ఐపీఎల్‌లో కొన్ని అంచనాలు తలకిందులైనా ఇప్పుడు టోర్నీ పోటాపోటీ స్థితికి చేరింది.
హర్షా భోగ్లే
ఐపీఎల్‌లో కొన్ని అంచనాలు తలకిందులైనా ఇప్పుడు టోర్నీ పోటాపోటీ స్థితికి చేరింది. రేసులో ఉన్న జట్లకు ఇప్పుడు ప్రతీ మ్యాచ్ కీలకంగానే మారింది. గతంలో రాజస్తాన్ రాయల్స్ (ఆర్‌ఆర్)లాగే తాజాగా డిల్లీ డేర్‌డెవిల్స్ ప్లే ఆఫ్ కోసం తమ శాయశక్తులా పోరాడేందుకు సిద్ధమవుతోంది. ఎందుకంటే వారికి రాహుల్ ద్రవిడ్ రూపంలో రాయల్స్ డీఎన్‌ఏ జట్టులో ఉంది. ఆటగాళ్లను ఎక్కువగా రొటేట్ చేస్తున్నా బ్రాత్‌వైట్‌ను ఎక్కువగా వాడుకోకపోవడం ఆశ్చర్యం కలిగించింది.
మరోవైపు సన్‌రైజర్స్ హైదరాబాద్ పట్టికలో ఉత్తమ స్థానంపై కన్నేసింది. నేటి మ్యాచ్‌లో వీరు గెలిస్తే టాప్-2లో కచ్చితంగా స్థానం దక్కుతుంది. ఫామ్‌లో ఉన్న ధావన్ మరోసారి మెరిస్తే జట్టుకు ప్రయోజనమే. పేసర్ ముస్తఫిజుర్ ప్రదర్శనపై నాకు ఆసక్తిగా ఉంది. గత రెండు మ్యాచ్‌ల్లో అతడి బంతులను బ్యాట్స్‌మెన్ సులువుగానే ఎదుర్కొని పరుగులు చేశారు. ఇప్పుడు తను ప్రతీకారం ఎలా తీర్చుకుంటాడో చూడాలి.