స్పిన్నర్లు రాణించాలి..
గుజరాత్ లయన్స్ ఇప్పటివరకూ మొత్తం ఏడు మ్యాచ్‌లు ఆడగా, ఐదు మ్యాచ్‌లు ఓడి పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో నిలిచింది. లక్ష్య ఛేదనలో తడబడిన గుజరాత్ జట్టు 7 వికెట్లకు 162 పరుగులు మాత్రమే చేయగలిగింది. మ్యాచ్ అనంతరం మాట్లడిన రైనా, ప్రతిసారి చేజింగ్‌లో విజయం సాధించలేమన్నాడు. అంతేకాక 190 పరుగుల లక్ష్యాన్ని చేజ్ చేయడం అంత సులువేమి కాదని అభిప్రాయపడ్డాడు. మ్యాచ్ విజయం కోసం బౌలర్లు ఏదోకటి చేయాలని సూచించాడు. ఈ మ్యాచ్ మాకు గుణపాఠమని చెప్పకోచ్చాడు. మ్యాచ్ విజయం కోసం స్పిన్నర్లు రాణించాలని రైనా తెలిపాడు.
నెమ్మదిగా చేజింగ్ చేసి విజయం సాధించాలని ప్రయత్నించాం. కానీ సందీప్ శర్మ, మోహిత్ శర్మలు మంచిగా బౌలింగ్ చేసి అడ్డుకట్ట వేశారు. వారిందరీ బౌలింగ్ ప్రదర్శనతో మ్యాచ్ నష్టపోయామని రైనా పేర్కొన్నాడు. "ఈ పరిస్థితిలో ఇంతకు మించి ఇప్పుడు నేను ఏమి చెప్పలేను. మా జట్టు గాయాల సమస్యతో సతమతమవుతుందని తెలిపాడు. కానీ మేము మరిన్ని మ్యాచ్‌లలో విజయం సాధించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నాడు. రాబోయే మ్యాచ్‌లో మేం విజయాలు సాధిస్తామనే నమ్మకం ఉందని సురేశ్ రైనా విశ్వాసం వ్యక్తం చేశాడు.