హర్షా భోగ్లే
ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఆడబోతున్న రెండు జట్లు ఇప్పుడు పూర్తి విభిన్న ఆలోచనాధోరణిని కనబరచాల్సి ఉంది. ఆరంభం నుంచే సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇతర జట్లకు ప్రమాదకరంగా మారింది. అయితే ఇటీవలి మ్యాచ్‌ల్లో ఈ జట్టుకు అపజయాలే ఎదురయ్యాయి. సన్‌రైజర్స్‌కున్న అతి పెద్ద బలం వారి బౌలింగే. నలుగురు సీమర్లు ఎవరికి వారు జట్టు ప్రయోజనాలకు తగ్గట్టుగా ప్రదర్శన చేస్తూ ప్రత్యర్థిని కట్టడి చేస్తున్నారు. కానీ పేసర్ ఆశిష్ నెహ్రా గైర్హాజరు జట్టును ఆందోళనలో పడేసింది.
ఇక బ్యాట్స్‌మెన్ నుంచి మరిన్ని పరుగులు రావాల్సి ఉంది. శిఖర్ ధావన్ ఫామ్‌లో ఉండటం జట్టుకు లాభమే. ఎందుకంటే ఈ జట్టు ఇప్పటికీ డేవిడ్ వార్నర్‌పైనే అధికంగా ఆధారపడి ఉంది. కేన్ విలియమ్సన్ లేక ఇయాన్ మోర్గాన్ నుంచి భారీ ఇన్నింగ్స్ ఆశించినా ప్రయోజనం లేకపోయింది. యువరాజ్‌లో నిలకడ కరువైనా అప్పుడప్పుడు మెరుపులు మెరిపిస్తున్నాడు. అయితే తనదైన రోజు ప్రత్యర్థిని వణికించే సత్తా ఉంది. దాదాపు లీగ్ దశ ముగిసే వరకు సన్‌రైజర్స్ టేబుల్ టాపర్‌గా ఉన్న విషయం గుర్తుంచుకోవాలి.
వార్నర్, ముస్తఫిజుర్ లాంటి మ్యాచ్ విన్నర్లు ఇందులో ఉన్నారు. ఇక అన్ని జట్లకన్నా సమతూకంతో ఉన్న జట్టు కోల్‌కతా నైట్ రైడర్స్. ఆల్‌రౌండర్ ఆండ్రీ రస్సెల్ గాయం కారణంగా దూరమవడం.. షకీబ్ అల్ హసన్ అంతగా ఫామ్ కనబరచకపోవడం ఈ జట్టును ఇబ్బందిపెట్టే అంశం. అయితే యూసుఫ్ పఠాన్ అనూహ్యంగా జట్టుకు ఆపద్భాందవుడి పాత్ర పోషిస్తున్నాడు. మనీష్ పాండేతో పాటు రాబిన్ ఉతప్ప ఈ ఎలిమినేటర్ మ్యాచ్‌లో కీలకంగా నిలిస్తే చూడాలని ఉంది. మరోవైపు స్పిన్నర్లలో పీయూష్ చావ్లా, కుల్దీప్ యాదవ్‌లలో ఎవరిని తీసుకోవాలో తేల్చుకోవాల్సి ఉంది. ప్రస్తుత ఫామ్‌ను పరిగణనలోకి తీసుకుంటే కేకేఆర్‌కు కాస్త ఎక్కువ అవకాశాలు ఉన్నట్టు అనిపిస్తోంది.
కేకేఆర్ సమతూకంతో ఉంది
Published Wed, May 25 2016 12:54 AM | Last Updated on Mon, Sep 4 2017 12:50 AM
Advertisement