'అతడు ఔటవ్వడం మాకు కలిసొచ్చింది'
వరుస విజయాలతో దూసుకుపోతూ కోల్ కోతా నైట్ రైడర్స్ ప్రత్యర్థి జట్లకు షాక్ ఇస్తుంది. కోల్ కతా కెప్టెన్ గంభీర్ మాట్లాడుతూ.. మేం మరో 10 పరుగులు చేయాలి. ఆ పరుగులు మేం వెనకబడిపోయాం. అయినా, మా బ్యాట్స్ మెన్ చాలా ప్రొఫెషనల్ క్రికెట్ ఆడారు. మొదట్లో బంతి చాలా వేగంగా వచ్చినా, చివర్లో మాత్రం చాలా స్లో అవుతుండటంతో ఆడటం కష్టమైందని చెప్పాడు. మాక్స్ వెల్ ఔటవ్వడం కూడా మ్యాచ్ లో టర్నింగ్ పాయింట్ అని అభిప్రాయపడ్డాడు. ఈడెన్ గార్డెన్స్ లో బుధవారం జరిగిన మ్యాచులో కింగ్స ఎలెవన్ పంజాబ్ పై 7 పరుగుల తేడాతో కోల్ కతా నైట్ రైడర్స్ విజయం సాధించిన విషయం తెలిసిందే.
ఈ మ్యాచ్ మాది అనే ఉద్దేశంతో ఎప్పుడూ ఉండలేమని, ఆండ్రీ రస్సెల్ అద్భుతంగా బౌలింగ్ చేయడం తమకు కలిసొచ్చిందన్నాడు. ప్రత్యర్థి జట్టు ముందు స్వల్ప లక్ష్యాన్ని ఉంచినా... చాంపియన్స్ తరహాలో బౌలింగ్ చేశామని తమ బౌలర్లను ప్రశంసించాడు. ముఖ్యంగా పర్పుల్ క్యాప్ సాధించిన రస్సెల్(4/20) బౌలింగ్ తమ విజయానికి బాటలు వేసిందని గంభీర్ పేర్కొన్నాడు. 12 పాయింట్లతో గుజరాత్ లయన్స్ తో సమానంగా ఉన్నప్పటికీ మెరుగైన రన్ రేట్ తో కోల్ కతా సీజన్ లో తొలిసారి టాప్ ప్లేస్ ఆక్రమించింది.