ఆర్‌సీబీ ఆటతీరు అమోఘం | RCB stunning performance : Kotak | Sakshi
Sakshi News home page

ఆర్‌సీబీ ఆటతీరు అమోఘం

Published Wed, May 18 2016 1:16 AM | Last Updated on Mon, Sep 4 2017 12:18 AM

RCB stunning performance : Kotak

హర్షా భోగ్లే
ఈ సీజన్ ఐపీఎల్ ఆరంభంలో పెద్దగా రాణించలేకపోయిన బెంగళూరు ఇప్పుడు ప్రత్యర్థుల పాలిట సింహస్వప్పంగా మారింది. వాళ్లతో మ్యాచ్ అంటేనే ప్రత్యర్థులు భయపడే స్థితికి చేరుకున్నారు. ఏ ప్రమాణాల పరంగా చూసినా రాయల్ చాలెంజర్స్ ఆటతీరు అమోఘం. నేను ఇలా చెప్పడం అతిశయోక్తి ఎంతమాత్రం కాదు. ఎందుకంటే విరాట్ కోహ్లి, డివిలియర్స్ ఆట అంచనాలను మించిపోయింది.

నేడు ఆర్‌సీబీ... కింగ్స్ ఎలెవన్‌తో తలపడుతుంది. రెండో అర్ధభాగంలో పంజాబ్ కూడా గట్టి జట్టుగా తయారైంది. అయితే ఇప్పుడు టెన్షన్ అంతా బెంగళూరుపైనే. ఈ మ్యాచ్‌లో పంజాబ్ అండర్‌డాగ్స్‌గా బరిలోకి దిగుతోంది. ఒకవేళ మురళీసేన గనుక గెలిస్తే ఆర్‌సీబీకి పెద్ద నిరాశే. అయితే బెంగళూరు ఎలా ఆడుతుందోనన్న బెంగను వదిలేసి పంజాబ్ తమదైన శైలిలో చెలరేగితే బాగుంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement