ఐపీఎల్ నుంచి మాక్స్ వెల్ ఔట్!
మెల్ బోర్న్: కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కీలక ఆటగాడు మాక్స్ వెల్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ నుంచి వైదొలగనున్నాడు. ఈ విషయాన్ని క్రికెట్ ఆస్ట్రేలియా మంగళవారం అధికారికంగా వెల్లడించింది. పంజాబ్ ఆల్ రౌండర్ మాక్స్ వెల్ ఎడమ చేతికి గాయమైందని దాంతో అతడు ఇబ్బంది పడుతున్నాడని క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది. దీంతో లీగ్ మ్యాచులకు దూరం కానున్నాడు. ఆస్ట్రేలియా జట్టు త్వరలో వెస్టిండీస్ లో పర్యటించనుంది. ఈ నేపథ్యంలో మాక్స్ వెల్ విశ్రాంతి తీసుకుంటేనే జూన్ 5న మొదలయ్యే ఆ టూర్ సమయానికి అతడు ఫిట్ నెస్ గా ఉంటాడని పేర్కొంది.
ఎడమ చేతి గాయం పైకి కనిపించడం లేదని, మాక్స్ వెల్ మాత్రం నొప్పితో బాధ పడుతున్నాడని ఆసీస్ అధికారులు వెల్లడించారు. దీంతో ఐపీల్-9 సీజన్ నుంచి వైదొలగిన 5వ ఆసీస్ క్రికెటర్ అయ్యాడు. గాయాల కారణంగా ఈ ఐపీఎల్ మధ్యలోనే తప్పుకున్న వాళ్లలో ఆసీస్ ఆటగాళ్లు ఎక్కువ మంది ఉన్నారు. స్టీవ్ స్మిత్, జాన్ హెస్టింగ్స్, షాన్ మార్ష్, మిచెల్ మార్ష్ ఇప్పటికే ఈ టోర్నీకి దూరమైన విషయం తెలిసిందే.