచ్‌లో ఫామ్‌లోకి రావడం. ఐపీఎల్ అత్యుత్తమ ఆటగాళ్లలో తనూ ఒకడు. ఈ స్టార్ ఆటగాడి గత రికార్డును పరిశీలిస్తే కోల్‌కతాపై అతడు ఆడిన ఆట ఆశ్చర్యంగా అనిపించదు. మ్యాచ్ విన్నర్‌గా ఎన్నోసార్లు నిరూపించుకున్నాడు. ముంబైపై కూడా ఇదే ఫామ్‌ను చూపిస్తే లయన్స్ అభిమానులకు అంతకన్నా కావాల్సిన ఆనందం ఉండదు. మరోవైపు వీరి ప్రత్యర్థి ముంబైది చావో రేవో పరిస్థితి. అయితే ఇలాంటి పరిస్థితి గతంలోనూ ఈ జట్టు ఎదుర్కొని అధిగమించింది. ఢిల్లీ డేర్‌డెవిల్స్‌పై ఘనవిజయం తర్వాత ఆరు రోజుల విశ్రాంతి జట్టుకు లభించింది. అయితే అలాంటి ప్రదర్శన అనంతరం వెంటనే మరో మ్యాచ్‌కు సిద్ధం కావాలని కోరుకోవాలి. కానీ ముంబై ఇతర జట్ల ఆటను చూడాల్సి వచ్చింది. లయన్స్‌తో మ్యాచ్‌లో కృనాల్ పాండ్య కీలకం కావచ్చు. ఎందుకంటే రైనా ఇద్దరు ఎడమచేతి స్పిన్నర్లతో బరిలోకి దిగే అవకాశం ఉంది. పాండ్య కూడా ఎడమచేతి బ్యాట్స్‌మనే. ఏది ఏమైనా గెలిస్తేనే ప్లే ఆఫ్ ఆశలు ఉంటాయనే విషయం తెలుసు కాబట్టి ముంబై వీరోచిత ప్రదర్శన చేయాల్సిందే. -
టాప్-2పైనే సన్‌రైజర్స్ దృష్టి
హర్షా భోగ్లే ఐపీఎల్లో కొన్ని అంచనాలు తలకిందులైనా ఇప్పుడు టోర్నీ పోటాపోటీ స్థితికి చేరింది. రేసులో ఉన్న జట్లకు ఇప్పుడు ప్రతీ మ్యాచ్ కీలకంగానే మారింది. గతంలో రాజస్తాన్ రాయల్స్ (ఆర్ఆర్)లాగే తాజాగా డిల్లీ డేర్‌డెవిల్స్ ప్లే ఆఫ్ కోసం తమ శాయశక్తులా పోరాడేందుకు సిద్ధమవుతోంది. ఎందుకంటే వారికి రాహుల్ ద్రవిడ్ రూపంలో రాయల్స్ డీఎన్ఏ జట్టులో ఉంది. ఆటగాళ్లను ఎక్కువగా రొటేట్ చేస్తున్నా బ్రాత్‌వైట్‌ను ఎక్కువగా వాడుకోకపోవడం ఆశ్చర్యం కలిగించింది. మరోవైపు సన్‌రైజర్స్ హైదరాబాద్ పట్టికలో ఉత్తమ స్థానంపై కన్నేసింది. నేటి మ్యాచ్‌లో వీరు గెలిస్తే టాప్-2లో కచ్చితంగా స్థానం దక్కుతుంది. ఫామ్‌లో ఉన్న ధావన్ మరోసారి మెరిస్తే జట్టుకు ప్రయోజనమే. పేసర్ ముస్తఫిజుర్ ప్రదర్శనపై నాకు ఆసక్తిగా ఉంది. గత రెండు మ్యాచ్‌ల్లో అతడి బంతులను బ్యాట్స్‌మెన్ సులువుగానే ఎదుర్కొని పరుగులు చేశారు. ఇప్పుడు తను ప్రతీకారం ఎలా తీర్చుకుంటాడో చూడాలి. -
ముంబై జాగ్రత్త పడాలి
హర్షా భోగ్లే తమకు సుపరిచితమైన వేదికపై ముంబై ఇండియన్స్ మరో మ్యాచ్‌కు సిద్ధమవుతోంది. ఈ జట్టుకు మిగిలిన మూడు మ్యాచ్‌ల్లో రెండు మ్యాచ్‌లను గెలవాల్సిన పరిస్థితి ఉంది. క్వాలిఫికేషన్ అర్హత అవకాశాలు పూర్తిగా అడుగంటిపోయిన పంజాబ్ కింగ్స్ ఎలెవన్‌తో నేడు ముంబై తలపడనుంది. ఇప్పటిదాకా ఫలితాల్లో ఒడిదుడుకులు ఎదురైనా తమ లైనప్ విషయంలో ముంబై నిలకడగానే ఉంది. క్లిష్టమైన పరిస్థితుల్లో బౌలింగ్ వేయాల్సిన స్థితిలో ముగ్గురు పేసర్లు ఒకరికొకరు బాగా సహకరించుకుంటున్నారు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుపై తమ బౌలర్ల ప్రతిభతో ముంబై నెగ్గగలిగింది. బెంగళూరు విధించిన లక్ష్యం కూడా ఏమంత ప్రమాదకరంగా లేదు. పంజాబ్ కింగ్స్ ఎలెవన్‌పై వారు విజయం తప్ప మరోటి ఊహించలేరు. జట్ల పాయింట్లు టై అయితే ప్లేఆఫ్ బెర్త్‌కు నెట్న్‌ర్రేట్ కీలకమవుతుంది. ఈ విషయంలో ముంబై ఇండియన్స్ దారుణంగా ఉంది. అలాంటి పరిస్థితి రాకూడదనే ముంబై ఆశిస్తోంది. మరోవైపు ప్రస్తుత తమ పరిస్థితిని పంజా బ్ జట్టు ఎలా ఎదుర్కొంటుందనేది కీల కం. ఇక ఏ పరిస్థితిలోనూ క్వాలిఫై కాము అని తెలిసినా ఇంకా నాలుగు మ్యాచ్‌లు ఆడాల్సి రావడం వారికి ఇబ్బందే. తమకు పోయేదేం లేదనే దృక్పథంతో పంజాబ్ ఆడితే ముంబై జాగ్రత్తపడాల్సిందే. -
విలియమ్సన్తో పరిస్థితి మారింది
హర్షా భోగ్లే కొన్నిసార్లు టోర్నీ మధ్యలో జరిగే మ్యాచ్‌లు ఎలాంటి ప్రాముఖ్యత లేకుండా జరిగిపోతుంటాయి. కొంత ఇబ్బందిగా ఉన్నా ఆయా జట్లకు ఇంకా అవకాశాలు మిగిలి ఉండడమే దీనికి కారణం. అయితే కొన్నిసార్లు మాత్రం ఈ సమయంలో జరిగే మ్యాచ్‌లు పటిష్టంగా కనిపించే జట్ల అవకాశాలను తారుమారు చేసే విధంగా మారతాయి. బెంగళూరు జట్టుపై కోల్‌కతా నైట్‌రైడర్స్ విజయం ఇలాంటి తరహాలోనిదే. ఇక గుజరాత్ లయన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్‌ల మ్యాచ్ కూడా ఇలాగే జరుగుతుందని నమ్ముతున్నాను. గత వారం దాకా లయన్స్ జట్టు పేరుకు తగ్గట్టుగా ప్రత్యర్థులకు సింహస్వప్నంగా కనిపించింది. తాము ఎన్ని పరుగులు సాధించినా ఆ జట్టు ఛేదిస్తుందనే భయాన్ని ఇతర జట్లకు కలిగించింది. త్వరగా ప్రారంభ వికెట్లను తీసి ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెట్టేది. అయితే ఇప్పుడు ఆ జట్టు వరుసగా రెండు మ్యాచ్‌లను కోల్పోయింది. మరో మ్యాచ్‌లో కూడా ఓడితే మిగిలిన నాలుగు మ్యాచ్‌ల్లో రెండింటిని కచ్చితంగా నెగ్గాల్సి రావచ్చు. అందుకే ఈ మ్యాచ్‌లో విజయం వారికి తప్పనిసరి. మరోవైపు హైదరాబాద్ జట్టు జోరందుకుంది. తమ చివరి ఐదు మ్యాచ్‌ల్లో నాలుగు గెలిచి దూసుకెళుతోంది. ఇంతకాలం వారి బ్యాటింగ్ అంతా కెప్టెన్ డేవిడ్ వార్నర్ మీదే ఆధారపడింది. అయితే తాజాగా కేన్ విలియమ్సన్ రాకతో ఈ పరిస్థితి మారింది. రెండేళ్ల క్రితం యార్క్‌షైర్ తరఫున ఆడడానికి వెళ్లిన కేన్ మరింతగా రాటుదేలాడు. తను కచ్చితంగా జట్టుకు ఉపయోగపడతాడనడంలో సందేహం లేదు. అయితే ఈ జట్టుకు మరో నాణ్యమైన బ్యాట్స్‌మన్ కొరత ఉంది. భువనేశ్వర్, ముస్తాఫిజుర్, నెహ్రా, శరణ్, హెన్రిక్స్‌తో బౌలింగ్ పటిష్టంగానే ఉంది. ఆల్‌రౌండర్‌గా హెన్రిక్స్ బ్యాట్ నుంచి భారీ ఇన్నింగ్స్ రావాల్సి ఉంది. ఏది ఏమైనా లయన్స్‌పై గెలుపు జట్టు ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచుతుంది. ఒకవేళ రైనా బృందం విజయం సాధిస్తే ప్లేఆఫ్‌కు వెళుతుంది. -
బౌలింగ్‌తోనే ముంబై విజయాలు
హర్షా భోగ్లే ఐపీఎల్ సగభాగం పూర్తవగా రైజింగ్ పుణే సూపర్ జెయింట్స్, ముంబై ఇండియన్స్ మధ్య నేటి (ఆదివారం) మ్యాచ్ హోరాహోరీగా సాగుతుందని కొందరు జోస్యం చెబుతున్నారు. ఇది నిజమూ కావచ్చు.. లేదా కాకుండా పోవచ్చు. అయితే ఇలాంటి చర్చ అంతటా జరుగుతూనే ఉంటుంది. ఇక మరో మ్యాచ్‌లో గుజరాత్‌తో... ఓడితే దాదాపు ఇంటికి బయలుదేరే పంజాబ్ కింగ్స్ ఎలెవన్ ఆడబోతోంది. నిజానికి పుణే జట్టు ఎంత భారీ స్కోరు చేసినా కూడా తమ విజయంపై నమ్మకం పెట్టుకోలేకపోతోంది. ఎందుకంటే ఆ స్కోరును కాపాడుకునేందుకు వారి దగ్గర అంత నాణ్యమైన బౌలింగ్ సామర్థ్యం కనిపించడం లేదు. పుణే ప్రధాన బౌలర్ ఆర్.అశ్విన్ కూడా ఇబ్బంది పడుతున్నాడు. అంతేకాకుండా ప్రారంభంలో... చివర్లో ప్రత్యర్థి ఆటగాళ్లను బెంబేలెత్తించే ఫాస్ట్ బౌలర్ల కొరత కూడా ఉంది. ప్రస్తుతానికైతే ముంబై ఇండియన్స్ పటిష్ట బౌలింగ్ విభాగం కలిగిన జట్టుగా పేరు తెచ్చుకుంది. అందుకే ఆరు మ్యాచ్‌ల్లో వారు నాలుగు గెలవగలిగారు. ఇక బ్యాటింగ్ లో వారికి మాంచి కండ పుష్టి కలిగిన ఆటగాళ్లున్నారు. పుణే స్టేడియంలో ఈ విషయం మరోసారి నిరూపితమవ్వచ్చు. ఇరు జట్లలో స్టార్ ఆటగాళ్లకు కొదవ లేకపోవడంతో అభిమానులకు కనువిందు ఖాయం. మరోవైపు రాజ్‌కోట్‌లో మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టు పరాజయాలతో కుదేలైన పంజాబ్ కింగ్స్.. పవర్ఫుల్ లయన్స్‌ను ఎదుర్కొంటోంది. ఈ మ్యాచ్ కనుక వారు ఓడితే క్వాలిఫయర్‌కు వెళ్లడం కష్టమే!