వినోదానికి రెఢీ!
ఐపీఎల్ ఎనిమిదో సీజన్ హైదరాబాద్‌కు కాస్త ఆలస్యంగా వచ్చింది. నగరంలో తొలి మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. శనివారం ఉప్పల్ స్టేడియంలో ధోని నాయకత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు తలపడనుంది. ఉప్పల్ స్టేడియంలో రాత్రి 8 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మ్యాచ్ టికెట్లన్నీ అమ్ముడు పోయాయి. ఇక క్రికెట్ ప్రేమికులకు సందడే సందడి..