'విలియమ్సన్‌ రాకతో మా బలం పెరిగింది'‌ | IPL 2021: Davdi Warner Says Kane Williamson Arrival Gave Strength To SRH | Sakshi
Sakshi News home page

విలియమ్సన్‌ రాకతో మా బలం పెరిగింది: వార్నర్‌

Published Wed, Apr 21 2021 8:15 PM | Last Updated on Wed, Apr 21 2021 9:07 PM

IPL 2021: Davdi Warner Says Kane Williamson Arrival Gave Strength To SRH - Sakshi

Courtesy : IPL.Com

చెన్నై: ఐపీఎల్‌ 14వ సీజన్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ హ్యాట్రిక్‌ ఓటముల తర్వాత ఎట్టకేలకు తొలి విజయాన్ని నమోదు చేసింది. పంజాబ్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 121 పరుగులు లక్ష్యాన్ని ఒక వికెట్‌ మాత్రమే కోల్పోయి చేధించింది. బెయిర్‌ స్టో (63* పరుగులు) కడవరకు నిలిచి జట్టును గెలిపించగా.. విలియమ్సన్‌ 16 పరుగులతో అతనికి సహకరించాడు. అంతకముందు టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్‌ సన్‌రైజర్స్‌ బౌలర్ల దాటికి 19.1 ఓవర్లలో 120 పరుగులకు ఆలౌటైంది.మయాంక్‌ అగర్వాల్‌ 22, షారుఖ్‌ ఖాన్‌ 22 మినహా మిగతావారు విఫలమయ్యారు. ఎస్‌ఆర్‌హెచ్‌ బౌలర్లలో ఖలీల్‌ అహ్మద్‌ 3, అభిషేక్‌ శర్మ 2, రషీద్‌ ఖాన్‌, భువీ, కౌల్‌లు తలా ఒక వికెట్‌ తీశారు. 

కాగా మ్యాచ్‌ విజయం అనంతరం పోస్ట్‌ మ్యాచ్‌ ప్రెజంటేషన్‌ సందర్భంగా ఎస్‌ఆర్‌హెచ్‌ కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌ మాట్లాడాడు.'' ఈరోజు విజయం మా ఒత్తిడిని తగ్గించింది. మ్యాచ్‌ విజయంలో మా బౌలర్ల పాత్ర మరువలేనిది. నిజంగా వారి అద్భత బౌలింగ్‌తో పంజాబ్‌ను తక్కువ స్కోరుకు కట్టడి చేసినప్పుడే మ్యాచ్‌ మా చేతుల్లోకి వచ్చేసింది.  3 వికెట్లతో రాణించిన అభిషేక్‌ శర్మ బౌలింగ్‌ నాకు బాగా నచ్చింది. ఇక బ్యాటింగ్‌లో నేను కడదాకా ఉంటే బాగుండు అనిపించింది. ఇక విలియమ్సన్‌ తుది జట్టుతో చేరడంతో మా బలం పెరిగింది. అతని రాక..మాకు విజయంతో పాటు ఆత్మవిశ్వాసం పెరిగింది. నేను ఔటైన తర్వాత బెయిర్‌ స్టోకు అండగా నిలిచిన కేన్‌ యాంకర్‌ పాత్రను సమర్థంగా పోషించాడు. ఈ విజయం మాకు కొత్త ఊపిరినిచ్చింది. రానున్న మ్యాచ్‌ల్లో ఇలానే కంటిన్యూ చేయడానికి ప్రయత్నిస్తాం'' అంటూ చెప్పుకొచ్చాడు. 


Photo Courtesy : IPL.Com

పంజాబ్‌ కింగ్స్‌ కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ మాట్లాడుతూ.. '' చెన్నైలో మాకు ఇది మొదటి మ్యాచ్‌.. పిచ్‌ పరిస్థితి మాకు కొత్త  కావడంతో ఇలా ఆడుతామని ఊహించలేదు. కానీ మేము చేసిన స్కోరుకు అదనంగా మరో 10-15 పరుగులు జతచేసి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేది. ఎస్‌ఆర్‌హెచ్‌ గెలుపుకు వారి బౌలింగ్‌ ఒక కారణం కావొచ్చు.. ఎందుకంటే వాళ్లు ఇప్పటికే మూడు మ్యాచ్‌లు ఆడడంతో పిచ్‌పై అవగాహన వచ్చేసింది. ఇక మా బ్యాటింగ్‌ ఈరోజు అనుకున్నంత బాలేదు. చేసింది తక్కువ స్కోరైనా మా బౌలర్ల ప్రదర్శన తక్కువ చేయలేము. అయితే వరుసగా మూడు మ్యాచ్‌లు పరాజయం చెందడం తో ఒత్తిడి పెరిగినా.. రానున్న మ్యాచ్‌లపై దాని ప్రభావం లేకుండా చూసుకుంటాం'' అని చెప్పుకొచ్చాడు. పంజాబ్‌పై విజయంతో ఎస్‌ఆర్‌హెచ్‌ రన్‌రేట్‌ మెరుగుపర్చుకొని పాయింట్ల పట్టికలో 5వ స్థానానికి చేరుకోగా.. వరుసగా మూడో పరాజయంతో పంజాబ్‌ కింగ్స్‌ ఆఖరిస్థానంలో నిలిచింది.
చదవండి: ఐపీఎల్‌ 2021: ఎస్‌ఆర్‌హెచ్‌ ఖాతాలో తొలి విజయం

రైనా, కోహ్లిని దాటాడు.. గేల్‌ను దాటలేకపోయాడు

వార్నర్‌ నువ్వు సూపర్‌.. క్యా రనౌట్‌ హై‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement