ఐపీఎల్-2021లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్‌నే విజయం వరించింది. సన్‌రైజర్స్ కడవరకూ పోరాడినా ఓటమి పాలైంది. కేకేఆర్ నిర్దేశించిన 188 పరుగుల టార్గెట్ ఛేదనలో ఆరెంజ్ ఆర్మీ చివరి అంచుల వరకూ వచ్చి చతికిలబడింది. బెయిర్‌స్టో(55; 40 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) మనీష్ పాండే(61 నాటౌట్)లు రాణించినా జట్టును గెలిపించలేకపోయారు. డేవిడ్ వార్నర్(3) ఆదిలోనే నిష‍్రమించగా, ఆపై సాహా(7) కూడా నిరాశపరిచాడు. ఆ దశలో బెయిర్ స్టో-మనీష్ పాండేలు ఇన్నింగ్స్ చక్కదిద్దారు. ఈ జోడి 92 పరుల భాగస్వామ్యాన్ని నమోదు చేసి స్కోరును గాడిలో పెట్టింది. కాగా, బెయిర్ స్టో ఔటైన తర్వాత మనీష్ పాండేపై భారం పడింది. పాండే అజేయంగా నిలిచినా పరాజయం తప్పలేదు. సన్‌రైజర్స్ 177 పరుగులకే పరిమితమై 10 పరుగుల తేడాతో ఓటమి చెందింది.
► మొహమ్మద్ నబీ ఔట్.. స్కోర్: 131/4
సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు నాలుగో వికెట్ కోల్పోయింది. 131 పరుగుల వద్ద మొహమ్మద్ నబీ 11 బంతుల్లో 14 పరగులు చేసి ప్రసిద్ధ్ క్రిష్ణ బౌలింగ్‌లో ఔటయ్యాడు.
► బెయిర్ స్టో అవుట్.. మూడో వికెట్ కోల్పోయిన ఎస్‌ఆర్‌హెచ్
హాఫ్ సెంచరీ సాధించిన కాసేపటికే 55 పరుగులు చేసిన బెయిర్ స్టో కమిన్స్ బౌలింగ్‌లో నితీష్ రానాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో ఎస్‌ఆర్‌హెచ్ 102 పరుగులు వద్ద మూడో వికెట్ కోల్పోయింది.
► బెయిర్ స్టో హాఫ్ సెంచరీ..
భారీ లక్ష్యంతో బరిలోకి దిగి 10 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన దశలో క్రీజులోకి వచ్చిన బెయిర్ స్టో ధనాదన్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకుంటున్నాడు. సిక్స్‌తో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న బెయిర్ స్టో 32 బంతుల్లో అర్థశతకం మార్క్‌ను అందుకున్నాడు. ప్రస్తుతం ఎస్‌ఆర్‌హెచ్ 12 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 100 పరుగులు చేసింది. బెయిర్ స్టో 55, మనీష్ పాండే 34 పరుగులతో క్రీజులో ఉన్నారు.
► రెండో వికెట్ డౌన్..
భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఎస్‌ఆర్‌హెచ్ రెండు వికెట్లు కోల్పోయింది. మొదట వార్నర్ అవుట్ కాగా.. ఇన్నింగ్స్ 3వ ఓవర్ తొలి బంతికే 7 పరుగులు చేసిన సాహా షకీబ్ ఆల్ హసన్ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్‌గా వెనుదిరిగాడు. అయితే ఆ తర్వాత వచ్చిన బెయిర్ స్టో, మనీష్ పాండేలు మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతున్నారు. ప్రస్తుత ఎస్‌ఆర్‌హెచ్ 8 ఓవర్లలో 60 పరుగులు చేసింది.
► తొలి వికెట్ డౌన్.. వార్నర్ అవుట్
188 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఎస్‌ఆర్‌హెచ్ తొలి వికెట్ కోల్పోయింది. 3 పరుగులు చేసిన వార్నర్ ప్రసిధ్ కృష్ణ బౌలింగ్‌లో కీపర్ కార్తీక్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరగాడు. ప్రస్తుతం సాహా 7, మనీష్ పాండే క్రీజులో ఉన్నారు.
► కార్తీక్ మెరుపులు.. కేకేఆర్ 187/6
దినేష్ కార్తీక్ (22; 9 బంతులు, 2 ఫోర్లు, ఒక సిక్సర్)తో ఆఖర్లో మెరుపులు మెరిపించడంతో కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. అంతకముందు కేకేఆర్ ఓపెనర్ నితీష్ రానా 80 పరుగులతో రాణించగా.. వన్‌డౌన్‌లో వచ్చిన రాహుల్ త్రిపాఠి కూడా హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. కాగా ఎస్‌ఆర్‌హెచ్ బౌలర్లలో రషీద్, నబీలు చెరో రెండు వికెట్లు తీయగా.. భువనేశ్వర్, నటరాజన్‌లు తలా ఒక వికెట్ తీశారు.
