IPL 2023: Delhi Capitals Vs KKR Match Live Updates-Highlights - Sakshi
Sakshi News home page

IPL 2023 DC Vs KKR: సీజన్‌లో తొలి విజయం నమోదు చేసిన ఢిల్లీ క్యాపిటల్స్‌

Published Thu, Apr 20 2023 7:12 PM | Last Updated on Fri, Apr 21 2023 7:50 AM

IPL 2023: Delhi Capitals Vs KKR Match Live Updates-Highlights - Sakshi

ఐపీఎల్‌ 16వ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ తొలి విజయాన్ని నమోదు చేసింది. కేకేఆర్‌తో ‍ జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ నాలుగు వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. 128 పరుగుల టార్గెట్‌ను 19.2 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి చేధించింది. డేవిడ్‌ వార్నర్‌ 57 పరుగులతో టాప్‌ స్కోరర్‌ కాగా.. మనీష్‌ పాండే 21 పరుగులు చేశాడు. ఆఖర్లో అక్షర్‌ పటేల్‌ 18 పరుగులు నాటౌట్‌గా నిలిచి జట్టును గెలిపించాడు. కేకేఆర్‌ బౌలర్లలో వరుణ్‌ చక్రవర్తి, అంకుల్‌ రాయ్‌, నితీశ్‌ రానాలు తలా రెండు వికెట్లు తీశారు.

విజయం దిశగా ఢిల్లీ క్యాపిటల్స్‌
కేకేఆర్‌తో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ విజయం దిశగా పయనిస్తోంది. 15 ఓవర్లు ముగిసేసరికి నాలుగు వికెట్ల నష్టానికి 104 పరుగులు చేసింది. మనీష్‌ పాండే 19, అక్షర్‌ పటేల్‌ ఐదు పరుగులతో ఆడుతున్నారు. ఢిల్లీ విజయానికి 30 బంతుల్లో 24 పరుగులు కావాలి.

7 ఓవర్లలో ఢిల్లీ క్యాపిటల్స్‌ 62/1
ఏడు ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ క్యాపిటల్స్‌ వికెట్‌ నష్టానికి 62 పరుగులు చేసింది. వార్నర్‌ 25 బంతుల్లో 45 పరుగులతో ధాటిగా ఆడుతుండగా.. మిచెల్‌ మార్ష్‌ 2 పరుగులతో సహకరిస్తున్నాడు.

పృథ్వీ షా ఔట్‌.. తొలి వికెట్‌ కోల్పోయిన ఢిల్లీ
పృథ్వీ షా(13) రూపంలో ఢిల్లీ క్యాపిటల్స్‌ తొలి వికెట్‌ కోల్పోయింది. వరుణ్‌ చక్రవర్తి బౌలింగ్‌లో పృథ్వీ క్లీన్‌బౌల్డ్‌గా వెనుదిరిగాడు. ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్‌ వికెట్‌ నష్టానికి 44 పరుగులు చేసింది.

ధాటిగా ఆడుతున్న వార్నర్‌.. 3 ఓవర్లలో ఢిల్లీ క్యాపిటల్స్‌ 31/0
128 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌ మూడు ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా 31 పరుగులు చేసింది. వార్నర్‌ 23, పృథ్వీ షా ఏడు పరుగులతో క్రీజులో ఉన్నారు.

కేకేఆర్‌ 127 ఆలౌట్‌..
ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో కేకేఆర్‌ 127 పరుగులకు ఆలౌట్‌ అయింది. కేకేఆర్‌ బ్యాటర్లలో జేసన్‌ రాయ్‌ 43 పరుగులతో టాప్‌ స్కోరర్‌ కాగా.. చివర్లో రసెల్‌ 31 బంతుల్లో 4 సిక్సర్లు, ఒక ఫోర్‌ సాయంతో 38 పరుగులు చేయడంతో కేకేఆర్‌ 120 పరుగుల మార్క్‌ను అందుకోగలిగింది. ఢిల్లీ క్యాపిటల్స్‌ బౌలర్లలో ఇషాంత్‌ శర్మ, నోర్ట్జే, అక్షర్‌ పటేల్‌, కుల్దీప్‌ యాదవ్‌లు తలా రెండు వికెట్లు తీశారు.

ఆలౌట్‌ దిశగా కేకేఆర్‌..
ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో కేకేఆర్‌ దారుణ ఆటతీరు కనబరుస్తోంది. 96 పరుగులకే తొమ్మిది వికెట్లు కోల్పోయింది. రసెల్‌ 13 పరుగులతో ఆడుతున్నాడు.

14 ఓవర్లు ముగిసేసరికి కేకేఆర్‌ ఆరు వికెట్ల నష్టానికి 92 పరుగులు చేసింది. జేసన్‌ రాయ్‌ 43, రస్సెల్‌ 12 పరుగులతో ఆడుతున్నారు.

10 ఓవర్లలో కేకేఆర్‌ స్కోరెంతంటే?
10 ఓవర్లు ముగిసేసరికి కేకేఆర్‌ నాలుగు వికెట్ల నష్టానికి 64 పరుగులు చేసింది.  జేసన్‌ రాయ్‌ 34, రింకూ సింగ్‌ ఆరు పరుగులతో క్రీజులో ఉ‍న్నారు.

35కే మూడు వికెట్లు కోల్పోయిన కేకేఆర్‌ర
35 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన కేకేఆర్‌ కష్టాల్లో పడింది. జేసన్‌ రాయ్‌ 22, మణిదీప్‌ సింగ్‌ రెండు పరుగులతో ఆడుతున్నారు.

వెంకటేశ్‌ అయ్యర్‌ డకౌట్‌.. రెండో వికెట్‌ కోల్పోయిన కేకేఆర్‌
ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో వెంకటేశ్‌ అయ్యర్‌ డకౌట్‌గా వెనుదిరిగాడు. నోర్ట్జే బౌలింగ్‌లో షాట్‌కు యత్నించిన అయ్యర్‌ స్లిప్‌లో మార్ష్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం కేకేఆర్‌ రెండు వికెట్ల నష్టానికి 29 పరుగులు చేసింది

తొలి వికెట్‌ కోల్పోయిన కేకేఆర్‌
ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో కేకేఆర్‌ తొలి వికెట్‌ కోల్పోయింది. 4 పరుగులు చేసిన లిటన్‌ దాస్‌ ముఖేశ్‌ కుమార్‌ బౌలింగ్‌లో లిలిత్‌ యాదవ్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం కేకేఆర్‌ వికెట్‌ నష్టానికి 15 పరుగులు చేసింది.

టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న ఢిల్లీ క్యాపిటల్స్‌
ఐపీఎల్‌ 16వ సీజన్‌లో గురువారం 28వ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌, కేకేఆర్‌ తలపడుతున్నాయి. టాస్‌ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్‌ ఫీల్డింగ్‌ ఎంచుకుంది.సీజన్‌లో ఆడిన ఐదు మ్యాచ్‌ల్లోనూ పరాజయం పాలైన ఢిల్లీ  ఇంతవరకు బోణీ చేయలేకపోయింది. మరోవైపు కేకేఆర్‌ మాత్రం  పడుతూ లేస్తూ తమ ప్రయాణాన్ని కొనసాగిస్తుంది.

కోల్‌కతా నైట్ రైడర్స్ (ప్లేయింగ్ XI): జేసన్ రాయ్, లిట్టన్ దాస్(వికెట్‌ కీపర్‌), వెంకటేష్ అయ్యర్, నితీష్ రాణా(కెప్టెన్‌), మన్‌దీప్ సింగ్, ఆండ్రీ రస్సెల్, రింకూ సింగ్, సునీల్ నరైన్, కుల్వంత్ ఖేజ్రోలియా, ఉమేష్ యాదవ్, వరుణ్ చకరవర్తి

ఢిల్లీ క్యాపిటల్స్ (ప్లేయింగ్ XI): డేవిడ్ వార్నర్ (కెప్టెన్‌), ఫిలిప్ సాల్ట్ (వికెట్‌ కీపర్‌), మిచెల్ మార్ష్, మనీష్ పాండే, అక్షర్ పటేల్, అమన్ హకీమ్ ఖాన్, లలిత్ యాదవ్, కుల్దీప్ యాదవ్, అన్రిచ్ నార్ట్జే, ఇషాంత్ శర్మ, ముఖేష్ కుమార్

కేకేఆర్‌ బ్యాటర్లలో వెంకటేశ్‌ అయ్యర్‌, నితీష్‌ రానా, రింకూ సింగ్‌ మినహా మిగతావారెవరు రాణించడం లేదు. అటు ఢిల్లీ క్యాపిటల్స్‌లో వార్నర్‌, అక్షర్‌పటేల్‌ మినహా ఎవరు చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్‌లు ఆడడం లేదు. సొంత గ్రౌండ్‌లో ఆడుతున్న ఢిల్లీ క్యాపిటల్స్‌ కనీసం ఈ మ్యాచ్‌లోనైనా గెలిచి తొలి విజయాన్ని నమోదు చేస్తుందేమో చూడాలి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement