హర్షా భోగ్లే
తమకు సుపరిచితమైన వేదికపై ముంబై ఇండియన్స్ మరో మ్యాచ్‌కు సిద్ధమవుతోంది. ఈ జట్టుకు మిగిలిన మూడు మ్యాచ్‌ల్లో రెండు మ్యాచ్‌లను గెలవాల్సిన పరిస్థితి ఉంది. క్వాలిఫికేషన్ అర్హత అవకాశాలు పూర్తిగా అడుగంటిపోయిన పంజాబ్ కింగ్స్ ఎలెవన్‌తో నేడు ముంబై తలపడనుంది. ఇప్పటిదాకా ఫలితాల్లో ఒడిదుడుకులు ఎదురైనా తమ లైనప్ విషయంలో ముంబై నిలకడగానే ఉంది. క్లిష్టమైన పరిస్థితుల్లో బౌలింగ్ వేయాల్సిన స్థితిలో ముగ్గురు పేసర్లు ఒకరికొకరు బాగా సహకరించుకుంటున్నారు.
రాయల్ చాలెంజర్స్ బెంగళూరుపై తమ బౌలర్ల ప్రతిభతో ముంబై నెగ్గగలిగింది. బెంగళూరు విధించిన లక్ష్యం కూడా ఏమంత ప్రమాదకరంగా లేదు. పంజాబ్ కింగ్స్ ఎలెవన్‌పై వారు విజయం తప్ప మరోటి ఊహించలేరు. జట్ల పాయింట్లు టై అయితే ప్లేఆఫ్ బెర్త్‌కు నెట్న్‌ర్రేట్ కీలకమవుతుంది. ఈ విషయంలో ముంబై ఇండియన్స్ దారుణంగా ఉంది. అలాంటి పరిస్థితి రాకూడదనే ముంబై ఆశిస్తోంది. మరోవైపు ప్రస్తుత తమ పరిస్థితిని పంజా బ్ జట్టు ఎలా ఎదుర్కొంటుందనేది కీల కం. ఇక ఏ పరిస్థితిలోనూ క్వాలిఫై కాము అని తెలిసినా ఇంకా నాలుగు మ్యాచ్‌లు ఆడాల్సి రావడం వారికి ఇబ్బందే. తమకు పోయేదేం లేదనే దృక్పథంతో పంజాబ్ ఆడితే ముంబై జాగ్రత్తపడాల్సిందే.
ముంబై జాగ్రత్త పడాలి
Published Fri, May 13 2016 1:03 AM | Last Updated on Sun, Sep 3 2017 11:57 PM
Advertisement
Advertisement