అరెరె.. మంచి మ్యాచ్ మిస్సయ్యానే! | suresh raina congratulates devilliers and virat kohli | Sakshi
Sakshi News home page

అరెరె.. మంచి మ్యాచ్ మిస్సయ్యానే!

Published Sat, May 14 2016 7:13 PM | Last Updated on Fri, May 25 2018 2:34 PM

అరెరె.. మంచి మ్యాచ్ మిస్సయ్యానే! - Sakshi

అరెరె.. మంచి మ్యాచ్ మిస్సయ్యానే!

తొలి సంతానం కోసం ఎదురుచూస్తున్న గుజరాత్ లయన్స్ కెప్టెన్ సురేష్ రైనా.. అద్భుతమైన మ్యాచ్‌ని మిస్సయినందుకు తెగ బాధపడుతున్నాడు. తమ ప్రత్యర్థి జట్టులోని ఏబీ డివీలియర్స్, విరాట్ కోహ్లీ ఇద్దరూ విధ్వంసకరమైన ఇన్నింగ్స్ ఆడి, ఇద్దరూ సెంచరీలు బాదడాన్ని దగ్గరుండి చూడలేకపోయినందుకు రైనా చాలా బాధపడ్డాడు.

అయితే సిసలైన క్రీడాస్ఫూర్తితో ఇద్దరికీ అభినందనలు చెప్పాడు. తొలిసారి ఓ గేమ్ మిస్సయ్యానని, కానీ ఐపీఎల్‌లోనే చాలా అద్భుతమైన గేమ్ చూశానని, ఇద్దరూ బాగా ఆడారని ట్వీట్ చేశాడు. అంతకుముందు.. ఇంకా తన సంతానం భూమ్మీదకు రాలేదని.. ఈ ఎదురుచూపులు చాలా భారంగా ఉన్నాయని కూడా రైనా ట్విట్టర్‌లో తన మధుర భావాలను పంచుకున్నాడు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement