ఐపీఎల్‌ 2021: ఎస్‌ఆర్‌హెచ్‌ ఖాతాలో తొలి విజయం‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ | IPl 2021: Punjab Kings Vs Sunrisers Hyderabad Match Live Upadates | Sakshi
Sakshi News home page

ఐపీఎల్‌ 2021: ఎస్‌ఆర్‌హెచ్‌ ఖాతాలో తొలి విజయం‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

Published Wed, Apr 21 2021 3:03 PM | Last Updated on Wed, Apr 21 2021 7:07 PM

IPl 2021: Punjab Kings Vs Sunrisers Hyderabad Match Live Upadates - Sakshi

Courtesy: IPL Twitter

ఎస్‌ఆర్‌హెచ్‌ తొలి విజయం
ఐపీఎల్‌ 14వ సీజన్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌ ఎట్టకేలకు తొలి విజయాన్ని నమోదు చేసింది. 121 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఎస్‌ఆర్‌హెచ్‌ 18.4 ఓవర్లలో 1 వికెట్‌ మాత్రమే కోల్పో​యి చేధించింది. ఓపెనర్‌ జానీ బెయిర్‌ స్టో 63 పరుగులతో అజేయంగా నిలిచి జట్టును గెలిపించాడు. వార్నర్‌ 37 పరుగులు చేసి ఔట్‌ కాగా.. వన్‌డౌన్‌లో వచ్చిన కేన్‌ విలియమ్సన్‌ (16 పరుగులు నాటౌట్‌)తో బెయిర్‌ స్టోకు అండగా నిలిచాడు.

అంతకముందు టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన‌ పంజాబ్‌ కింగ్స్‌ ఫేలవ ప్రదర్శన కనబరిచింది. సన్‌రైజర్స్‌ బౌలర్ల దాటికి పూర్తి ఓవర్లు ఆడకుండానే 120 పరుగులకే ఆలౌటైంది. పంజాబ్‌ బ్యాటింగ్‌లో మయాంక్‌ అగర్వాల్‌ 22, షారుఖ్‌ ఖాన్‌ 22 మినహా మిగతావారు దారుణంగా విఫలమయ్యారు. పంజాబ్ బ్యాట్స్‌మన్‌‌ సన్‌రైజర్స్‌ బౌలర్ల దాటికి పరుగులు చేయడానికి ఇబ్బందులు పడ్డారు. వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయి పూర్తి ఓవర్లు ఆడకుండానే ఆలౌటైంది. ఎస్‌ఆర్‌హెచ్‌ బౌలర్లలో ఖలీల్‌ అహ్మద్‌ 3, అభిషేక్‌ శర్మ 2, రషీద్‌ ఖాన్‌, భువీ, కౌల్‌లు తలా ఒక వికెట్‌ తీశారు. 

విజయాని​కి 21 పరుగుల దూరంలో
121 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఎస్‌ఆర్‌హెచ్‌ విజయానికి 21 పరుగుల దూరంలో ఉంది. ప్రస్తుతం 16 ఓవర్లో వికెట్‌ నష్టానికి 100 పరుగులు చేసింది. బెయిర్‌ స్టో 45, విలియమ్సన్‌ 15 పరుగులుతో క్రీజులో ఉన్నారు.

పంజాబ్‌ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌ తొలి వికెట్‌ కోల్పోయింది. 73 పరుగుల వద్ద వార్నర్‌(37) అలెన్‌ బౌలింగ్‌లో మయాంక్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం ఎస్‌ఆర్‌హెచ్‌ 11 ఓవర్లలో వికెట్‌ నష్టానికి 73 పరుగులు చేసింది. ఎస్‌ఆర్‌హెచ్‌ గెలుపుకు ఇంకా 54 బంతుల్లో 48 పరుగులు చేయాల్సి ఉంది.

3 ఓవర్లలో ఎస్‌ఆర్‌హెచ్‌ 27/0
121 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్‌ 3 ఓవర్లు ముగిసే సమయానికి వికెట్‌ నష్టపోకుండా 27 పరుగులు చేసింది. వార్నర్‌ 10, బెయిర్‌ స్టో 16 పరుగులతో క్రీజులో ఉన్నారు. 

పంజాబ్‌ కింగ్స్‌ ఆలౌట్‌
చెపాక్‌ వేదికగా ఎస్‌ఆర్‌హెచ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్‌ కింగ్స్‌ ఫేలవ ప్రదర్శన కనబరిచింది. సన్‌రైజర్స్‌ బౌలర్ల దాటికి పూర్తి ఓవర్లు ఆడకుండానే 120 పరుగులకే ఆలౌటైంది. పంజాబ్‌ బ్యాటింగ్‌లో మయాంక్‌ అగర్వాల్‌ 22, షారుఖ్‌ ఖాన్‌ 22 మినహా మిగతావారు దారుణంగా విఫలమయ్యారు. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఆడిన పంజాబ్‌ సన్‌రైజర్స్‌ బౌలర్ల దాటికి పరుగులు చేయడానికి ఇబ్బందులు పడింది. వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయి పూర్తి ఓవర్లు ఆడకుండానే ఆలౌటైంది. ఎస్‌ఆర్‌హెచ్‌ బౌలర్లలో ఖలీల్‌ అహ్మద్‌ 3, అభిషేక్‌ శర్మ 2, రషీద్‌ ఖాన్‌, భువీ, కౌల్‌లు తలా ఒక వికెట్‌ తీశారు. 

ఏడో వికెట్‌ కోల్పోయిన పంజాబ్‌
చెపాక్‌ వేదికగా ఎస్‌ఆర్‌హెచ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్‌ ఏడో  వికెట్‌ కోల్పోయింది. ఖలీల్‌ అహ్మద్‌ వేసిన ఇన్నింగ్స్‌ 17వ ఓవర్లో 6 పరుగులు చేసిన ఫాబియెన్‌ అలెన్‌ వార్నర్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం పంజాబ్‌ 17 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 102 పరుగులు చేసింది.అంతకముందు 14 పరుగులు చేసిన హెన్రిక్స్‌ అభిషేక్‌ శర్మ బౌలింగ్‌లో కీపర్‌ బెయిర్‌ స్టోకు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరగడంతో పంజాబ్‌ 82 పరుగుల వద్ద ఆరో వికెట్‌ కోల్పోయింది.

సగం వికెట్లు కోల్పోయిన పంజాబ్‌.. 
ఎస్‌ఆర్‌హెచ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఆడుతున్న పంజాబ్‌ కింగ్స్‌ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోతుంది. తాజాగా 63 పరుగుల వద్ద దీపక్‌ హుడా(13) అభిషేక్‌ శర్మ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. దీంతో 63 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి పంజాబ్‌ కష్టాల్లో పడింది.  ప్రస్తుతం పంజాబ్‌ 12 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 66 పరుగులు చేసింది. హెన్రిక్స్‌ 9, షారుఖ్‌ ఖాన్‌ 1 పరుగుతో క్రీజులో ఉన్నారు.

మరో వికెట్‌ కోల్పోయిన పంజాబ్‌
పంజాబ్‌ కింగ్స్‌ మరో వికెట్‌ కోల్పోయింది. ఇన్నింగ్స్‌ 9వ ఓవర్లో రషీద్‌ ఖాన్‌ వేసిన బంతిని ఆడడంలో విఫలమైన గేల్‌(15) ఎల్బీగా వెనుదిరిగాడు. ప్రస్తుతం పంజాబ్‌ కింగ్స్‌ స్కోరు 47/4గా ఉంది.

సూపర్‌ రనౌట్‌.. మూడో వికెట్‌ డౌన్‌
పంజాబ్‌ కింగ్స్‌ వెనువెంటనే రెండు వికెట్లు కోల్పోయింది. విజయ్‌ శంకర్‌ వేసిన ఇన్నింగ్స్‌ 8వ ఓవర్‌ తొలి బంతిని గేల్‌ ఫ్లిక్‌ చేశాడు. అయితే అనవసరపు పరుగుకోసం ప్రయత్నం చేశాడు. కవర్స్‌లో ఉన్న వార్నర్‌ బంతిని మెరుపు వేగంతో త్రో విసిరగా అది నేరుగా వికెట్లను గిరాటేసింది. దీంతో పూరన్‌ డైమండ్‌ డక్‌గా వెనుదిరిగాడు. అంతకముందు మయాంక్‌ అగర్వాల్‌(22) రూపంలో 39 పరుగుల వద్ద రెండో వికెట్‌ కోల్పోయింది. ఖలీల్‌ అహ్మద్‌ వేసిన ఇన్నింగ్స్‌ 7 ఓవర్‌ ఆఖరిబంతిని షాట్‌ ఆడే ప్రయత్నంలో మాయాంక్‌  రషీద్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. ప్రస్తుతం పంజాబ్‌ 8 ఓవర్లో 3 వికెట్ల నష్టానికి 45 పరుగులు చేసింది.

కేఎల్‌ రాహుల్‌ ఔట్‌.. తొలి వికెట్‌ డౌన్‌
ఎస్‌ఆర్‌హెచ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్‌ కింగ్స్‌ తొలి వికెట్‌ కోల్పోయింది. భువనేశ్వర్‌ వేసిన ఇన్నింగ్స్‌ 4వ ఓవర్‌ మొదటి బంతిని రాహుల్‌( 4) షాట్‌ ఆడే ప్రయత్నంలో కేదార్‌ జాదవ్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం పంజాబ్‌ కింగ్స్‌ 4 ఓవర్లలో వికెట్‌ నష్టానికి 19 పరుగులు చేసింది. మయాంక్‌ (13), గేల్‌( 2) పరుగులతో క్రీజులో ఉన్నారు. 

చెన్నై: ఐపీఎల్ 2021 సీజన్‌లో ఇంతవరకు భోణీ కొట్టిన జట్టు ఏదైనా ఉందంటే అది ఎస్‌ఆర్‌హెచ్‌ మాత్రమే. ఈ సీజన్‌లో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ ఓటమి పాలైన సన్‌రైజర్స్‌ నేడు పంజాబ్‌ కింగ్స్‌తో అమీతుమి తేల్చుకోనుంది.  మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన పంజాబ్‌ కింగ్స్‌ బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌ కోసం ఎస్‌ఆర్‌హెచ్‌ మూడు మార్పులు చేసింది ముజీబ్‌, అబ్దుల్‌ సమద్‌, మనీష్‌ పాండేల స్థానంలో కేన్‌ విలియమ్సన్‌, కేదార్‌ జాదవ్‌, సిద్దార్థ్‌ కౌల్‌లు తుది జట్టులోకి వచ్చారు. పంజాబ్‌ కింగ్స్‌ జట్టులో మెరిడిత్‌, జై రిచర్డ్‌సన్‌ స్థానంలో పాబియన్‌ అలెన్‌, మెయిసిస్‌ హెన్రిక్స్‌ తుది జట్టులోకి వచ్చారు.

ఇక ఐపీఎల్‌లో ఇరుజట్లు ముఖాముఖి రికార్డులను ఓసారి పరిశీలిస్తే..? ఇప్పటి వరకూ ఈ రెండు జట్లు 16 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. ఇందులో 11 మ్యాచ్‌ల్లో ఎస్‌ఆర్‌హెచ్‌ విజయం సాధించగా.. మిగిలిన 5 మ్యాచ్‌ల్లో పంజాబ్ కింగ్స్ గెలుపొందింది. కాగా గత సీజన్‌లో రెండు మ్యాచ్‌ల్లో తలపడగా.. ఇరు జట్లు చెరో విజయాన్ని కైవసం చేసుకున్నాయి. పంజాబ్‌ కింగ్స్‌పై ఎస్‌ఆర్‌హెచ్‌ అత్యధిక స్కోరు 231 పరుగులు కాగా...  పేరు మార్చుకున్న పంజాబ్‌ కింగ్స్‌.. ఎస్‌ఆర్‌హెచ్‌పై 232 పరుగులు అత్యధిక స్కోరుగా ఉంది. 

ఇక బలబలాల విషయానికి వస్తే.. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో ఓపెనర్లు జానీ బెయిర్‌స్టో, డేవిడ్ వార్నర్ సూపర్ ఫామ్‌లో ఉన్నారు. అయితే ఈ ఓపెనర్లు ఔట్ తర్వాత టీమ్‌లో నిలకడగా ఆడే బ్యాట్స్‌మెన్ కనిపించడం లేదు. మనీశ్ పాండే, విజయ్ శంకర్, అబ్దుల్ సమద్.. హిట్టింగ్ చేస్తున్నా కీలక సమయంలో వికెట్లు చేజార్చుకుంటున్నారు. ఇక యువ క్రికెటర్లు విరాట్ సింగ్, అభిషేక్ శర్మ కూడా అంచనాల్ని అందుకోవడంలో విఫలమవుతున్నారు.  ఇక బౌలింగ్‌లోనూ ఆ జట్టు అంతంతగానే ఉంది. డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ భువనేశ్వర్ పరుగులు ఇవ్వకున్నా.. వికెట్లు తీయడంలో విఫలమవుతున్నాడు. గత మ్యాచ్‌లో ఖలీల్‌ అహ్మద్‌ తన బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు.  ఇక మిడిల్ ఓవర్లలో రషీద్ ఖాన్.. ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌లను కట్టడి చేస్తుండగా.. విజయ్ శంకర్ ధారళంగా పరుగులిస్తున్నా వికెట్లు తీస్తున్నాడు.

ఇక పంజాబ్ కింగ్స్ జట్టులో ఓపెనర్లు కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్.. ఆ టీమ్‌కి ఊహించని స్కోరుని అందిస్తున్నారు. ఆరంభం నుంచి దూకుడుగా ఆడుతున్న ఈ జంట భారీ స్కోరుకి బాటలు వేస్తోంది. ఆ తర్వాత క్రిస్‌గేల్, దీపక్ హుడా, షారూక్ ఖాన్ హిట్టింగ్‌ చేస్తున్నారు. అయితే.. పవర్ హిట్టర్ నికోలస్ పూరన్ ఫామ్‌లో లేకపోవడం ఆ జట్టుకి ఇబ్బందిగా మారింది. అయితే పంజబ్‌ కింగ్స్‌ను బౌలింగ్ లైనప్ కలవరపెడుతుంది. ఆ జట్టులో నిలకడగా రాణించే బౌలర్ ఒక్కరూ కనిపించడం లేదు. అర్షదీప్ సింగ్ మెరుపులు ఒక మ్యాచ్‌కే పరిమితమవగా.. మహ్మద్ షమీ, రిచర్డ్‌సన్, మెరాడిత్ ధారాళంగా పరుగులిచ్చేస్తున్నారు. 

పంజాబ్‌ కింగ్స్‌: కేఎల్‌ రాహుల్(కెప్టెన్‌)‌, మయాంక్‌ అగర్వాల్‌, క్రిస్‌ గేల్‌, నికోలస్‌ పూరన్‌, దీపక్‌ హూడా, షారుఖ్‌ ఖాన్‌,పాబియన్‌ అలెన్‌, మెయిసిస్‌ హెన్రిక్స్, మురుగన్‌ అశ్విన్‌‌, షమీ, అర్షదీప్‌ సింగ్‌

ఎస్‌ఆర్‌హెచ్‌: డేవిడ్ వార్నర్ (కెప్టెన్‌),  కేన్‌ విలియమ్సన్‌, కేదార్‌ జాదవ్‌, విజయ్ శంకర్, జానీ బెయిర్‌ స్టో, రషీద్ ఖాన్, భువనేశ్వర్ కుమార్,అభిషేక్‌ శర్మ, ఖలీల్‌ అహ్మద్‌, విరాట్‌ సింగ్‌, సిద్దార్థ్‌ కౌల్

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement