Courtesy : IPL/BCCI
చెన్నై: ఐపీఎల్ 14వ సీజన్‌లో పంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ సూపర్ ఫీల్డింగ్‌తో మెరిశాడు. వార్నర్ దెబ్బకు పంజాబ్ ఆటగాడు నికోలస్ పూరన్ గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు. ఇన్నింగ్స్ 7వ ఓవర్‌ను ఖలీల్ వేయగా.. ఆఖరిబంతిని గేల్ కవర్స్ దిశగా షాట్ ఆడాడు. పరుగు కోసం గేల్ కాల్ ఇవ్వడంతో పూరన్ ఏం ఆలోచించకుండా క్రీజు దాటి ముందుకొచ్చాడు. అయితే గేల్ అప్పటికే సగం క్రీజు దాటేయడంతో పూరన్ పరిగెత్తాల్సి వచ్చింది.
దీంతో కవర్స్‌లో ఉన్న వార్నర్ అప్పటికే బంతిని అందుకొని మెరుపువేగంతో త్రో విసిరాడు. అది నేరుగా వికెట్లను గిరాటేసింది. అయితే కీపర్ బెయిర్ స్టో ప్యాడ్లు వికెట్లకు ఏమైనా తగిలాయేమోనన్న అనుమానంతో ఫీల్ఢ్ అంపైర్ థర్డ్ అంపైర్‌కు రిఫర్ చేశాడు. రిప్లేలో పూరన్ రనౌట్ అని క్లియర్‌గా తేలడంతో అతను డైమండ్ డక్‌గా వెనుదిరిగాల్సి వచ్చింది. కాగా ఒక బ్యాట్స్‌మన్ ఒక్క బంతి కూడా ఎదుర్కోకుండా ఔట్ అయితే దానిని డైమండ్ డక్ అని పిలుస్తారు. వార్నర్ చేసిన రనౌట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఆడుతున్న పంజాబ్ కింగ్స్ ప్రస్తుతం పంజాబ్ 12 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 66 పరుగులు చేసింది. హెన్రిక్స్ 9, షారుఖ్ ఖాన్ 1 పరుగుతో క్రీజులో ఉన్నారు.
చదవండి: 'రోహిత్ నా ఫెవరెట్ ప్లేయర్.. అందుకే ఆ పని చేశా'
'రికార్డుల కోసం నేను ఎదురుచూడను'
— Cricsphere (@Cricsphere) April 21, 2021
Comments
Please login to add a commentAdd a comment