
‘143’ తర్వాత బ్రేక్!
ఐపీఎల్ ఆరంభంనుంచి ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్ కూడా మిస్ కాకుండా బరిలోకి దిగుతున్న సురేశ్ రైనా తొలిసారి ఒక మ్యాచ్‌కు దూరం కానున్నాడు.
రాజ్‌కోట్: ఐపీఎల్ ఆరంభంనుంచి ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్ కూడా మిస్ కాకుండా బరిలోకి దిగుతున్న సురేశ్ రైనా తొలిసారి ఒక మ్యాచ్‌కు దూరం కానున్నాడు. తన భార్య ప్రసవం కారణంగా నెదర్లాండ్స్ వెళుతున్న రైనా... గుజరాత్ లయన్స్ తర్వాతి మ్యాచ్‌లో ఆడే అవకాశాలు దాదాపుగా లేవు. ‘నా భార్య ను కలిసేందుకు సోమవారం హాలండ్ వెళుతున్నాను. చాలా ఉద్వేగంగా ఉంది’ అని ఆదివారం కోల్‌కతాతో విజయం అనంతరం రైనా చెప్పాడు. లయన్స్ తదుపరి మ్యాచ్‌కు (శనివారం) ముందు చాలా విరామం ఉన్నా...
ఆలోగా కూడా రైనా తిరిగి రాకపోవచ్చు. 2008నుంచి 2015 వరకు చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడిన రైనా, ఈ సారి కొత్త జట్టు గుజరాత్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. ఐపీఎల్‌లో అత్యధికంగా 143 మ్యాచ్‌లు ఆడిన రైనా 3985 పరుగులు చేశాడు.