
మురళీ విజయ్‌కు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ పగ్గాలు
ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో నిరాశాజనక ప్రదర్శన కనబరుస్తోన్న కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు సారథ్య బాధ్యతల్లో మార్పు చేసింది. ఇప్పటిదాకా కెప్టెన్‌గా ఉన్న దక్షిణాఫ్రికా ప్లేయర్ డేవిడ్ మిల్లర్‌ను తప్పించి... అతని స్థానంలో భారత్‌కు చెందిన మురళీ విజయ్‌ను కొత్త కెప్టెన్‌గా నియమించింది. ఈ సీజన్‌లో మిల్లర్ ఆరు ఇన్నింగ్స్‌లో కలిసి మొత్తం 76 పరుగులు చేయగా... మురళీ విజయ్ 143 పరుగులు సాధించాడు.