► వెనువెంటనే వికెట్లు..
కేకేఆర్ వెనువెంటనే రెండు వికెట్లు కోల్పోయింది. మహ్మద్ నబీ వేసిన ఇన్నింగ్స్ 18వ ఓవర్ మూడో బంతికి నితీష్ రానా(80) అవుట్ కాగా.. మరుసటి బంతికే రెండు పరుగులు చేసిన మోర్గాన్ క్యాచ్ అవుట్‌గా వెనుదిరిగాడు. దీంతో కేకేఆర్ 162 పరుగుల వద్ద ఐదు వికెట్లు కోల్పోయింది.
►రస్సెల్ అవుట్.. మూడో వికెట్ డౌన్
రషీద్ ఖాన్ వేసిన ఇన్నింగ్స్ 17వ ఓవర్ రెండో బంతికి ఆండ్రీ రస్సెల్(5) మనీష్ పాండేకు క్యాచ్ ఇచ్చి వెనుదిరగడంతో కేకేఆర్ మూడో వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం కేకేఆర్ 17 ఓవర్లలో 159 పరుగులు చేసింది. అంతకముందు హాఫ్ సెంచరీ చేసిన కాసేపటికే రాహుల్ త్రిపాఠి నటరాజన్ బౌలింగ్‌లో సాహాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో కేకేఆర్ 146 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది.
► త్రిపాఠి 28 బంతుల్లోనే అర్థ శతకం
రాహుల్ త్రిపాఠి మెరుపు హాఫ్ సెంచరీ సాధించాడు. 28 బంతుల్లోనే అర్థ శతకం సాధించాడు. ఇందులో ఐదు ఫోర్లు, 2 సిక్స్‌లు ఉన్నాయి. గిల్ ఔటైన తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన త్రిపాఠి విజృంభించి ఆడుతున్నాడు. అన్నివైపులకు షాట్లు ఆడుతూ సన్‌రైజర్స్‌కు పరీక్షగా నిలుస్తున్నాడు. 15 ఓవర్లు ముగిసే సరికి కేకేఆర్ వికెట్ నష్టానికి 145 పరుగులు చేసింది. రానా(77) క్రీజ్‌లో ఉన్నాడు.
► 14 ఓవర్లలో కేకేఆర్ 126/1
కేకేఆర్ వికెట్లను కాపాడుకుంటూనే దూకుడుగా బ్యాటింగ్ చేస్తోంది. 14 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 126 పరుగులు చేసింది. రానా 72 పరుగులతో , రాహుల్ త్రిపాఠి 39 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. ఇప్పటివరకూ గిల్ వికెట్‌ను మాత్రమే సన్‌రైజర్స్ సాధించింది. రషీద్ ఖాన్ బౌలింగ్‌లో గిల్(15) బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వా త క్రీజ్‌లోకి వచ్చిన త్రిపాఠి బ్యాట్ ఝుళిపిస్తున్నాడు. చివరి ఐదు ఓవర్లలో కేకేఆర్ వికెట్ నష్టపోకుండా 57 పరుగులు చేసింది.
► సిక్స్‌తో హాఫ్ సెంచరీ చేసిన నితీష్ రానా
కేకేఆర్ ఓపెనర్ నితీష్ రానా హాఫ్ సెంచరీ సాధించాడు. సిక్స్ సాయంతో హాఫ్ సెంచరీ సాధించడం విశేషం. విజయ్ శంకర్ వేసిన 10 ఓవర్ చివరి బంతిని భారీ షాట్‌గా మలిచి అర్థ శతకం నమోదు చేశాడు. 37 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్స్ హాఫ్ సెంచరీ మార్కును చేరాడు రానా. పది ఓవర్ల ముగిసేసరికి కేకేఆర్ వికెట్ నష్టానికి 83 పరుగులు చేసింది. అతనికి జతగా రాహుల్ త్రిపాఠి క్రీజ్‌లో ఉన్నాడు.
► చెపాక్ వేదికగా ఎస్‌ఆర్‌హెచ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కేకేఆర్ తొలి వికెట్ కోల్పోయింది. రషీద్ వేసిన ఇన్నింగ్స్ 7వ ఓవర్ చివరి బంతికి గిల్(15 పరుగులు) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో కేకేఆర్ 53 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. అంతకముందు కేకేఆర్ తన ఇన్నింగ్స్‌ను దూకుడుగా ఆరంభించింది. ఓపెనర్లుగా వచ్చిన రాణా, శుబ్‌మన్ గిల్‌లు ఎస్‌ఆర్‌హెచ్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ 6 ఓవర్లలో 50 పరుగులు జత చేశారు. ముఖ్యంగా రాణా 37 పరుగులుతో దూకుడు కనబరిచాడు.
చెన్నై: ఐపీఎల్ 2021 సీజన్‌లో భాగంగా మూడో మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఢీకొట్టబోతోంది. చెన్నై వేదికగా జరగనున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన సన్‌రైజర్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది. యూఏఈ వేదికగా జరిగిన ఐపీఎల్ 2020 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లే ఆఫ్‌కు అర్హత సాధించగా.. కేకేఆర్ మాత్రం ఐదో స్థానంతో సరిపెట్టుకుంది. ఆల్‌రౌండర్లతో కేకేఆర్ బలంగా కనిపిస్తుండగా.. సన్‌రైజర్స్ మాత్రం బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో కాస్త పటిష్టంగా ఉంది.
ఇరు జట్ల ముఖాముఖి పోరు చూసుకుంటే ఎస్‌ఆర్‌హెచ్‌పై కేకేఆర్ ఆధిపత్యం కనబరిచింది. ఇప్పటి వరకూ ఈ రెండు జట్లు 19 మ్యాచ్‌ల్లో తలపడగా.. కోల్‌కతా 12 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా... ఏడు మ్యాచ్‌ల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ గెలుపొందింది. ఐపీఎల్‌లో కోల్‌కతాపై ఎస్‌ఆర్‌హెచ్‌పై చేసిన అత్యధిక స్కోరు 209 పరుగులు.. అత్యల్ప స్కోరు 128గా ఉంది. మరోవైపు హైదరాబాద్‌పై కేకేఆర్ సాధించిన అత్యధిక స్కోరు 183 పరుగులు ఉండగా.. అత్యల్ప స్కోరు 101గా ఉంది . గతేడాది సీజన్‌లో రెండింటి మధ్య జరిగిన లీగ్ మ్యాచ్‌లో కేకేఆర్‌నే విజయం వరించింది.
ఇరు జట్ల బలబలాల విషయానికి వస్తే.. ఎస్‌ఆర్‌హెచ్ నుంచి వార్నర్, బెయిర్ స్టో, విలియమ్సన్ లాంటి బ్యాట్స్‌మన్ ఉండడం సానుకూలాంశం.. వీరికి అదనంగా జేసన్ రాయ్ కలవడం బ్యాటింగ్ విభాగాన్ని మరింత పటిష్టం చేసింది. ఇక బౌలింగ్‌లో భువీతో పాటు నటరాజన్, రషీద్ ఖాన్‌లాంటి నాణ్యమైన బౌలర్లు ఉండడం ఆ జట్టుకు అదనపు బలం. ఇక కేకేఆర్ చూసుకుంటే.. ఓపెనర్ శుభమన్ గిల్ మంచి టచ్‌లో కనిపిస్తుండగా.. కెప్టెన్ ఇయాన్ మోర్గాన్, నితీశ్ రాణా, దినేశ్ కార్తీక్, రాహుల్ త్రిపాఠి, ఆండ్రీ రసెల్‌తో ఆ జట్టు బ్యాటింగ్ ఆర్డర్ బలంగా ఉంది. షకీబ్ అల్ హసన్ లాంటి నాణ్యమైన ఆల్‌రౌండర్ ఉండడం కేకేఆర్‌కు మంచి అవకాశం అని చెప్పొచ్చు. ఇక బౌలింగ్ విభాగాన్ని పాట్ కమిన్స్ నడిపించనుండగా, శివమ్ మావి, ప్రసిధ్ కృష్ణ, స్పిన్ విభాగంలో వరుణ్ చక్రవర్తి, షకీబ్ అల్ హసన్, హర్భజన్ సింగ్, కుల్దీప్ యాదవ్‌లతో మెరుగ్గా కనిపిస్తుంది.
తుది జట్టు:
ఎస్‌ఆర్‌హెచ్: డేవిడ్ వార్నర్ (కెప్టెన్), వృద్దిమాన్ సాహా (వికెట్ కీపర్), మనీష్ పాండే, విజయ్ శంకర్, మహ్మద్ నబీ, జానీ బెయిర్ స్టో, అబ్దుల్ సమద్, రషీద్ ఖాన్, భువనేశ్వర్ కుమార్, సందీప్ శర్మ, టి నటరాజన్
కేకేఆర్: ఇయాన్ మోర్గాన్ (కెప్టెన్), శుబ్‌మన్ గిల్, రాహుల్ త్రిపాఠి, నితీష్ రానా, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), ఆండ్రీ రస్సెల్, షకీబ్ అల్ హసన్, పాట్ కమ్మిన్స్, హర్భజన్ సింగ్, ప్రసిద్ కృష్ణ, వరుణ్ చక్రవర్తి
Comments
Please login to add a commentAdd a comment