IPL 2021 PBKS Vs SRH: Fans Trolls On Sunrisers CEO Kavya Maran Goes Viral - Sakshi
Sakshi News home page

ఐపీఎల్‌ 2021: ఎట్టకేలకు కావ్య పాప నవ్వింది..

Published Thu, Apr 22 2021 6:22 PM | Last Updated on Thu, Apr 22 2021 8:55 PM

IPL 2021: Fans Trolls SRH CEO Kavya Maran Laughs After SRH Win Viral - Sakshi

Courtesy : IPL Twitter

చెన్నై: కావ్యనిధి మారన్‌.. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ సీఈవో. ఈ సీజన్‌లో ఆర్‌సీబీతో జరిగిన మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్ చేజేతులా ఓటమిని చవిచూసింది. అయితే ఆ మ్యాచ్‌లో‌ ఆటగాళ్లు ఒక్కొక్కరుగా పెవిలియన్‌కు క్యూ కడుతుంటే ఆమె కంటతడి పెట్టారు. దానికి సంబంధించిన ఫోటోలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి.దీనికి తోడూ ఈ సీజన్‌లో తొలి మూడు మ్యాచ్‌ల్లోనూ ఎస్‌ఆర్‌హెచ్‌ ఓటమి చవిచూడడం కావ్య మారన్‌తో పాటు సగటు ఎస్‌ఆర్‌హెచ్‌ అభిమాని సైతం భరించలేకపోయాడు.

అయితే బుధవారం పంజాబ్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మాత్రం ఎస్‌ఆర్‌హెచ్‌ అదరగొట్టే ప్రదర్శనతో తొలి విజయాన్ని అందుకుంది. ఎస్‌ఆర్‌హెచ్‌ ఖాతా తెరవడంతో కావ్య మరోసారి హైలెట్‌ అయ్యారు.  మ్యాచ్‌ సందర్భంలో ఒకచోట కావ్య మారన్‌ నవ్వారు. ఇంకేముంది.. ఈ ఫోటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేయగా.. నెటిజన్లు ట్రోల్స్‌, మీమ్స్‌తో రెచ్చిపోయారు. ''ఎట్టకేలకు కావ్వ పాప నవ్వింది'' అంటూ కామెంట్లు పెడుతూ మీమ్స్‌తో రెచ్చిపోయారు. కాగా తమిళనాడు మీడియా కింగ్‌గా పేరొందిన కళానిధి మారన్ కుమార్తె అయిన కావ్య మారన్.. సన్ నెట్‌వర్క్ ఛానల్స్‌‌లో కొన్నింటికి సీఈవోగా బాధ్యతలు నిర్వర్తిస్తోంది.ఎస్‌ఆర్‌హెచ్‌ మ్యాచ్ ఎక్కడ జరిగినా.. ఆమె స్టేడియంలో ఉండి టీమ్‌ని ఉత్సాహపరుస్తుంటుంది. మరీ ముఖ్యంగా.. కావ్య మారెన్ ఇచ్చే ఎక్స్‌ప్రెషన్స్‌‌కి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

ఇక మ్యాచ్‌లో టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ చేసిన పంజాబ్‌ సన్‌రైజర్స్‌ బౌలర్ల దాటికి నిలువలేక 19.1 ఓవర్లలో 120 పరుగులకు ఆలౌట్‌ అయింది. అనంతరం స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఎస్‌ఆర్‌హెచ్‌ ఇన్నింగ్స్‌లో  వార్నర్‌ 37 పరుగులు చేసి ఔటవ్వగా.. బెయిర్‌ స్టో 63*, విలియమ్సన్‌ 16*.. మరో వికెట్‌ పడకుండా జట్టును గెలిపించారు. కాగా ఎస్‌ఆర్‌హెచ్‌ తన తర్వాతి మ్యాచ్‌ను ఏప్రిల్‌ 25న చెన్నై వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడనుంది.
చదవండి: 'రనౌట్‌ చేశానని నా మీదకు కోపంతో రావుగా'

ఒక్కొక్కరూ క్యూకట్టేస్తుంటే కావ్య మారన్‌ కంటతడి!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement